Monday, February 10, 2020

సుబ్రహ్మణ్య తత్వం........!!

సుబ్రహ్మణ్య తత్వం........!!

మనుజులకు అతి దగ్గరగా ఉండువాడు సుబ్రహ్మణ్యుడు .
భూమి యందు పుట్టి నడయాడు మనుజులకి ,
వారి వారి అవసరాలను తీర్చుటకే 
ఆవిర్భవించిన రూపం ...స్కంద రూపం .
ఋణ విముక్తి స్వరూపం ,
భార్య,భర్తల  ఆకర్షణీయ రూపం...సుబ్రహ్మణ్యేస్వరం ,
సంతాన భాగ్యములిచ్చి,
ఇరువురులకి పున్నామ విముక్తి కరుడు 
ఈ మహనీయుడు ..

కాల సర్ప దోష నివారణకు 
రాహు,కేతువుల అంశయై ,
అంశగా నిలబడినవాడు కుమారా స్వరూపుడు ఇతడే ...
సకలం నమ్మిన భక్తులకు కల,యిల లోన సర్పరూపంబున్,
దర్శన మిచ్చి దరికి చేర్చుకునే వాడు...
పార్వతీ పరమేశ్వర కుమారుడు కార్తికేయుడు...

మంగళమని మహామంగళ కరమైన స్వరుపంబుతోడ ,
ఇరువురుల రక్షణాత్మ స్వరూపమే గణేశ,సుబ్రహ్మన్యుడు ,
సకలములకు తన అంశ గా నిలిచి,
నవగ్రహములలో కుజుడు,రాహు కేతువులుగా నడయాడుతూ 
భూదేవి అంశగా,
మరియు నరసింహుని అంశ గా 
జనజ్జనని అంశ స్వరూపమై నాగేన్ద్రుడిగా ,
నాగదేవతగా ,
మన బిడ్డలని రక్షిస్తూ నడయాడుతున్న షణ్ముఖుడు ఇతడే ...

సర్వ సైన్యాధ్యక్షుడిగా వుండి మనుజులకు,
శరీర కాంతి చెవిపోటుకి కారణ రూపుడు ఇతడే ...శరవణభవుడు....
వివాహములో,మాంగల్య యోగంబులకు తన వద్దకు రప్పించుకుని,
తన అర్చన యోగంబులనిచ్చి, 
ఇంట మంగళ ప్రధముడుగా నడయాడువాడు ,
 ఆ సర్వ మంగళ స్వరూపిణి కుమారుడే సుబ్బారాయుడు.

ఆవుపాలు ,
తేనె ,
చలిమిడి,
బియ్యపు నూక ,
అరటి పళ్ళు,
ఇవి అన్నియు వడ్డించి ......
ఆది .,మంగళ .....
పౌర్ణమి ,షష్టి, కృత్తికా నక్షత్రము తిథులలో 
ఆరాధన చేసి అనంత రూపుడై , 
నడయాడు సుబ్రహ్మణ్యుడే ...
మనకి సర్ప రూపుడు ,
సందర్శనాత్మ రూపుడు ఇతడే....    
ఇన్నిటికి దగ్గరగా వుండే 
వల్లి,దేవసేనా సమేత ,సుబ్రహ్మణ్యేశ్వరుడు.!

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS