ఏకాదశ రుద్రులు జగ్గన్న తోట ప్రభల తీర్థం ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరుhttps://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2QnPvjtj6l9qe50t8Pa0QK
ఏకాదశ రుద్రులు జగ్గన్న తోట ప్రభల తీర్థం గురుంచి మొట్ట మొదటిసారిగా సాయి టీవీ చానల్ ప్రసారం అందించిన్నారు. ఈ ఏకాదశ రుద్రులు శివాలయములు ప్రభల తీర్థం గురుంచి ఇంతవరకు వార్త పత్రికలలో తెలియజేస్తున్నారు.మొట్ట మొదటిసారిగా తెలియజేసిన తప్పకుండా ఈ వీడియో చూడగలరు. మీ సన్నిహితులు కు పంపగలరు.జగ్గన్నతోట ప్రభల తీర్థం:
కోనసీమలో తరతరాల నుండి సంక్రాంతికి వైభవంగా జరుగుతున్న ఉత్సవాలు జగ్గన్నతోట ప్రభల తీర్థం. మనమందరం సంక్రాంతి పండగని బంధు మిత్రులతో జరుపుకుంటాము. ఆ పర్వదినాన ఎక్కడెక్కడినుండో బంధువులందరూ ఒకే చోటికి చేరుకుంటారు. ఏకాదశరుద్రులుకి సంక్రాంతి పండుగకి సంబంధం ఏమిటంటే! ఏకాదశరుద్రులు అందరూ కలిసి ఒకేచోట సమావేశమవుతారు. అది ఎలాగంటే? ఆయా శివాలయాల నుండి 11 ప్రభలు వచ్చి, ఒక చోట సమావేశం అవుతాయి. ఈ సమావేశాన్ని "జగ్గన్నతోట ప్రభల తీర్థం" అంటారు. ఈ జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి కానీ, గోపురం కానీ లేవు. అక్కడంతా ఉన్నది కొబ్బరితోట. పెద్దాపురం సంస్థానాధీశులు "శ్రీ రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు" గారు 400 సంవత్సరాల క్రితం ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. 400 సంవత్సరాల క్రితం విపరీతమైన కరువు, కాటకాలు వచ్చాయి. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే పెద్దాపురం సంస్థానాధీశులు (వీరి తోట కనుక వారి పేరుమీద జగ్గన్నతోట అనే పేరు) వారి కొబ్బరి తోటలోకి 11 దేవాలయాల నుండి తీసుకువచ్చిన ప్రభలనన్నింటిని, ఒకచోట కూర్చుని 11 రుద్రులు కలసి, మన దేశ భౌగోళిక పరిస్థితుల గురించి చర్చిస్తారని ఇక్కడి పెద్దలు చెబుతారు. ఈ సాంప్రదాయం ప్రారంభించినది, జగన్నాథ మహారాజు గారు. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఈ ప్రభల సమావేశం జరిగి తీరవలసిందే! ఈ ఉత్సవం సంక్రాంతి మరునాడు కనుమ రోజు జరుగుతుంది. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల 250 గ్రామాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. అంతేకాదు దేశ విదేశాలలో స్థిరపడిన ఈ ప్రాంతవాసులందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. కోనసీమలో 84 చోట్ల ఈ ప్రభలతీర్థాలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి: 1). జగ్గన్నతోట ప్రభల తీర్థం 2). వాకాల గరువు 3). కొర్లగుంట. ఈ మూడుచోట్ల ప్రభలతీర్థాలు వైభవంగా జరుగుతాయి. ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు...ఆ రుద్రులు పేర్లు:
1). వ్యాఘ్రేశ్వరం - శ్రీ వ్యాఘ్రేశ్వరం స్వామి 2). పుల్లేటికుర్రు- అభినవ వ్యాఘ్రేశ్వరం స్వామి 3). మొసల పల్లి -మధు మానంత భోగేశ్వరస్వామి 4). గంగలకుర్రు- చెన్న మల్లేశ్వరుడు 5 గంగలకర్రు (అగ్రహారం)- వీరేశ్వరుడు. 6). పెదపూడి- మేనకేశ్వరుడు 7). ఇరుసుమండ -ఆనంద రామేశ్వరుడు 8). వక్కలంక- విశ్వేశ్వరుడు 9). నేదునూరు- చెన్న మల్లేశ్వరుడు 10). ముక్కామల -రాఘవేశ్వరుడు 11). పాలగుమ్మి- చెన్న మల్లేశ్వరుడు. ఈ తోట మొసలపల్లి గ్రామంలో ఉంది, కనుక దీనికి ఆతిథ్యం మొసలపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరూ రుద్రులూ తిరిగి వెళ్ళిన తరువాత వెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు. "శ్రీ వ్యాఘ్రేశ్వరుడు" ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాద పూర్వకంగా ఒక్కసారి లేపి మళ్ళీ కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానం....ఏకాదశ రుద్రులు వాటి గ్రామాల సమాచారం: ఏకాదశరుద్రులు: 1). వ్యాఘ్రేశ్వరం:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం. 