Wednesday, February 26, 2020

సాయి ప్రస్థానంలో న్యాయవాదులుSAIPRASTANAMULOLAWYERS

సాయి ప్రస్థానంలో న్యాయవాదులుSAIPRASTANAMULOLAWYERS...,,,,,ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0Xj-HG3_1MmFkWRb-1rZVf....సాయి ప్రస్థానంలో న్యాయవాదులు:    1). రావుబహద్దూర్ S.P ధుమాల్ (భావూ)   2). బి. లఘాటే (పూనా)   3).  బాలగంగాధర తిలక్   4). పండరీపురం లాయర్.  5).  పుండలీకరావు. 6). బాలారాం దురంధర్ 7).  శేవడే   8). సపత్నేకర్.  9). ఠక్కర్ థరమ్సె జెఠాభాయి  10).   కాకాసాహెబ్ దీక్షిత్...
  సాయి భక్తులలో న్యాయవాదులకు చాలా ప్రత్యేకమైన స్థానం కలదు.   ఎంతోమంది న్యాయవాదులు సాయిని త్రికరణశుద్ధిగా నమ్మి కొలిచిన వారిలో ఎందరో న్యాయమూర్తుల కలరు.   వారి గురించి, వారు సాయికి చేసిన సేవ గురించి, సాయిసేవలో వారు తరించిన విధానాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు.  సాయి భక్తులైన న్యాయవాదుల గురించి ఈ వీడియోల ద్వారా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.  ఓం శ్రీ సాయిరాం.🙏🙏

Wednesday, February 19, 2020

కాల భైరవ ఆరాధన కాలభైరవప్రధాన క్షేత్రాలు


కాలభైరవ ప్రధాన క్షేత్రాలు:కాల భైరవ ఆరాధన కాలభైరవ ప్రధాన క్షేత్రాలు KALA BHAIRAVA ARADHANA KALABHAIRAVA MAIN TEMPLESక్షేత్రపాలకుడిగా కాలభైరవ ప్రధాన క్షేత్రాలు:( మరియు) ఉపాలయాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0GIqF5gjNkJJEMXCAC_y4b






1). ఇసన్నపల్లి 2). రామగిరి 3). భైరవ సెల 4). అడవివరం 5). భైరవ కొండ 6). కాళేశ్వరం 7). మోపూరు 8). పాకర్ల వారిపాలెం 9). మున్నంగి 10). భైరవ పాడు..
క్షేత్రపాలకుడిగా భైరవ క్షేత్రాలు:
1). రాజమండ్రి 2). మూలపేట 3). చేబ్రోలు 4). సామర్లకోట 5). పెదకళ్ళేపల్లి 6). మురముళ్ళ 7). ద్రాక్షారామం 8). హటకేశ్వరం 9). పొన్నూరు 10). అహోబిలం..
1). శ్రీకాళహస్తి 2). అయినవిల్లి 3). పిఠాపురం 4). కొలనుభారతి 5). సత్రశాల 6). ముక్తేశ్వరం 7). జుత్తిగ కాలభైరవ ఉపాలయాలు:

సాయి ప్రస్థానంలో దంపతులు:


సాయి ప్రస్థానంలో దంపతులు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2ahsw70FlGhU08RQtc7uTa










1). కాకాసాహెబ్ దీక్షిత్ దంపతులు.. 2). సపత్నేకర్ దంపతులు.. 3). ఆత్మారాం వైద్య.. 4). అబ్బా సావంత్.... 5). చంద్రాబాయి బోర్కర్.. 6). బాపూసాహెబ్ జోగ్... 7). హరివినాయక్ సాఠే... 8). రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్... 9). గణపతిరావు కోతే పాటల్... 10). గణేష్ ఖపర్డే... 11). అణ్ణాచించిణీకర్.. 12). ఔరంగాబాద్ కర్ దంపతులు.. 13). బాలాజి పాటల్ నేవాస్కర్... 14). నిమోన్కర్... 15). కాశీబాయి- హంసరాజు... 16).. రఘువీర భాస్కర పురంధరే... 18). ఎం. డబ్ల్యు. ప్రధాన్...

సాయి ప్రస్థానంలో దంపతులు చాలా అద్భుతమైన శీర్షిక. బాబాని సేవించిన ఒక్కొక్క దంపతుల గురించి, చాలా మంచి సమాచారం ఉంది. ప్రతిరోజు సాయి సచ్చరిత్ర చదువుతూ, దంపతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. భార్యాభర్తలు ఇరువురూ కలిసి సాయిని సేవిస్తే, ఇంతటి మహత్యాన్ని, గొప్ప లీలలను ప్రదర్శించారు. ఇలా సాయిని సేవించిన వారిలో చాలామంది దంపతులు ఉన్నారు. వారిలో కొందరు చాలా ప్రముఖ పాత్ర వహించారు. భార్యాభర్తలు ఇరువురూ సేవిస్తే, బాబా మహిమలు అమోఘం. సచ్చరిత్రలో విడివిడిగా చదువుతాం. ఇద్దరూ కలిసి సేవించిన సమాచారం అంతా ఒకచోట దొరకటం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ప్రతి భార్యాభర్తలు తెలుసుకోవలసిన సమాచారం, సాయి ప్రస్థానంలో దంపతులు..:

సాయి ప్రస్థానంలో వైద్యులు


సాయి ప్రస్థానంలో వైద్యులు @ SAI PRASTHANAMULO DOCTORS...సాయి ప్రస్థానంలో వైద్యులు:






1). డాక్టర్ పరమానంద్.. 2). డాక్టర్ పండిట్... 3). డాక్టర్ రామారావు కొఠారే... 4). డాక్టర్ టెండూల్కర్... 5). డాక్టర్ రామభక్తుడు... 6). డాక్టర్ పిళ్ళ... 7). డాక్టర్ మాలేగాన్ వైద్యులు..ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A1pjdRoNdJUv3GkmKXD6W56

సాయి శిరిడిలో ద్వారకామాయిలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడిగా పేరు పొందారు. వారు రోగులకు వైద్యం చేసే పద్ధతి కూడా చాలా విశిష్టంగా ఉండేది. వైద్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎంతో మంది వైద్యులు కూడా సాయిని సేవించి తరించారు. వారి గురించి వారు సాయి దర్శించిన పరిస్థితతులు, విధానాన్ని చాలా బాగా వివరించారు.

