Sunday, February 16, 2020

అన్ని రోగాలకి అగ్నిహోత్రం

*అన్ని రోగాలకి   అగ్నిహోత్రం* :— 

*మనం లోనికి తీసుకొని ఆహరం నిదానంగా పనిచేస్తే ఇలా అగ్నిహోత్రం ద్వారా గ్రహించే ఓషధం అతి త్వరగా మన శరీరంలో ప్రతి యెక్క అంగానీకి చేరుతుంది, ఇది ఎంతో ఉత్తమమైన వైద్యం, దీనికి తోడు లోనికి తీసుకొని ఓసధం వల్ల మీకు అత్యంత త్వరగా ఆరొగ్యం చేకూరుతుంది.*

పూర్వకాలంలో ఎంతో మంది రోగాలను తగ్గించుకొవడానికి అగ్నిహోత్రాలు చేసి కటినమైన రోగాలను కూడా సమూలంగా తగ్గించుకొగలిగారు

అగ్నిహోత్రం చేయడం ఎలా:   రాగి పళ్ళెము లేదా మట్టి పళ్లెము లో కొన్ని  పలుచగా వుండే ఆవు పిడకలు వేసి వాటిమీద కొద్దిగా కర్పూరం ముక్క వుంచి అగ్గి ముంటించాలి 

ఇలా ముంటిస్తే కొద్దిసేపటికి పిడకలు నిప్పులుగా మారును,

 ఈ నిప్పులపైన కొద్దిగా నెయ్యి 2 చెంచాలనుంచి 4 చెంచాలు నెయ్యి వేసి ఈ క్రింద చెప్పబడిన మూలకల పొడి కొద్ది కొద్దిగా వేసి ఈ అగ్నిహోత్రం తో వెలువడే పొగని పీల్చుకొవాలి,

 అగ్నిహోత్రం చేయునప్పుడు నిర్మలమైన మనస్సుతో ప్రశాంతమైన ఆలొచనతో చేస్తున్న పనిమీద ద్రుస్టిని కేంద్రీకరించి అగ్నిహోత్రం చేయాలి.

అగ్నిహోత్ర దూపంతో ఆరొగ్యం ఎలా వస్తుంది:—-  ఆవునేతిని అగ్నిహోత్రంలో వేసినప్పుడు అందులోనుండి అనంతమైన ప్రాణవాయువులు బయటకి వస్తాయి, అలాగే ఈ క్రింద చెప్పిన మూలకల పొడి వేయడం వల్ల ఓసధశక్తి మెత్తం కనురెప్ప సమయంలోనే వాయువుగా మారి మీ చుట్టూ వున్న గాలిలో పొగరూపంలో వెలువడుతుంది, 

ఈ పొగని పీల్చుకొవడం వల్ల అప్పటికప్పుడె మీ శరీరంలో నరనరాలకి  ఈ మూలికల శక్తి , నెయ్యి యెక్క ప్రాణ వాయువు, వెల్లి సర్వాంగాలను ఉత్తేజపరచి రోగాలని నయం చెస్తాయి, 

ఇది రోజూ చేయడం వల్ల రోగాలు లేని వారికి రోగాలు రాకుండా రోగాలు వున్నవారికి ఓసధంగా ప్రాణశక్తి శరీరంలోని నరనరాల్లోకి ప్రవహించి, ఆ నరాలలో మారుమూల ఎక్కడెక్కడో దాగి గడ్డకట్టిన రోగకారక విసపదార్దలను మరియు ఆ విష పదార్దాలనుండి పుట్టిన రోగాలను, క్రిములను నాశనం చెస్తుంది.అంతేకాక ఇంటిలో నలుమూలలా ఉన్న క్రిములను చంపడంలో సహాయపడుతుంది.   

ఈ విధంగా ఉదయం మరియూ సాయంత్రం చేయడం ఉత్తమంగా ఉండి దీర్గకాలిగ రోగాలని మట్టికర్పించడంలో ఎంతో అద్బుతంగా పనిచేస్తుంది.

ఈ అన్ని వస్తువులు ఒక్కోక్కొటి సమానంగా తీసుకొని, అనగా పై చెప్పిన ఆకులు, బెరడు, కాయలు పండ్లు ఎవి దొరికితే అవి ఒక్కో మూలిక ఒక్కభాగం అనగా ప్రతి ఒక్కటీ సమానంగా తీసుకొని అన్నీ కలిపి నున్నని పొడిలాగా కాకుండా కచ్చా పచ్చాగా కొద్దిగా గరుకుగా చేసుకొని ఒక పాత్రలో వేసుకొని భద్రపరుచుకొని పై చెప్ప్పినట్టుగా ఉదయం , మరియు రాత్రి అగ్నిహోత్రం చేస్తూవుంటే దీర్గకాలిక

రోగాలకి అంతో మంచి చేసి రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ముఖ్య గమనిక : పై చెప్పిన 101 మూలికల్లో ఎన్ని దొరికితే అన్ని సమానంగా వేసుకొండి, ఉదాహారణకి 50 వస్తువులు దొరికితే ఒక్కోక్కటి 100 గ్రాలు చొప్పున వేసుకొన్న మీకు 5 కేజీల అగ్నిహోత్రం మందు తయారు అయినట్లే, ఇలా ఎన్ని వస్తువులు మీచుట్టు పక్కల మీకు అనుగునంగా దొరికితే అన్ని తీసుకొని వాడుకొవడం మంచిది.

*అగ్నిహోత్రానికి కావాల్సిన మూలికలు*: 

*ఈ క్రింది వీటిలో దొరికిన, వీలయినన్ని వాటితో అగ్ని హోత్రం చేసుకోవచ్చు.*



—-  1, అడ్డసరం ఆకులు 2, ఆకుపత్రి  3, ఆవునేయి  4, ఉత్తరేణి సమూలం 5, ఉసిరిక ఆకులు లేదా కాయలు  6, కరక్కాయ పొడి 7, తానికాయలు  8, కామంచి  9, వాయింట సమూలం  10, మామిడి ఆకులు, లేదా బెరడు 11, కొడిసెపాల ఆకులు లేదా బెరడు , కాయలు 12, కొత్తిమీరి సమూలం 13, నేరేడు ఆకులు, కాడలు, పండ్లు,  14, సుగంధపాల వేళ్ళు  15,  ఆముదం చెట్టు సమూలం  16, కర్పూరం  17, చిలుకతోటకూర సమూలం 18, చింతపండు, చింతాకు , బెరడు 19, సొంటి   20, చిర్రికూర సమూలం 21, చేదుపొట్ల  22, చిన్నపల్లేరు సమూలం 23, పెద్దపల్లేరు సమూలం 24, జాజికాయలు  25, జాపత్రి  26, జిల్లేడు సమూలం 27, తక్కోలములు  30, మరువం  31, ధవనం  32, నాగకేశరాలు  33, నిమ్మాకులు , కాడలు, బెరడు 34, నేలములక సమూలం 35, వాకుడు చెట్టు సమూలం  36, నేల వేము సమూలం 37, పాలకూర సమూలం 38, తెల్ల ఎర్రగలిజేరు సమూలం 39, రెడ్డివారినానుబాలు సమూలం 40, తులసి తెలుపు లేదా నలుపు సమూలం 41, మెంతి కురసమూలం 42, ఫిరంగి సాంబ్రాణి  43, వేపాకులు, బెరడు, పండ్లు, 44, మర్రిఆకులు, పండ్లు, బెరడు, 45, రావి ఆకులు, పండ్లు, కాడాలు  46, జువ్విఆకులు, పండ్లు, కాడలు, 47, మేడి ఆకులు  48, కానుగ ఆకులు, పండ్లు, కాడలు 49,  తెల్లమద్ది ఆకులు, పండ్లు, కాడలు, 50, ఎర్రమద్ది ఆకులు, పండ్లు, కాడలు 51, జమ్మిఆకులు, కాడాలు, 52, ముల్లంగి ఆకులు దుంపలు  53, మునగచెట్టు ఆకులు, పూలు, కాడలు  54, వాయు విడంగాలు  55, సరస్వతీ సమూలం  56 , గుగ్గిలం, 57, ఈశ్వరీ తెలుపు లేక నలుపు సమూలం 58, అస్వగంధ దుంపలు 59, చందనం  60, గంధ కచ్చూరాలు  61, పిప్పింటచెట్టు,  62, గాయపాకు, 63, బూరగ ఆకులు, బెరడు  64, తుత్తురబెండ సమూలం 65, మారేడు ఆకులు, కాయలు , పండ్లు,  66, ఊడుగ ఆకులు, పండ్లు, బెరడు, 67, నువ్వులు  68, నేలతాడి, 69, అతిమధురం 70, గుంటగలగర  71, నేల ఉసిరి  72, జటామాంసి  73,  భావాంచాలు  74, మిరియాలు, 75, తుంగగడ్డలు  76, పొద్దు తిరుగుడు ఆకులు, పూలు గింజలు  77, వసకొమ్ములు  78, గరిక సమూలం 79, దర్బసమూలం 80, మెదుగ ఆకులు, పూలు, బెరడు  81, వాము  82, ఆవాలు  83, సొంపుగింజలు  84, దాల్చిన చెక్క  85, లవంగాలు 86, మాచిపత్రి   87, జీలకర్ర 88, ధనియాలు 89, కొబ్బిరి  90, దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు , కాడలు 91, కుక్కపొగాకు సమూలం 92, పిచ్చికుసమ సమూలం 93, తుమ్మికూర చెట్టు సమూలం 94, గన్నేరు ఆకులు కాడలు 95, ఉమ్మెత్త ఆకులు, పూలు, కాయలు, వేళ్ళు 96, కలబంద గుజ్జు, వేళ్ళు  97, సబ్జా మెక్క సమూలం  98, ఇంగువ, 99, తంగేడు సమూలం 100, దిరిసెన చెట్టు ఆకులు, కాడలు, బెరడు పూవులు. 101, నేల తంగేడు సమూలం 

ఈ అన్ని వస్తువులు ఒక్కోక్కొటి సమానంగా తీసుకొని, అనగా పై చెప్పిన ఆకులు, బెరడు, కాయలు పండ్లు ఎవి దొరికితే అవి ఒక్కో మూలిక ఒక్కభాగం అనగా ప్రతి ఒక్కటీ సమానంగా తీసుకొని అన్నీ కలిపి నున్నని పొడిలాగా కాకుండా కచ్చా పచ్చాగా కొద్దిగా గరుకుగా చేసుకొని ఒక పాత్రలో వేసుకొని భద్రపరుచుకొని పై చెప్ప్పినట్టుగా ఉదయం , మరియు రాత్రి అగ్నిహోత్రం చేస్తూవుంటే దీర్గకాలిక

రోగాలకి అంతో మంచి చేసి రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ముఖ్య గమనిక : పై చెప్పిన 101 మూలికల్లో ఎన్ని దొరికితే అన్ని సమానంగా వేసుకొండి, ఉదాహారణకి 50 వస్తువులు దొరికితే ఒక్కోక్కటి 100 గ్రాలు చొప్పున వేసుకొన్న మీకు 5 కేజీల అగ్నిహోత్రం మందు తయారు అయినట్లే, ఇలా ఎన్ని వస్తువులు మీచుట్టు పక్కల మీకు అనుగునంగా దొరికితే అన్ని తీసుకొని వాడుకొవడం మంచిది.

మనం లోనికి తీసుకొని ఆహరం నిదానంగా పనిచేస్తే ఇలా అగ్నిహోత్రం ద్వారా గ్రహించే ఓషధం అతి త్వరగా మన శరీరంలో ప్రతి యెక్క అంగానీకి చేరుతుంది, ఇది ఎంతో ఉత్తమమైన వైద్యం, దీనికి తోడు లోనికి తీసుకొని ఓసధం వల్ల మీకు అత్యంత త్వరగా ఆరొగ్యం చేకూరుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS