అష్ట సోమేశ్వర క్షేత్రాలు: ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.
https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0sRGWkec9CJprkDrS1Pib6
పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం చుట్టూ, అష్ట దిక్కులలో కొలువైన సోమేశ్వర స్వామి పేరుతో,( చంద్రుడి పేరుతో) ప్రతిష్టించిన లింగాలు, అద్భుతమైన 8 దేవాలయాలు ఉన్నాయి. ఇవి ఎవరైతే దర్శిస్తారో వారందరికీ చంద్రగ్రహ దోష నివృత్తి కలుగుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజు జన్మించినవారికి చాలా సమస్యలు ఉంటాయి. మానసిక చాంచల్యం, చంద్ర మహర్దశ, చంద్ర అంతర్దశ, జరుగుతున్న వాళ్లు, చంద్రుడి నక్షత్రంలో జన్మించినవారు,( రోహిణి, హస్త నక్షత్రాలలో) అష్ట సోమేశ్వర క్షేత్రాలను దర్శిస్తే, తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. అష్ట దిక్కులలో చంద్రుని చేత ప్రతిష్టించబడినది కాబట్టి, అష్ట సోమేశ్వర లింగాలు అన్నారు. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన వాటి కనుక, ద్రాక్షారామంగా పిలువబడుతుంది. అష్ట సోమేశ్వర క్షేత్రాలలో అద్భుతమైన విశేషం ఏమిటంటే, 8 శివాలయాలలో ఉన్న శివ,కేశవులకి ఒకే రోజున, ఒకే ముహూర్తంలో, ఒకే వేదిక మీద, కల్యాణోత్సవం చేస్తారు. పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు, కోలంక, కోరుమిల్లి, వెల్ల లో కళ్యాణోత్సవం జరుగుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు, దంగేరు, కోటిపల్లి, వెంటూరు, పెనుమళ్ళ, సోమేశ్వరంలో కళ్యాణోత్సవం జరుగుతుంది.
అష్ట సోమేశ్వర ఆలయాలు: 1) తూర్పు-- కోలంక: మండలం:- కాజులూరు: స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- ఉమాదేవి: ప్రతిష్టించినది:- సూర్యుడు: విష్ణాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి: గ్రామ దేవతలు:- ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ... 2) ఆగ్నేయం-- దంగేరు: మండలం:- కె.గంగవరం: స్వామి వారు:- ఉమా సోమేశ్వరస్వామి: అమ్మవారు:- పార్వతీదేవి: ప్రతిష్టించినది:- కశ్యపుడు: విష్ణాలయం:- వేణుగోపాల స్వామి: గ్రామ దేవతలు:- కట్లమ్మ, దారలమ్మ: 3) దక్షిణం-- కోటిపల్లి: మండలం:- కె. గంగవరం: స్వామివారు:- ఛాయా సోమేశ్వర స్వామి: అమ్మవారు:- రాజరాజేశ్వరి: ప్రతిష్టించినది:- అత్రిమహాముని: విష్ణాలయం:- సిద్ది జనార్ధన స్వామి: గ్రామ దేవత:- ముత్యాలమ్మ: 4) నైరుతి-- కోరుమిల్లి: మండలం:- కపిలేశ్వరపురం: స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- రాజరాజేశ్వరి దేవి: ప్రతిష్టించినది:- భరద్వాజుడు: విష్ణాలయం:- జనార్ధన స్వామి: గ్రామ దేవతలు:- దోర్లమ్మ: 5) పడమర-- వెంటూరు: మండలం:- రాయవరం: స్వామివారు:- ఉమా సోమేశ్వర స్వామి: అమ్మవారు:- పార్వతీదేవి: ప్రతిష్టించినది:- విశ్వామిత్రుడు: విష్ణాలయం:- కేశవ స్వామి: గ్రామ దేవతలు:- మారెమ్మ: 6) వాయువ్యం-- సోమేశ్వరం: మండలం:- రాయవరం: స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- బాలా త్రిపుర సుందరి: ప్రతిష్టించినది:- గౌతముడు: విష్ణాలయం:- వేణుగోపాలస్వామి: గ్రామ దేవతలు:- బూరులమ్మ , బంతి బాపనమ్మ: 7) ఉత్తరం-- వెల్ల: మండలం:- రామచంద్రపురం: స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- బాలా త్రిపుర సుందరి: ప్రతిష్టించినది:- వశిష్ఠుడు: విష్ణాలయం:- వేణుగోపాలస్వామి: గ్రామ దేవతలు:- పోలేరమ్మ: 8) ఈశాన్యం-- పెనుమళ్ళ: మండలం:- కాజులూరు: స్వామివారు:- రాజ సోమేశ్వర స్వామి: అమ్మవారు:- పార్వతి దేవి: ప్రతిష్టించినది:- జమదగ్ని: విష్ణాలయం:- రామ మందిరం: గ్రామ దేవతలు:- పణుగుదాలమ్మ:
స్వామివారు: 1). సోమేశ్వర స్వామి-- 1.కోలంక- తూర్పు: 2.కోరుమిల్లి- నైరుతి: 3. సోమేశ్వరం- వాయువ్యం: 4. వెల్ల-ఉత్తరం: 2). ఉమా సోమేశ్వర స్వామి-- 1. దంగేరు- ఆగ్నేయం: 2. వెంటూరు- పడమర: 3). చాయ సోమేశ్వర స్వామి-- 1.కోటిపల్లి- దక్షిణం: 4). రాజ సోమేశ్వర స్వామి-- 1. పెనుమళ్ళ- ఈశాన్యం:
అమ్మవారు: 1).రాజరాజేశ్వరీ దేవి-- 1. దక్షిణం-కోటిపల్లి: 2. నైరుతి- కోరుమిల్లి: 2). బాలాత్రిపురసుందరి-- 1.వాయువ్యం- సోమేశ్వరం: 2. ఉత్తరం- వెల్ల: 3). పార్వతి దేవి-- 1. ఆగ్నేయం- దంగేరు: 2. పడమర-వెంటూరు: 3. ఈశాన్యం- పెనుమళ్ళ: 4) ఉమాదేవి-- తూర్పు- కోలంక:
విష్ణాలయం: 1). వేణుగోపాలస్వామి--1. వాయువ్యం- సోమేశ్వరం: 2. ఉత్తరం-వెల్ల: 3. ఆగ్నేయం- దంగేరు: 2). జనార్ధనస్వామి-- 1. దక్షిణం- కోటిపల్లి: 2. నైరుతి- కోరుమిల్లి: 3). కేశవ స్వామి-- 1. తూర్పు- కోలంక: 2. పడమర- వెంటూరు: 4). రామ మందిరం-- 1. ఈశాన్యం- పెనుమళ్ళ:
మండలం: 1) కె. గంగవరం-- 1. ఆగ్నేయం- దంగేరు: 2. దక్షిణం- కోటిపల్లి: 2) రాయవరం-- 1. పడమర- వెంటూరు: 2. వాయువ్యం -సోమేశ్వరం: 3) కాజులూరు-- 1. తూర్పు -కోలంక: 2 ఈశాన్యం- పెనుమళ్ళ: 4) కపిలేశ్వరపురం-- 1. నైరుతి- కోరుమిల్లి: 5) రామచంద్రాపురం--1. ఉత్తరం -వెల్ల:
No comments:
Post a Comment