2). పుల్లేటికుర్రు:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, అంబాజీపేటకి 6 కిలోమీటర్ల దూరం, అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3). మొసలపల్లి:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలంలో ఉంది. 4). గంగలకుర్రు:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 4 కిలోమీటర్లు, అమలాపురం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5). గంగలకుర్రు అగ్రహారం:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట నుండి అమలాపురం వెళ్లే దారిలో, బండార్లంక వీరభద్ర స్వామి గుడి ప్రక్క రహదారిలో, ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. 6). కే. పెదపూడి:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 5 కిలోమీటర్లు, అమలాపురం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 7). ఇరుసుమండ:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 7 కిలోమీటర్లు, అమలాపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. 8). వక్కలంక:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే దారిలో, తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. 9). నేదునూరు:- తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలం అయినవిల్లి నుండి 2 కిలోమీటర్లు, అమలాపురం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10). ముక్కామల:- తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం నుండి 8 కిలోమీటర్లు, అమలాపురం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11). పాలగుమ్మి:- తూర్పు గోదావరి జిల్లా, మండల కేంద్రమైన అమలాపురం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది...ఏకాదశరుద్రులు:---- 1). విశ్వేశ్వర రుద్రుడు-- వ్యాఘ్రేశ్వరం:( శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత వ్యాఘ్రేశ్వరం స్వామి).. బ్రాహ్మణుడు పులిని శివునిగా భావించి, బిల్వ పత్రాలతో అర్చన చేశాడు. ఆ పులి శివునిగా లింగముగా మారింది. వ్యాఘ్రము శివునిగా అవతరించుట వలన, వ్యాఘ్రేశ్వర స్వామిగా పేరు వచ్చింది. 2)మహదేవ రుద్రుడు- కె.పెదపూడి: ( పార్వతి సమేత మేనకేశ్వర స్వామి) విశ్వామిత్రుడి తపోభంగమునకు మేనకను ఇంద్రుడు పంపెను. వారి ఇరువురు సంతానం శకుంతల. మేనక స్వర్గమునకు పోదామని ప్రయత్నించగా వెళ్ళలేకపోయాను. ఆమె శివుని ప్రార్థించగా, ఆయన ఒక శివలింగ మేనక ఇచ్చి, ఆ ప్రదేశంలో ప్రతిష్టించమనెను. అప్పుడు మేనక కృష్ణ రాయుడు పెదపూడి( కె. పెదపూడి) నందు మేనక ప్రతిష్టించినది కాబట్టి, మేనకేశ్వర స్వామి. 3) త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ: ( శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆనంద రామేశ్వరస్వామి) రావణుని సంహరించిన అనంతరం, శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా, అయోధ్యకు వెళ్ళుచుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ నందు, పుష్పక విమానం కదలకుండా నిలిచి పోయింది. శ్రీరాముడు శివుని ప్రార్థించి శివలింగము ప్రతిష్టించెను. అప్పుడు పుష్పకవిమానము కదలగా అందరూ ఆనందభరితులైరి. రాముని చేత ప్రతిష్టించబడినది కాబట్టి రామేశ్వరము. అది అందరికీ ఆనందదాయకం అగుటచే, ఆనంద రామేశ్వరం అని పిలవబడింది. 4) త్రిపురాంతక రుద్రుడు--వక్కలంక (అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు) త్రిపురాసురులను శివుడు వధించిన తర్వాత, వక్కలంక గ్రామమునందు శివలింగ రూపమున ఆవిర్భవించెను. తారకాసురుని పుత్రులు మూడు పురములుగా, త్రిపురాసురులుగా పేరుపొందెను. గ్రామపు బ్రాహ్మణోత్తములు నుండి ప్రతిష్టించబడినది కావున విశ్వేశ్వరునిగా పిలవబడుతున్నది. 5) త్రికాగ్ని కాలాయరుద్రుడు-- నేదునూరు (సర్వమంగళ పార్వతీ సమేత చెన్న మల్లేశ్వర స్వామి) మూడు అగ్నుల నందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి, శివుడు లింగరూపం పొందుట వలన త్రికాగ్ని కాలునిగా పిలవబడుతున్నది. అగస్త్య మహర్షి చేత ప్రతిష్టించబడినది కావున, నేదునూరు చెన్న మల్లేశ్వర స్వామిగా పిలుస్తారు. 6) కాలాగ్ని రుద్రుడు-- ముక్కామల ( బాలా త్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామి) రావణ సంహారం అనంతరం, అగస్త్య మహాముని అయోధ్య వెళ్ళుతున్న రాముని చేత, ఈ ప్రదేశం నందు శివలింగము ప్రతిష్ఠింప చేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్య అస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠించబడుట వలన రాఘవేశ్వరుడు అని పిలువబడుచున్నది. పాండవ వనవాసం కాలంలో శివుడు అర్జునుని పరీక్షించదలచి, కిరాతకుని రూపంలో అర్జునుని ధైర్య పరాక్రమాలను చూసి, కాలాగ్ని రుద్రుడు పాశుపతాస్త్రము ప్రసాదించెను. 7). నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలా త్రిపుర సుందరి అనంత భోగేశ్వర స్వామి) దేవతలు, రాక్షసులు క్షీరసాగర సమయములో, విషము ఎవరికీ హాని కలగకుండా, తన కంఠంలో దాచుకొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడు మొసలపల్లి గ్రామము నందు, లింగ రూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలు అందించారు. అనేక భోగులను (పాములను) ధరించినవాడు, అందుచే అనంత భోగేశ్వరస్వామి అయినారు. 8). మృత్యుంజయ రుద్రుడు-- పాలగుమ్మి (శ్రీ శ్యామలంబా సమేత చెన్న మల్లేశ్వర స్వామి) శివుడు అర్థాయుష్కుడైన మార్కండేయుని రక్షించి, మృత్యుంజయుడు అయ్యాడు. ఆ మృత్యుంజయుడు లింగ రూపమున పాలగుమ్మి క్షేత్రమున ఆవిర్భవించెను. చెన్న మల్లేశ్వర స్వామిగా పేరుగాంచెను. 9). సర్వేశ్వర రుద్రుడు-- గంగలకుర్రు అగ్రహారం (ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి వారు) యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక, తన కాలి బొటన వేలుతో వ్రాయుట వలన, పుట్టిన అగ్నిజ్వాలలో బూడిద అయినందున శివుడు ఆగ్రహించి ఉగ్ర రూపుడై, నృత్యము చేసి తన జటాజూటంలో, ఒక జటను తీసి నేలపై కొట్టుట వలన, శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. దక్షయజ్ఞం ధ్వంసం చేసెను. ఉగ్ర రూపుడైన వీరేశ్వర స్వామిని లింగ రూపమున బ్రాహ్మణోత్తములు ప్రతిష్టించారు. 10) సదాశివ రుద్రుడు-- గంగలకుర్రు (సర్వమంగళ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి) పూర్వం బ్రహ్మ ,విష్ణువులలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చి, శివుని తమలో ఎవరు గొప్ప అని అడుగగా, అప్పుడు శివుడు ఆద్యంతాలు లేని లింగ రూపమును ధరించి, తన శిరస్సు బ్రహ్మను, పాదములను విష్ణువును, చూసి రమ్మని పంపెను. శివుని శిరస్సును చూడలేకపోయినా, ఒక ఆవును, మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని, తాను చూసితిని అని బ్రహ్మ చెప్పెను. విష్ణువు పాదములను చూడలేకపోయానని చెప్పెను. బ్రహ్మకు పూజాపునస్కారాలు లేకుండా, శివుడు శపించెను. విష్ణువు అగ్రగణ్యుడు అని చెప్పెను. వేద పండితులు, బ్రాహ్మణులు చెన్న మల్లేశ్వర స్వామిని ప్రతిష్టించిరి. 11) శ్రీ మన్మహాదేవ రుద్రుడు-- పుల్లేటికుర్రు (శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వరుడు) పూర్వము విష్ణువు, శివుని సహస్ర కమలాలతో, సహస్రనామాలతో పూజించెను. దానికి మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవుడు పుల్లేటికుర్రులో లింగరూపంలో ఆవిర్భవించెను. పుల్లేటికుర్రుకి పుండరీకము అని పేరు. పుండరీకము అనగా పులి అని అర్థం, వ్యాఘ్రేశ్వరము నందు అభినవ వ్యాఘ్రేశ్వరుడిగా పేరుపొందెను
No comments:
Post a Comment