సాయి ప్రస్థానంలో జ్యోతిష్కులు


సాయి ప్రస్థానంలో జ్యోతిష్కులు 1.ములేశాస్త్రి 2. గోపాల నారాయణ అంబాడేకర్ 3 నానా సాహెబ్ డెంగ్లే....సాయి ప్రస్థానంలో జ్యోతిష్కులు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A1BzlRfugXRHUlqOCg7_jFo
1). ములేశాస్త్రి....2). గోపాల నారాయణ అంబాడేకర్...3). నానా సాహెబ్ డెంగ్లే...
సర్వాంతర్యామి ,సర్వవ్యాపకుడు అయిన సాయిని కొంతమంది జ్యోతిష్కులు దర్శించుకున్నారు. సర్వము తెలిసిన సాయికే జ్యోతిష్యం చెప్పాలని ప్రయత్నించిన వారు ఒకరు. జ్యోతిష్యంలో నైపుణ్యం ఉండి కూడా కర్మానుసారం కష్టాలపాలై ప్రాణత్యాగం చేయాలనుకున్న మరొక జ్యోతిష్యునికి కర్తవ్య బోధచేసి కాపాడారు బాబా. సాయికి తెలియకుండా, సాయి అనుమతి లేకుండా, ఏదీ జరగదు! అనడానికి నిదర్శనంగా, మరొక జ్యోతిష్కుడు చెప్పిన మాటని, సాయి వాక్కు ద్వారా ప్రమాదం నుండి కాపాడారు.

సాయి ప్రస్థానంలో న్యాయమూర్తులు


సాయి ప్రస్థానంలో న్యాయమూర్తులు1).ఎం బి రేగే2)తాత్యా సాహెబ్ 3)నానాసాహెబ్ శంకర్ నిమోన్కర్ 4 )కణీత్కర్.సాయి ప్రస్థానంలో న్యాయమూర్తులు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0IOF4OIs_pDndYPMo4KW8o

1). ఎం.బి. రేగే... 2). తాత్యా సాహెబ్ నూల్కర్... 3). నానాసాహెబ్ శంకర్ నిమోన్కర్... 4). కణీత్కర్....



ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని, ఎంతో పెద్ద గొప్ప హోదాలో ఉండి న్యాయమూర్తులుగా, అత్యున్నతమైన స్థానంలో
ఉండి కూడా, సాయిని దర్శించుకొని సేవించిన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. అంత గొప్ప వ్యక్తులు కూడా, బ్రహ్మజ్ఞాని ముందర ఎంతో వినయంగా సాయిని సేవించి తరించారు. ఇప్పటి సాయి భక్తులకు వీరందరూ గొప్ప ఆదర్శం..

ఏకాదశ రుద్రులు జగ్గన్న తోట ప్రభల తీర్థం


ఏకాదశ రుద్రులు జగ్గన్న తోట ప్రభల తీర్థం ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరుhttps://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2QnPvjtj6l9qe50t8Pa0QK





ఏకాదశ రుద్రులు జగ్గన్న తోట ప్రభల తీర్థం గురుంచి మొట్ట మొదటిసారిగా సాయి టీవీ చానల్ ప్రసారం అందించిన్నారు. ఈ ఏకాదశ రుద్రులు శివాలయములు ప్రభల తీర్థం గురుంచి ఇంతవరకు వార్త పత్రికలలో తెలియజేస్తున్నారు.మొట్ట మొదటిసారిగా తెలియజేసిన తప్పకుండా ఈ వీడియో చూడగలరు. మీ సన్నిహితులు కు పంపగలరు.జగ్గన్నతోట ప్రభల తీర్థం:

కోనసీమలో తరతరాల నుండి సంక్రాంతికి వైభవంగా జరుగుతున్న ఉత్సవాలు జగ్గన్నతోట ప్రభల తీర్థం. మనమందరం సంక్రాంతి పండగని బంధు మిత్రులతో జరుపుకుంటాము. ఆ పర్వదినాన ఎక్కడెక్కడినుండో బంధువులందరూ ఒకే చోటికి చేరుకుంటారు. ఏకాదశరుద్రులుకి సంక్రాంతి పండుగకి సంబంధం ఏమిటంటే! ఏకాదశరుద్రులు అందరూ కలిసి ఒకేచోట సమావేశమవుతారు. అది ఎలాగంటే? ఆయా శివాలయాల నుండి 11 ప్రభలు వచ్చి, ఒక చోట సమావేశం అవుతాయి. ఈ సమావేశాన్ని "జగ్గన్నతోట ప్రభల తీర్థం" అంటారు. ఈ జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి కానీ, గోపురం కానీ లేవు. అక్కడంతా ఉన్నది కొబ్బరితోట. పెద్దాపురం సంస్థానాధీశులు "శ్రీ రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు" గారు 400 సంవత్సరాల క్రితం ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. 400 సంవత్సరాల క్రితం విపరీతమైన కరువు, కాటకాలు వచ్చాయి. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే పెద్దాపురం సంస్థానాధీశులు (వీరి తోట కనుక వారి పేరుమీద జగ్గన్నతోట అనే పేరు) వారి కొబ్బరి తోటలోకి 11 దేవాలయాల నుండి తీసుకువచ్చిన ప్రభలనన్నింటిని, ఒకచోట కూర్చుని 11 రుద్రులు కలసి, మన దేశ భౌగోళిక పరిస్థితుల గురించి చర్చిస్తారని ఇక్కడి పెద్దలు చెబుతారు. ఈ సాంప్రదాయం ప్రారంభించినది, జగన్నాథ మహారాజు గారు. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఈ ప్రభల సమావేశం జరిగి తీరవలసిందే! ఈ ఉత్సవం సంక్రాంతి మరునాడు కనుమ రోజు జరుగుతుంది. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల 250 గ్రామాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. అంతేకాదు దేశ విదేశాలలో స్థిరపడిన ఈ ప్రాంతవాసులందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. కోనసీమలో 84 చోట్ల ఈ ప్రభలతీర్థాలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి: 1). జగ్గన్నతోట ప్రభల తీర్థం 2). వాకాల గరువు 3). కొర్లగుంట. ఈ మూడుచోట్ల ప్రభలతీర్థాలు వైభవంగా జరుగుతాయి. ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు...ఆ రుద్రులు పేర్లు:
1). వ్యాఘ్రేశ్వరం - శ్రీ వ్యాఘ్రేశ్వరం స్వామి 2). పుల్లేటికుర్రు- అభినవ వ్యాఘ్రేశ్వరం స్వామి 3). మొసల పల్లి -మధు మానంత భోగేశ్వరస్వామి 4). గంగలకుర్రు- చెన్న మల్లేశ్వరుడు 5 గంగలకర్రు (అగ్రహారం)- వీరేశ్వరుడు. 6). పెదపూడి- మేనకేశ్వరుడు 7). ఇరుసుమండ -ఆనంద రామేశ్వరుడు 8). వక్కలంక- విశ్వేశ్వరుడు 9). నేదునూరు- చెన్న మల్లేశ్వరుడు 10). ముక్కామల -రాఘవేశ్వరుడు 11). పాలగుమ్మి- చెన్న మల్లేశ్వరుడు. ఈ తోట మొసలపల్లి గ్రామంలో ఉంది, కనుక దీనికి ఆతిథ్యం మొసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరూ రుద్రులూ తిరిగి వెళ్ళిన తరువాత వెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు. "శ్రీ వ్యాఘ్రేశ్వరుడు" ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాద పూర్వకంగా ఒక్కసారి లేపి మళ్ళీ కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానం....ఏకాదశ రుద్రులు వాటి గ్రామాల సమాచారం: ఏకాదశరుద్రులు: 1). వ్యాఘ్రేశ్వరం:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం. 2). పుల్లేటికుర్రు:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, అంబాజీపేటకి 6 కిలోమీటర్ల దూరం, అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3). మొసలపల్లి:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలంలో ఉంది. 4). గంగలకుర్రు:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 4 కిలోమీటర్లు, అమలాపురం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5). గంగలకుర్రు అగ్రహారం:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట నుండి అమలాపురం వెళ్లే దారిలో, బండార్లంక వీరభద్ర స్వామి గుడి ప్రక్క రహదారిలో, ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. 6). కే. పెదపూడి:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 5 కిలోమీటర్లు, అమలాపురం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 7). ఇరుసుమండ:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 7 కిలోమీటర్లు, అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8). వక్కలంక:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే దారిలో, తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. 9). నేదునూరు:- తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలం అయినవిల్లి నుండి 2 కిలోమీటర్లు, అమలాపురం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10). ముక్కామల:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 8 కిలోమీటర్లు, అమలాపురం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11). పాలగుమ్మి:- తూర్పు గోదావరి జిల్లా, మండల కేంద్రమైన అమలాపురం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది...ఏకాదశరుద్రులు:---- 1). విశ్వేశ్వర రుద్రుడు-- వ్యాఘ్రేశ్వరం:( శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత వ్యాఘ్రేశ్వరం స్వామి).. బ్రాహ్మణుడు పులిని శివునిగా భావించి, బిల్వ పత్రాలతో అర్చన చేశాడు. ఆ పులి శివునిగా లింగముగా మారింది. వ్యాఘ్రము శివునిగా అవతరించుట వలన, వ్యాఘ్రేశ్వర స్వామిగా పేరు వచ్చింది. 2)మహదేవ రుద్రుడు- కె.పెదపూడి: ( పార్వతి సమేత మేనకేశ్వర స్వామి) విశ్వామిత్రుడి తపోభంగమునకు మేనకను ఇంద్రుడు పంపెను. వారి ఇరువురు సంతానం శకుంతల. మేనక స్వర్గమునకు పోదామని ప్రయత్నించగా వెళ్ళలేకపోయాను. ఆమె శివుని ప్రార్థించగా, ఆయన ఒక శివలింగ మేనక ఇచ్చి, ఆ ప్రదేశంలో ప్రతిష్టించమనెను. అప్పుడు మేనక కృష్ణ రాయుడు పెదపూడి( కె. పెదపూడి) నందు మేనక ప్రతిష్టించినది కాబట్టి, మేనకేశ్వర స్వామి. 3) త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ: ( శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆనంద రామేశ్వరస్వామి) రావణుని సంహరించిన అనంతరం, శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా, అయోధ్యకు వెళ్ళుచుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ నందు, పుష్పక విమానం కదలకుండా నిలిచి పోయింది. శ్రీరాముడు శివుని ప్రార్థించి శివలింగము ప్రతిష్టించెను. అప్పుడు పుష్పకవిమానము కదలగా అందరూ ఆనందభరితులైరి. రాముని చేత ప్రతిష్టించబడినది కాబట్టి రామేశ్వరము. అది అందరికీ ఆనందదాయకం అగుటచే, ఆనంద రామేశ్వరం అని పిలవబడింది. 4) త్రిపురాంతక రుద్రుడు--వక్కలంక (అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు) త్రిపురాసురులను శివుడు వధించిన తర్వాత, వక్కలంక గ్రామమునందు శివలింగ రూపమున ఆవిర్భవించెను. తారకాసురుని పుత్రులు మూడు పురములుగా, త్రిపురాసురులుగా పేరుపొందెను. గ్రామపు బ్రాహ్మణోత్తములు నుండి ప్రతిష్టించబడినది కావున విశ్వేశ్వరునిగా పిలవబడుతున్నది. 5) త్రికాగ్ని కాలాయరుద్రుడు-- నేదునూరు (సర్వమంగళ పార్వతీ సమేత చెన్న మల్లేశ్వర స్వామి) మూడు అగ్నుల నందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి, శివుడు లింగరూపం పొందుట వలన త్రికాగ్ని కాలునిగా పిలవబడుతున్నది. అగస్త్య మహర్షి చేత ప్రతిష్టించబడినది కావున, నేదునూరు చెన్న మల్లేశ్వర స్వామిగా పిలుస్తారు. 6) కాలాగ్ని రుద్రుడు-- ముక్కామల ( బాలా త్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామి) రావణ సంహారం అనంతరం, అగస్త్య మహాముని అయోధ్య వెళ్ళుతున్న రాముని చేత, ఈ ప్రదేశం నందు శివలింగము ప్రతిష్ఠింప చేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్య అస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠించబడుట వలన రాఘవేశ్వరుడు అని పిలువబడుచున్నది. పాండవ వనవాసం కాలంలో శివుడు అర్జునుని పరీక్షించదలచి, కిరాతకుని రూపంలో అర్జునుని ధైర్య పరాక్రమాలను చూసి, కాలాగ్ని రుద్రుడు పాశుపతాస్త్రము ప్రసాదించెను. 7). నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలా త్రిపుర సుందరి అనంత భోగేశ్వర స్వామి) దేవతలు, రాక్షసులు క్షీరసాగర సమయములో, విషము ఎవరికీ హాని కలగకుండా, తన కంఠంలో దాచుకొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడు మొసలపల్లి గ్రామము నందు, లింగ రూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలు అందించారు. అనేక భోగులను (పాములను) ధరించినవాడు, అందుచే అనంత భోగేశ్వరస్వామి అయినారు. 8). మృత్యుంజయ రుద్రుడు-- పాలగుమ్మి (శ్రీ శ్యామలంబా సమేత చెన్న మల్లేశ్వర స్వామి) శివుడు అర్థాయుష్కుడైన మార్కండేయుని రక్షించి, మృత్యుంజయుడు అయ్యాడు. ఆ మృత్యుంజయుడు లింగ రూపమున పాలగుమ్మి క్షేత్రమున ఆవిర్భవించెను. చెన్న మల్లేశ్వర స్వామిగా పేరుగాంచెను. 9). సర్వేశ్వర రుద్రుడు-- గంగలకుర్రు అగ్రహారం (ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారు) యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక, తన కాలి బొటన వేలుతో వ్రాయుట వలన, పుట్టిన అగ్నిజ్వాలలో బూడిద అయినందున శివుడు ఆగ్రహించి ఉగ్ర రూపుడై, నృత్యము చేసి తన జటాజూటంలో, ఒక జటను తీసి నేలపై కొట్టుట వలన, శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. దక్షయజ్ఞం ధ్వంసం చేసెను. ఉగ్ర రూపుడైన వీరేశ్వర స్వామిని లింగ రూపమున బ్రాహ్మణోత్తములు ప్రతిష్టించారు. 10) సదాశివ రుద్రుడు-- గంగలకుర్రు (సర్వమంగళ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి) పూర్వం బ్రహ్మ ,విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చి, శివుని తమలో ఎవరు గొప్ప అని అడుగగా, అప్పుడు శివుడు ఆద్యంతాలు లేని లింగ రూపమును ధరించి, తన శిరస్సు బ్రహ్మను, పాదములను విష్ణువును, చూసి రమ్మని పంపెను. శివుని శిరస్సును చూడలేకపోయినా, ఒక ఆవును, మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని, తాను చూసితిని అని బ్రహ్మ చెప్పెను. విష్ణువు పాదములను చూడలేకపోయానని చెప్పెను. బ్రహ్మకు పూజాపునస్కారాలు లేకుండా, శివుడు శపించెను. విష్ణువు అగ్రగణ్యుడు అని చెప్పెను. వేద పండితులు, బ్రాహ్మణులు చెన్న మల్లేశ్వర స్వామిని ప్రతిష్టించిరి. 11) శ్రీ మన్మహాదేవ రుద్రుడు-- పుల్లేటికుర్రు (శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వరుడు) పూర్వము విష్ణువు, శివుని సహస్ర కమలాలతో, సహస్రనామాలతో పూజించెను. దానికి మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవుడు పుల్లేటికుర్రులో లింగరూపంలో ఆవిర్భవించెను. పుల్లేటికుర్రుకి పుండరీకము అని పేరు. పుండరీకము అనగా పులి అని అర్థం, వ్యాఘ్రేశ్వరము నందు అభినవ వ్యాఘ్రేశ్వరుడిగా పేరుపొందెను

ఆంధ్ర- తెలంగాణ- భారతదేశంలోని ప్రముఖమైన గణపతి క్షేత్రాలు:


ఆంధ్ర- తెలంగాణ- భారతదేశంలోని ప్రముఖమైన గణపతి క్షేత్రాలు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2uoghedfF4p5KOXYUffhvD

1). కాణిపాకం 2). అయినవిల్లి 3). బిక్కవోలు 4). శ్రీశైలం 5). చోడవరం 6). సికింద్రాబాద్ 7). విశాఖపట్టణం 8). కాజీపేట 9). రాయదుర్గం. 1). రేజింతల్ 2). రుద్రారం 3). కొలనుపాక 4). అవంచ 5). వినుకొండ 6). సిద్ధాంతం 7). శ్రీకాళహస్తి 8). నెల్లూరు 9). యానాం భారతదేశంలో గణపతి క్షేత్రాలు:1). మధుర (కేరళ) 2) కొంకళపూలే (మహారాష్ట్ర) 3). మోర్ గావ్ (మహారాష్ట్ర). 4). రణదంబూర్ కోట (రాజస్థాన్) 5). చండీకోల్ (ఒడిస్సా) 6). ఉజ్జయిని (మధ్యప్రదేశ్) 8). బొంబాయి (మహారాష్ట్ర) 9. తిరుచ్చి (తమిళనాడు)..1. ఆంధ్ర ప్రదేశ్ (చిత్తూరు జిల్లా- కాణిపాకం) (స్వయంభూ క్షేత్రం--సత్యప్రమాణం) 2. ఆంధ్ర ప్రదేశ్( తూర్పు గోదావరి జిల్లా ,అయినవల్లి) (విఘ్నేశ్వర స్వామి --108 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం) 3. ఆంధ్ర ప్రదేశ్ (తూర్పు గోదావరి జిల్లా-- బిక్కవోలు) (గణపతి చెవిలో కోరిక చెప్తే ఆ కోరిక నెరవేరటం 4. శ్రీశైలం ( సాక్షి గణపతి-- వ్రాతపతి గణపతి) ( శ్రీశైలం వచ్చినట్లుగా సాక్ష్యం చెప్పేవారు) 5. ఆంధ్ర ప్రదేశ్ (విశాఖపట్టణానికి –44 కి:మీ దూరం-- చోడవరం)( స్వయంభూ క్షేత్రం-- మత్స్య గణపతి) 6. తెలంగాణ.( సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన)( శ్రీ గణపతి దేవాలయం-- వందల ఏళ్ళ చరిత్ర గలది) 7 . ఆంధ్ర ప్రదేశ్ (విశాఖపట్టణం-- సంపత్ వినాయకుడు) (కోరిక అనుకొని నమస్కారం చేస్తే కోరిక తీరడం) 8. తెలంగాణ . (వరంగల్ జిల్లా- కాజీపేట)( శ్వేతార్క మూల గణపతి-- తెల్ల జిల్లేడు మొదలులోంచి సహజంగా నిర్మాణం) 9. ఆంధ్ర ప్రదేశ్ (అనంతపురం జిల్లా-- రాయదుర్గం) (దశభుజ గణపతి) ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ గణపతి ఆలయాల గురించి తెలియజేశారు. దీని ద్వారా మేము ఏ ఆలయాలు దర్శించాలి, ఏ ఆలయాలు దర్శించుకున్నాము అనే విషయం అర్థమైంది..తెలుగు రాష్ట్రాల్లో 9 గణపతి దేవాలయాలు: 1) రేజింతల్:( సిద్ధి వినాయకుడు):- మెదక్ జిల్లా జహీరాబాద్ కు 12 కిలోమీటర్ల దూరంలో, రేజింతల్ గ్రామంలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం, 213 సంవత్సరాల క్రితం కనుగొన్న ఆలయం. 5 అంతస్తులతో ఉన్న ఆలయం. రేజింతల్ కు మలకల్ గుట్ట అని పేరు ఉన్నది. స్వయంభు వినాయక విగ్రహం. కోరిన కోరికలు తీర్చటం వలన సిద్ధి వినాయకుడిగా పేరుపొందింది. మొదట్లో ఈ శిలా విగ్రహం ఒకటిన్నర అడుగుల ఉండేదని, అది క్రమేణా పెరుగుతూ ఇప్పుడు మరింత పెద్దది అవుతుంది. 2) రుద్రారం:( విద్యా గణపతి):- సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు దగ్గరలో, రుద్రారంలో సంకష్టహర సిద్ధి విద్యా గణపతి ఆలయం ఉంది. వందల ఏళ్ల నాటి ఆలయం శివరాం భట్ అనే ఆధ్యాత్మిక గురువు చేత నిర్మించబడినది. వీరు రుద్రారం నుండి రేజింతల్ వరకు 5 వినాయక ఆలయాలు నిర్మించారు. అవి చింతల గిరి, చీమకుర్తి, మలకల్ పాడు, మలకల్ గుట్ట, రేజింతల్, రుద్రారం. ఈ వినాయకుని ఆలయాలలో శ్రీచక్ర బీజాక్షరాలు ఉండుటచేత, సామాన్యులు తట్టుకోవడానికి సింధూర లేపనం ప్రతిరోజు అద్దం పడుతుంది. హైదరాబాద్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో గణేష్ గడ్డ ఉన్నది. 3) కొలనుపాక:( గణపతి ):- వీరశైవ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశం, గణపతి విగ్రహం, చాళుక్య శిల్ప కళా చాతుర్యంతో ఉంటుంది. గణపతి చతుర్భుజాలతో ఉంటాడు. 11వ శతాబ్దంలో చెక్కబడిన విగ్రహం, ఎడమ చేతిలో మోదకం, కుడి చేతి మోకాలుపై ఆధారముగా ఉన్నది. సర్ప ఉదర బంధం ఉన్నది. ఇక్కడ గణపతికి భక్తులు ముడుపులు కట్టి చెల్లించుకుంటారు. యాదగిరిగుట్ట కు 22 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాదుకు 78 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 4) అవంచ:( గణేశుడు ):-మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని అవంచ గ్రామంలో, అసంపూర్ణ భారీ గణేశ శిలా నిర్మాణం ఉంది. 30 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు గల కొండకు, వినాయక రూపం కల్పించాలని ఆశించారు. తైలపుడు అనే పశ్చిమ చాళుక్యుల రాజు, భారీ వినాయక విగ్రహం తుది మెరుగులు దిద్ద లేకపోయారు. కొన్ని కారణాల వలన తర్వాత రాజులు కూడా పట్టించుకోక పోవడం వలన, అసంపూర్ణ గణపతి విగ్రహం రూపం కనిపిస్తుంది. హైదరాబాదు నుండి 86 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 5) వినుకొండ:( వరసిద్ధి వినాయకుడు ):- గుంటూరు జిల్లాలో వినుకొండలో, శ్రీరామునిచే ప్రతిష్టించినట్లుగా చెప్పబడుతున్న, వరసిద్ధి వినాయకుని విగ్రహం ఏకశిలా విగ్రహం. దక్షిణముఖంగా ఉన్నది. ప్రతిరోజూ ఒక నాగుపాము ప్రదక్షిణ చేసి వెళ్ళుట విశేషం. వినాయక చవితి ఉత్సవాలకు లక్షల మంది భక్తులు వస్తారు. గుంటూరు నుండి వినుకొండ 88 కిలోమీటర్ల దూరంలో వుంది. 6) సిద్ధాంతం:( సిద్ధి వినాయకుడు ):- పశ్చిమగోదావరి జిల్లాలో, పెనుగొండ మండలంలో సిద్ధాంతంలో, సిద్ధి వినాయకుడి ఆలయంలో సిద్ధి వినాయకుడి విగ్రహం, ఐదు అడుగుల ఎత్తు ,నాలుగు అడుగుల వెడల్పు ఉన్నది. కొన్ని సంవత్సరాల క్రితం దుక్కి దున్నుతూ ఉండగా లభ్యమైన విగ్రహాన్ని, ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. ఏలూరు నుండి సిద్ధాంతం 91 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 7) శ్రీకాళహస్తి:( పాతాళ వినాయకుడు ):- శ్రీకాళహస్తి ఆలయంలో, ఉత్తర గోపురం ముందుకు వెళితే, ఎడమవైపున పాతాళ వినాయకుడి ఆలయం ఉంది. భూ మట్టానికి 35 అడుగుల దిగువన ఉండే ఆలయంలో, స్వామిని దర్శించాలి అంటే ఒక్క మనిషి మాత్రమే పట్టే ఇరుకు దారిలో, కొన్ని అడుగులు పాకుతూ వెళ్లి ,25 మెట్లు క్రిందకి దిగాలి. తిరుపతి నుండి శ్రీకాళహస్తి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8) నెల్లూరు:( అతి పెద్ద గణపతి ):-ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు నందు, మూలపేట నందు మూలస్థానేశ్వర ఆలయమునకు దక్షిణంగా ఉన్న ఆలయంలో, ఒక పెద్ద గణపతి అతిపెద్ద విగ్రహంతో ఉంటుంది. ఒంగోలు నుండి నెల్లూరు 132 కిలోమీటర్ల దూరంలో ఉంది. 9) యానాం:( సిద్ది గణపతి ):-సిద్ధి గణపతి పిళ్ళైయార్ స్వామిగా కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తాడు. 13- 7- 1954వ సంవత్సరంలో, తమిళుడైన రెడ్డియార్ పట్టి స్వామి అనే వైద్యుడు, రావిచెట్టు వద్ద వైద్యం చేసేవారు. ఒకరోజు స్వామివారు కలలో కనిపించి, రావిచెట్టు వద్ద పుట్టలో ఉన్నట్టుగా చెప్పారు. పుట్టలో ఉన్న గణపతిని తీసి రావిచెట్టు క్రింద గట్టుపై ఉంచి పూజాదికాలు నిర్వహించారు. పిళ్ళైయార్ గా నామకరణం చేశారు. 108 కొబ్బరికాయలు, 108 ప్రదక్షిణాలు చేయాలి. యానాం కాకినాడ నుండి, 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.భారతదేశంలో 9 వినాయక ప్రముఖ క్షేత్రములు1. కేరళ (కాసర్ గౌడ్ 7కి:మీ దూరం మధుర) (మధుర మహాగణపతి ఆలయం-- బొడ్డ గణేశుడు- పెద్ద గణపతి) 2. మహారాష్ట్ర( రత్నగిరికి -25 కి:మీ-- కొంకళ పూలే-- పడమర ముఖ దర్శనం-- లంబోదరుడు) 3. మహారాష్ట్ర.( పూలే జిల్లా మోర్ గావ్)( మయూరే శ్వరుడు) 4. రాజస్థాన్ (రణ ధంబూర్ కోటలో )(ప్రథమ గణేష ఆలయం-- త్రినేత్ర గణపతి) 5. ఒడిస్సా (జాజి పూర్ జిల్లా చండీ కోల్-- మహా వినాయక ఆలయం ) 6. మధ్యప్రదేశ్( ఉజ్జయని--- చింతామణి గణపతి) 7. తమిళనాడు ( శివగంగై జిల్లా పిళ్యార్ పట్టి-- కర్పగ వినాయక ఆలయం) 8. మహారాష్ట్ర (బొంబాయి --సిద్ధి వినాయక ఆలయం ) 9. తమిళనాడు (తిరుచ్చి-- ఉచ్చి పిళియార్ గణపతి) భారతదేశంలో ప్రముఖంగా ఉన్న 9 గణపతి క్షేత్రాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఈ గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకత గురించి చాలా మంచి విశేషాలు చెప్పారు..

శివాభిషేకంతో...విశిష్ట ఫలితాలు

💐💐శివాభిషేకంతో...విశిష్ట ఫలితాలు💐💐

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
🍁🍁🍁🍁
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – 
గరుడ పురాణంలో ఇలా వుంది – 
త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, 
వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. 
అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని  పాటించాలి. 
మీ ప్రకటన ఇలా ఉండాలి – 
‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. 
నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. 
నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. 
రెండవరోజు మాత్రమే తింటాను. 
ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. 
పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత దాతువులు – ఆవు పేడ – ఆవు పంచితము, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. 
అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. 
చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. 
అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. 
ఈ హోమము తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. 

అందమైన శివకథలు వినవచ్చు. 
వ్రతులు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. 
సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. 
ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే –
 ‘ పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. 
హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. 
ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. 
హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! 
మీ నివాసానికి వెళ్ళండి. 
మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

అటు తర్వాత శివ భక్తులకు భోజనము. 
వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. 
నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. 
ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. 
అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు 
మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి 
జరుపు కుంటున్నాం.

ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, 
ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, 
శక్తికొలదీ పాలు,గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, 
ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. 
ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. 
పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. 
అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . 
ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడం లోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. 
శివమంటే జ్ఞానమే. 
జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.

శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘ బిల్వ ‘ మూలంలో ఉంటాయనీ, 
శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. 
కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. 
సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్త్యానుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు.

శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

ఏ తిథి నాడు పితరుల అర్చన చేస్తే ఏ ఫలాలు దొరుకుతాయి అనేది మహాభారతం స్పష్టంగా చెబుతోంది

*ఏ తిథి నాడు పితరుల అర్చన చేస్తే ఏ ఫలాలు దొరుకుతాయి అనేది  మహాభారతం స్పష్టంగా చెబుతోంది.*

ధర్మరాజు అడిగిన మీదట  భీష్ముడు ఈ రహస్యాలు చెప్పాడు.

1) ‘‘పితౄన్ పూజ్యదితః పశ్చాత్ దేవతాస్తర్పయంతి వై|
తస్మాత్ తాన్ సర్వయజ్ఞేన పురుషః పూజయేత్ సదా||

*ముందుగా పితరులను పూజించి తరువాతే దేవతలను పూజించాలి‘‘ అనే మొదటి రహస్యాన్ని చెప్పారు.*

*కనుక అన్ని యజ్ఞాలు, పుణ్యకార్యాలలోనూ ముందుగా పితరులను పూజించాలని భీష్ముడు చెప్పాడు.*

2) ‘‘ధన్యం యశస్యం పుత్రీయం పితృయజ్ఞం పరంతప‘‘

*ఈ పితృయజ్ఞాలు పరమశుభకరం. ధనాన్నీ, కీర్తినీ, పుత్రులనూ కలిగిస్తాయని భీష్ముడు చెప్పాడు.*

3) ప్రతి పాడ్యమి నాడు పితరులను అర్చిస్తే మంచి ఇల్లు, అనుకూలవతి, అందమైన భార్య లభిస్తుంది. ఆమెకు బహుసంతానం కలుగుతుంది.

4) కుమార్తెలు కావాలనుకున్నవారు విదియనాడు పితరులను అర్చించాలి.

5)  గుర్రాలు (వాహనాలు) కావాలనుకున్నవారు తమ తల్లితండ్రులను తృతీయనాడు అర్చించాలి. 

6) చవితినాడు అమ్మా నాన్నలను అర్చిస్తే ఇంటిలోని కోడి, మేక, గొర్రె వంటి సంపదలు అభివృద్ధి అవుతాయి. 

7) పుత్రసంతానం కావాలనుకున్నవారు ప్రతీ పంచమి నాడు పితరులను అర్చించాలి. 

8) తేజస్సు, ఆకర్షణీయమైన దేహం కావాలనుకున్నవారు (నటీనటులు, చర్మబాహ్యసౌందర్యం ద్వారా వృత్తులలో ఉన్నవారు) షష్ఠినాడు అమ్మానాన్నలను అర్చించాలి.

9)  వ్యవసాయంలో వృద్ధి కావాలనుకునే వైశ్యశూద్రాదులు సైతం సప్తమి నాడు పితరులను అర్చించాలి. 

10) వ్యాపారాలు చేసేవారు అష్టమి నాడు అమ్మానాన్నలను పూజించాలి.

 11) నవమినాడు పశుపాలనం చేసే (యానిమల్ హజ్బెండరీ) వారు తమ తల్లితండ్రులను అర్చిస్తే ఒంటి గిట్టలున్నజంతువులు వృద్ధిపొందుతాయి. 

12) దశమినాడు పితృదేవతార్చన వల్ల గోధనం వృద్ధి అవుతుంది.

13) ఏకాదశినాడు అమ్మానాన్నలను అర్చిస్తే బంగారం వెండీ  ధనరాశులు అన్నీ పొందుతారు.

14) ద్వాదశినాడు అమ్మానాన్నలను అర్చించి అనుగ్రహం పొందితే బంగారం వెండి ధనరాశులు సొంతం అవుతాయి.

15) బంధుకోటిలో మేటివారు కావాలనుకొంటే త్రయోదశినాడు పితరుల అర్చన చేయాలి. 

16) అమావాస్య నాడు అర్చిస్తే సకల కామితాలూ తీరుతాయి.

17) చతుర్దశినాడు విరామం. ఈ రోజు పితృదేవతార్చనలకు విరామం ఇవ్వాలి. ఈ రోజు తద్దినం తప్ప కామ్య శ్రాద్ధాలు చేయరాదు.

18) శుక్ల పక్షం కన్నా కృష్ణపక్షంలో చేసే పితరుల అర్చన విశేషఫలం ఇస్తుంది. మధ్యాహ్నం చేసే పితరుల అర్చన సర్వశ్రేష్ఠం.

పైవన్నీ భీష్ముడు చెప్పిన పితృదేవతార్చనా రహస్యాలు. ఏ తిథినాడు ఏ రకమైన వరాలు పొందుతారో చెప్పాడు.

ఏ ఏ కోరికలు తీరాలను కుంటే ఆయా వారాలు, నక్షత్రాలు, తిథులలో అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుంటే చాలు. అతి తొందరగా వారికి కావలసిన కోరికలు తీరుతాయి.  వీటిని కామ్యపితృయజ్ఞాలు అంటారు. అంటే కోరికలు తీర్చమని చేసే పూజలు . ఇవి మన కోరికల బలం కొద్దీ ఎన్ని సార్లైనా చేయవచ్చు. 

కోరికలు తీవ్రంగా ఉన్నవారు వారాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆరున్నొక్క రోజులకు మనం ఎంచుకున్నది తిరిగి వస్తుంది. తిథి కేవలం 15 రోజులకు వస్తుంది. నక్షత్రం 27 రోజులకు వస్తుంది. 

నిజానికి తిథి, వారం, నక్షత్రం కలిసే ఉంటాయి. కనుక  తీరాలనుకున్న కోరికలు తీర్చే తిథి, వార, నక్షత్రాలు కలసి కానీ విడిగాగానీ వస్తే వాటిని వదులుకోరాదు. కేవలం తిథి, వారం, నక్షత్రం వచ్చినా సేవించాలి. లేదా మనకు కావలసిన తిథివారం, వారంనక్షత్రం, నక్షత్రం తిథి వచ్చినా వదలకుండా సేవించాలి. మనకు కావలసిన తిథి, వారం, నక్షత్రం కృష్ణపక్షంలో వస్తే అది మహాపుణ్యకాలంగా భావించి విశేషంగా పితరులను అర్చించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చతుర్దశినాడు కామ్యయజ్ఞాలు చేయరాదు. కేవలం తద్దినాలు మాత్రమే పెట్టాలి. 

పైన చెప్పిన కోరికలు తీరాలనుకున్నవారు తమకు అనుకూలమైన తిథి, వార, నక్షత్రాలను ఎన్నుకొని అవి వచ్చిన  ప్రతీ రోజూ  ఈ విధంగా చేయాలి.

1) ముందు రోజు నిషేధపదార్థలు తీసుకోరాదు. తినరాదు. బ్రహ్మచర్యం వహించాలి.

2) ఆ రోజు ఉదయమే తలకు స్నానం చేసి స్వధానామాన్ని ఎన్నిసార్లు మదిలో తలచుకోగలిగితే అన్ని సార్లు తలచుకోవాలి.

3) తల్లి తండ్రులు లేని వారు తూర్పు వైపునకు తిరిగి రెండు చేతులూ పైకి ఎత్తి ‘‘ నాకు ఫలానా కోరిక ఉంది దయచేసి నా వంశంలోని తాతతండ్రులు తీర్చాలని కోరుతున్నాను. నేను నా శక్తి కొలదీ గోసేవ చేస్తాను.‘‘ అనే అర్ధం వచ్చే విధంగా ప్రార్థించాలి.

4) మీకు దగ్గరలో ఉన్న ఆవుకు ఒక రోజు గ్రాసం అంటే ఒక రోజుకు సరిపడా మేతను రెండుపూట్లా వేయాలి. అంటే పచ్చగడ్డి, ప్రత్తిగింజలు, గానుగ నుంచీ వచ్చిన నూపప్పు, పల్లీపప్పు వంటి  పప్పుచెక్కలు, (తెలగపిండి), చిట్టూ తవుడూ వంటివి వేయాలి. దూడ ఉంటే దానికి కూడా సరిపడా వేయాలి.

మహా శివరాత్రి .. అసలు శివరాత్రి మహత్యం ఏమిటి*


_*మహా శివరాత్రి .. అసలు శివరాత్రి మహత్యం ఏమిటి*_



హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ దేశంలోని శివాలయాలన్నీ హర నామస్మరణతో హోరుమంటాయి. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో వూగిపోతుంటారు.. ఏమిటా మహాశివరాత్రి మహిమ.  


హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ దేశంలోని శివాలయాలన్నీ హర నామస్మరణతో హోరుమంటాయి. శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో వూగిపోతుంటారు.. ఏమిటా మహాశివరాత్రి మహిమ. సృష్టి- స్థితి- లయల్లో.. లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు.. శివుడాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదన్న సామెత ఉండనే వుంది. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. శివుడు విభూతి ప్రియుడు. శివుడికి మరేమీ అక్కర్లేదు.. అంత బూడిద వుంటే చాలు ప్రసన్నం చేసుకోడానికి. అందుకే మహాశివరాత్రి రోజున విభూతి తయారు చేయడం మంచిదని చెబుతుంది.. పండితారాధ్య చరిత్రము.


శివరాత్రి ఏటా మాఘ బహుళ చతుర్ధశి రోజు వస్తుంది. మాఘమాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలొ ఎంచక్కా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేయడం అన్నివిధాలా మంచిది. ముఖ్యంగా శివరాత్రి రోజు వేకువ జామునే లేచి తలారా స్నానం చేసి శివదర్శనం చేసుకుంటే జీవితానికి సరిపడా పుణ్యమొస్తుందని నమ్ముతారాయన భక్తులు. అందుకే జన్మానికో శివరాత్రయినా శివుడి కోసం ఉపవాస దీక్ష చేయాలని చెబుతారు పెద్దలు.

శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంత శ్రేష్టమైంది. రోజంతా ఉపవాసం వుండి ఆ మరునాటి ఉదయం భోం చేయడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోంచేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.

అసలు శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే వుంటుంది. అందుకే భక్తజనులందరూ ఈ రాత్రి పూట భజనలు- పురాణ కాలక్షేపం- లేదంటే శివనామస్మరణతో గడుపుతారు. కొందురు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు.

ఇంతకీ శివరాత్రి అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుంటే శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు. శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే.. అందుకు బ్రహ్మ- విష్ణువుల మధ్య వచ్చిన తగవు కారణంగా వివరిస్తుంది శివపురాణం. బ్రహ్మ - విష్ణువుల మధ్య వచ్చిన ఆధిపత్య సమస్యను తీర్చడంలో భాగంగా శివుడు అగ్ని స్థంభంగా ఆవిర్భవిస్తాడట. దాని ఆది- అంతములు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని అంటాడట.



అగ్ని స్థంబం మొదలు చూడ్డానికి బ్రహ్మ.. అంతం చూడ్డానికి విష్ణువు బయలు దేరుతారు. అంతం కనుగొన లేక పోయిన విష్ణువు వెనుదిరగగా.. దారి మధ్యలో కనిపించిన కామథేనువు, మొగలిపువ్వును చూసి.. బ్రహ్మ తాను మొదలు కనుక్కున్నాని అంటాడట. కానీ అది నిజం కాదు. తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలందుతాయని వరమిస్తాడట శివుడు.

అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పూవు పూజార్హం కానిదని, కామథేనువు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు పరమేశ్వరుడు. అంతే కాదు అబద్ధం చెప్పిన బ్రహ్మ ముఖాన్ని కత్తిరిస్తాడు. ఇలా శివ లింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ దాగి వుంది. అందుకే మహా శివరాత్రికి ఎంతో విలువనిస్తారు హైందవులు.

మహా శివరాత్రి రోజున తమిళనాడులోని అరుణాచలేశ్వరం దర్శిస్తే మంచిదని చెబుతారు. ఎందుకంటే శివుడు అగ్ని స్తంభంగా ఆవిర్భవించింది ఇక్కడే అని చెబుతుంది శివపురాణం. లింగోద్భవ సమయంలో బ్రహ్మ- విష్ణువులు తనను అర్చించి మెప్పించడంతో ప్రసన్నుడవుతాడు శివుడు. శివరాత్రి రోజున తనను ఇలా అర్చించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయని సెలవిస్తాడట పరమేశ్వరుడు. అందుకే భక్త కోటి శివరాత్రి నాడు ఎక్కడ ఏ లింగమున్నా వదలక పూజించడం ఒక ఆనవాయితీగా మారింది.

శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతే కాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ.

*త్రయంబకం యజామహే* అంటూ శివ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని చెబుతారు. ఇలా శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన- ఉపవాస- అభిషేక- అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS