ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ -
సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.
సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు రకాలుగా ఉన్నాయి. అవి
1 . దివ్యములు ఇవి .
2 . భౌమములు ఇవి భూమి నందు ఉండునవి .
దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగే
సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.
దివ్య సర్పములలో రకాలు -
1 . అనంతుడు.
2 . వాసుకి.
3 . తక్షకుడు.
4 . కర్కోటకుడు .
5 . పద్ముడు .
6 . మహాపద్ముడు .
7 . శంఖపాలుడు .
8 . కులికుడు .
దేవతాసర్పములకు ఉండు గుర్తులు -
అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును. కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల
వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును.
పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.
దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు -
ఆది, సోమ , మంగళ, బుధ , గురు, శుక్ర , శని వారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును .
దేవతాసర్పముల యొక్క మహిమ -
అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరామరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషదం ఏమి లేదు .
భూమి యందు ఉండు సర్పముల భేదములు
1 - ఉపజాతి సర్పములు .
2 - దర్వీకరములు .
3 - మండలీ సర్పములు .
4 - రాజీమంతములు .
అను నాలుగు రకముల సర్పములు కలవు.
భౌమ సర్పముల యొక్క లక్షణములు -
పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును
ఉపజాతి సర్ప లక్షణములను విష లక్షణములను తరువాత వివరిస్తాను.
మూడు రకాల సర్పాల విష గుణము -
దర్వీకముల యొక్క విషము కొంచం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలీ విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజీమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును.
పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరం లో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును .
మూడు రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు -
దర్వీకర జాతి సర్పములు వాతోద్రేకం , మండలీ సర్పములు పిత్తోద్రేకం , రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి.
భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య -
1 - దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు.
2 - మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు.
3 - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.
భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి , ప్రమాదకరమైనవి త్రాచుపాములు ఇవి మొత్తం 14 రకాలు . అవి
* చింతపువ్వు వన్నె త్రాచు.
* నాగజెర్రి .
* రేలత్రాచు .
* నాగజెర్రి.
* సెనగపువ్వు త్రాచు.
* నల్లత్రాచు.
* అరికెవన్నె త్రాచు.
* కందిపొడల త్రాచు.
* మొగలిపువ్వు త్రాచు.
* తెల్ల త్రాచు.
* కోడె త్రాచు.
* గిరినాగు .
* నీరు త్రాచు .
* గోధుమ త్రాచు.
* రాచపాము
ఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి.
ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను .
* చింతపువ్వు వన్నె త్రాచు -
దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది.
* నాగజెర్రి -
ఇది సగం త్రాచు వలే , సగం జెర్రిపోతు వలే ఉండును. చెట్లు , తోటల యందు , చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమవన్నే తెలుపురంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం . సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజెర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వికులు చేర్చారు .
* రేలత్రాచు -
అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది.సోమవారం నందు దీనియొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది.
* శెనగపువ్వు త్రాచు -
ఇది శెనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విషప్రభావం అధికంగా కలిగి ఉంటుంది.
* నల్లత్రాచు -
నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం , అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్చంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది.
* అరికెవన్నె త్రాచు -
ఈ త్రాచు ఎక్కువుగా మనుష్యుల మల విసర్జణ చేసే ప్రదేశాలలో సంచారం చేయును . మలభక్షణం చేయును . అత్యధిక కోపం , స్వచ్చమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది.
* కందిపొడల త్రాచు -
కందికాయ మీద ఉండునట్టి పొడలు వలే దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది.బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును.
* మొగలిపూత్రాచు -
దీనియొక్క శరీరం వెండితో సమానం అయిన ఛాయ ఉంటుంది.పరిమళములు గుభాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు , పరిమళ ఔషదాలు గల అరణ్యముల
యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం , సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం , గురవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.
* తెల్లత్రాచు -
కోపం తక్కువ , సాత్విక గుణం , శాంతస్వభావం , వెన్నెలవంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును .
* కోడెత్రాచు -
18 అంగుళముల పొడువు ఉండును. కోళ్ళని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్ళవలె అరుచును. ఇండ్ల యందు , కోళ్ల గూళ్ళ యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్ళని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యథిక విషతీవ్రత కలిగి ఉండును.
* గిరినాగు -
చంద్రబింబం వంటి వంక కలిగి , మెరుస్తున్న పడగ కలిగి ఉండి పర్వతముల యందు సంచారం చేస్తూ చెట్ల కొమ్మల యందు నివాసం ఉండును. ఇది పక్షులను భక్షించును . పడగ యందు వర్తులాకారం గా కృష్ణపాదములు కలిగి ఉండును. శుక్రవారం నందు విషోద్రేకం కలిగి ఉండును.
* నీరుత్రాచు -
అధికం అగు విషం , అతికోపం కలిగి ఉండి జలం నందు సంచారం , జలజంతు భక్షణ చేయుచూ శుక్రవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.
* గోధుమత్రాచు -
సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును.
* రాచనాగు అను త్రాచు -
పడగ గుండ్రంగా ఉండి , కృష్ణపాదములు లేని పడగ ఉండి మూడు అడుగుల పొడవు కలిగి ఉండి అధికకోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదీర్చుకొను పట్టుదల ఉండును. పర్వతాలు అరణ్యముల యందు నివాసము ఉండును.
ఇప్పుడు మీకు పెంజర పాముల గురించి వివరిస్తాను.
ఇవి మొత్తం 21 రకాలు అవి .
* కాటుకపోడ పెంజర .
* రక్త పెంజర .
* ఉడుముపొడ పెంజర.
* కలంకారీ పెంజర.
* పొట్ల పెంజర.
* తివాసిపోడ పెంజర.
* ఊదుపొడ పెంజర .
* పిచ్చుకపోడ పెంజర.
* అగ్నిపోడ పెంజర.
* పొడ పెంజర.
* సున్నపుపొడ పెంజర.
* తేనెపొడ పెంజర.
* కుళ్ళుపొడ పెంజర.
* పాదిరీపొడ పెంజర.
* గువ్వపొడ పెంజర.
* గరికపోడ పెంజర.
* మోదుగపూపొడ పెంజర.
* పసుపుపొడ పెంజర.
* దొండపండు పొడ పెంజర.
* గవ్వపోడ పెంజర.
* రెండు తలల శిఖండి.
పైన చెప్పిన విధంగా 21 రకాలుగా ఉన్నాయి .
మండలీ సర్పముల లక్షణములు -
* కాటుకపోడ పెంజర లక్షణము -
ఈ పెంజర మిక్కిలి లావుగా , అమితమైన పొడవు , శరీరం అందు పంగనామాలు కలిగి ఉండును. ఇది జీవజంతువులను కరుచును. దీని కాటు వలన దేహమంతయు వాపు , తెల్లగా పాలిపోవడం , దురద, నిస్సత్తువ కలుగును. మరణం మాత్రం కలుగదు . దీనిని దాసరిపాము అని కూడా పిలుస్తారు .
* రక్త పెంజర -
రక్త పెంజర అనునది చెయ్యి పొడవు కలిగి ఉండి ఎర్రని మచ్చలు , భయంకరమైన విషం కలిగి ఉండును. దీని కాటు వలన మైకం , భ్రాంతి, మూర్చ, నోటివెంట నురుగు పడును. నేత్రములు , పండ్ల చిగుళ్లు , రోమకూపములు , ముక్కు , కంఠం వీటి నుండి విపరీతంగా రక్తస్రావం కలుగును.ఎనిమిది జాములలో మనిషి మరణించుట జరుగును. ఆ సమయం దాటిందో చిత్రంగా బతుకగలడు.
* ఉడుముపొడ పెంజర -
ఈ పెంజర పెద్ద శిరస్సు కలిగి ఉండి గరుకు శరీరం , ఉడుము వంటి ఆకారం కలిగి భయంకరంగా ఉండును. దీని కాటు వలన కలిగిన గాయము నుండి అధికంగా రక్తం స్రవించును . మైకంలో ఉండి మంత్ర మరియు ఔషధ చికిత్సలకు లొంగక 3 దినములలో తప్పక మనిషికి మరణము కలుగును.
* కలంకారీ పెంజర -
కలంకారీ పెంజర అనునది మూరెడు పొడవు కలిగి ఉండి కలంకారీ రంగుల వంటి పొడలు కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం మంటలు పుట్టును . శోఫ , కలంకారి పని చేయబడిన చాందిని వంటి మచ్చలు , కంఠం యందు శోఫ , దాహము కలుగును. కాటుపడిన చోట ఆముదం , నూనె మొదలయిన చమురు పదార్థాలను ఉంచిన అవి ఇనికిపోవును . ఇట్టి లక్షణాలు కలిగిన మనిషి ఒక్క రోజులో మరణించును.
* పొట్ల పెంజర -
పొట్ల పెంజర అనునది తలయును , తోకయును సన్నంగాను , శరీరం లావుగాను , పొట్లకాయ రంగు కలిగి మూరెడు పొడవు కలదై పొట్లకాయ వలే ఉండును. దీని కాటు తిన్నవారికి గొంతుక యందు గురక కలుగుట , శరీరం వాచుట మొదలగు లక్షణాలు కలుగును. దీని కాటు తినినవాడు 4 వ దినం నందు తప్పక మరణించును.
* తివాసిపోడ పెంజర -
ఈ పెంజర అనునది 20 అంగుళాల పొడవు ఉండి తివాసి రంగుల వంటి మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడిన వారి శరీరం అంతా మంటలు , వాపు , మైకం , కనులకు చీకటి కమ్మడం వంటి లక్షణాలు కలిగి నాలుగు జాములలో మరణం సంభంవించును.
* ఊదు పొడ పెంజర -
ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు . నరులు మొదలయిన వాని శరీరం నందు బుస్సుమని వూదును. అందువలన దేహమందు వాపు , రక్తక్షీణత , పాండు రోగం , నిస్సత్తువ , కీళ్ల యందు చచ్చుదనం వంటి దుర్గుణములు ఏర్పడి చాలా కాలం తరువాత మరణం కలుగును.
* పిచ్చుకపోడ పెంజర -
ఈ పెంజర అనునది అడుగు పొడవు ఉండి ముఖం నందు మూడు మచ్చలు ను కలిగి ఉండును. ఇది ఇండ్ల చూరుల యందు ఉండును. ఇది ప్రాకును. మరియు దుముకుతూ వేగంగా పోవును . దీనికాటు పడిన వారికి దేహం నందు పిచ్చుక మచ్చలు వంటివి మచ్చలు కలుగును. కడుపులో తిప్పును. రొమ్మునందు పసరు చేరినట్టు ఉండును. దీనివలన మరణం కలగదు .
* అగ్నిపోడ పెంజర -
అగ్నిపోడ పెంజర అనునది 18 అంగుళాల పొడవు కలిగి ఉండును. ఇది మనుషుల శరీరం నందు కాటువేయుట , ఊదుట , చొల్లు కార్చుట చేయును . ఈ మూడింటిలో ఏ విధంగానైనా అగ్నిపోడ పెంజర విషాన్ని మనుష్యుని మీదకు విషాన్ని ప్రయోగించిన శరీరం నందు మిక్కిలి మంటలు కలుగును. కొంతకాలం తరువాత చిన్నగా అనారోగ్యం కలుగును. మరణం లేదు .
* పొడపెంజర -
ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు. ఊదును. దీని నోటి విషపు గాలి తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా భగ్గున మంట మొదలగును. గాలిసోకిన స్థలం నందు రెండు మూడు దినముల పిమ్మట నిప్పుతో కాల్చబడినట్టు బొబ్బలు జనించును. నూనె మొదలగు సేవించినట్టైన శరీరం నందు నల్లని మచ్చలు పుట్టును . కొంతకాలం ఇలా బాధపడిన తరువాత మృత్యువు సంభంవించును.
* సున్నపు పొడ పెంజర -
ఇది అడుగు పొడవు మాత్రమే ఉండును. ఇది వరిమళ్ళ లోని ఎండ్రకాయ బొక్కలలో నివసిస్తూ ఎండ్రకాయలను భక్షించును . ఇది కరవదు. ఇది మనుజుల శరీరం నందు ఊదును. దీని విషపు గాలి తగిలిన వెంటనే మంట పుట్టును . శరీరం నందు మచ్చలు , దద్దుర్లు , గ్రంథులు ఏర్పడి , దురద మొదలయి కుష్టురోగి వలే ఉండును. దీనివల్ల మృతి కలగదు .
* తేనె పొడ పెంజర -
ఇది రెండు మూరల పొడవు కలిగి ఉండి గుర్రపు వన్నె గల మచ్చలు కలిగి ఉండును. ఇది కరిచిన శరీరం నందు వాపు , మచ్చలు జనియించి కొన్నిదినములకు మృతి చెందును
* కుళ్లు పొడ పెంజర -
ఇది ఒక గజం పొడవు ఉండును. దీని శరీరం పైన అనేక వర్ణములు గల పొడలును కలిగి ఉండి చూచుటకు అసహ్యం కలిగి ఉండును. దీని కాటు పడిన వారికి శరీరం బరువు ఎక్కును. ముక్కులు ఎగురుచుండును. శ్వాస బంధించును. కాళ్లు , చేతుల యెక్క గోళ్లు పుచ్చిపోవును . కుష్టువ్యాధి సంభవించినట్టు శరీరం కుళ్ళి దుర్గందం ఏర్పడును . ఇది కరిచిన సంవత్సరం తరువాత మరణించును.
* పాదిరీ పొడ పెంజర -
ఇది చేతి పొడవు ఉండును. కలిగొట్టు పువ్వు వన్నె మచ్చలు కలిగి ఉండి మొద్దు స్వభావం కలిగి ఉండును. ఇది కరవదు. మనుజుల శరీరములను నాకును. అందువలన శరీరం నందు పైత్యం , నవ, శరీరం రంగు మారు ట , నిస్సత్తువ, వాంతులు ఎక్కిళ్లు , అరిచి సంభంవించును. మృతి ఎంత మాత్రం కలగదు .
* గువ్వపోడ పెంజర -
ఇది ముప్పది అంగుళముల పొడవును , పావురపు రంగు శరీరం కలిగి ఉండి పసుపు వన్నె మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడినవారికి శరీరం నందు పాండు వ్యాధి , దురద, శోఫ , పసుపు వర్ణము గల మచ్చలు , దద్దురులు కలుగును. కొంతమందికి మాత్రమే మరణం కలుగును.
* గరికపోడ పెంజర -
ఇది గరిక వర్ణపు మచ్చలను కలిగి ఉండి అడుగు పొడవును కలిగి ఉండును. దీని కాటు వలన మనుజులకు శరీరం నందు దురద, వాపు , మాంద్యం, నొప్పి, కన్నులు భ్రమ గప్పుట, దేహంలో నిస్సత్తువ , శరీరం అంతా ఆకు పసుపు వర్ణం గల పొడలు , శరీరం నందు వణుకు వంటి లక్షణాలు కలిగి కుష్టువ్యాది జనింపజేయును . కాళ్ల యొక్క చేతుల యొక్క వ్రేళ్లు వంకరలై ఎండిపోయినట్టు అయ్యి శుష్కించి ఉండును.
* మోదుగుపూ పొడ పెంజర -
ఇది రెండు అడుగుల పొడవు , ఎర్రని మచ్చలు కలిగి ఉండును. దీని కాటు తిన్న వారికి శరీరం నందు వాపు , గాయం నందు పోట్లు , శరీరం నందు గ్రంథులు కట్టుట, అప్పటికప్పుడే రక్తం వాంతి అగుట , దగ్గిన రక్తం పడుట వంటి లక్షణాలు కలిగి ఉండును.
* పసుపుపొడ పెంజర -
ఇది చేతి పొడవు కలిగి ఉండును. పసుపు వన్నె మచ్చలను కలిగి యుండును. దీని కాటు వలన శరీరం నందు పసుపు రంగు బొబ్బలు , జ్వరం , గాయాల్లో పోట్లు ఏర్పడి మరణం సంభంవించును.
* దొండపండు పొడ పెంజర -
ఇది చేతేడు పొడవు ఉండును. చక్కగా పండిన దొండపండు వర్ణం కలిగి ఉండును. దీని కాటువలన శరీరం నందు నరములు ఉబ్బి ఎర్రగా కనిపించును. దేహం శుష్కించును . గాయం నందు పోట్లు కలుగును. మారుతి సంభవింపదు.
* గవ్వపోడ పెంజర -
ఇది మూడు మూరల పొడవును , లావుగా భయంకరంగా గవ్వ వర్ణం కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం నందు పాండువు , ముఖం , నేత్రములు పసుపు వర్ణం కలిగి ఉండును. కాటుపడిన ప్రదేశం కుంగి గుంట పడుట జరుగును. మరణం సంభవించదు.
* రెండు తలల శిఖండి -
ఈ పెంజర రాగిరంగు కలిగి ఉండును. తెల్లని మచ్చలు , గజము పొడవు కలిగి ఉండును. దీని తోక వైపు మొద్దుగా ఉండటం చేతను తలవైపుకు ప్రాకినట్లే తోకవైపుకు పాకును. అందువలన జనులు దీనికి రెండు తలలు ఉండునని భావించును. దీనిని కర్రతో కొట్టినా చావదు. జెముడు , జిల్లేడు కర్రలతో కొట్టినను , నిప్పులతో కాల్చినను చనిపోవును . ఇది కరవదు . మనుజుల శరీరం నాకును . ఇందువలన దేహం అంతయు నవ, పాండు రోగం , పొడలు , వాపు కలిగి అన్నం తినటం మీద ద్వేషం కలుగును.
ఇప్పటివరకు మీకు 21 రకాల పెంజర సర్పాల గురించి తెలియచేశాను . ఇప్పుడు మీకు రాజీమంత సర్పాల గురించి తెలియచేస్తాను .
ఈ రాజీమంత సర్పాలలో 4 రకాల సర్పాలు కలవు. అవి
* క్షుద్రజాతి సర్పాలు .
* కుంభీ వస సర్పాలు .
* మహా సర్పాలు .
* నిర్విష సర్పాలు . అని 4 రకాలు కలవు.
రాజీమంత సర్పాలలో బేధాలు -
పైన చెప్పబడిన నాలుగు జాతుల సర్పాలలో క్షుద్రజాతి సర్పములు 9 జాతులుగాను , కుంభీవస సర్పాలు 8 కులములుగాను , మహాసర్పములు 3 బేధములుగాను , నిర్విష సర్పములు 16 తరగతులుగా పుట్టి ఉన్నవి.
క్షుద్రసర్పములలో రకాలు -
* పెద్ద కట్లపాము.
* నాగుల కట్లపాము.
* నూనె కట్లపాము.
* బఱ్ఱె కట్లపాము.
* కట్లపాము.
* తాటిబొలుగు పాము.
* చెట్టెగురు పాము.
* గొడ్డలి ముఖపు పాము.
* గోడప్రాకుడు పాము.
ఈ విధంగా మొత్తం 9 విధాలుగా ఉండును.
* పెద్ద కట్లపాము లేదా పెద్ద పరుగుడు పాము
ఇది గజము పొడవు ఉండి గోధుమవన్నె త్రాచు పాముని పోలి ఉంటుంది. దీని కాటు పడిన వానికి మాటిమాటికి విషం ఎక్కి భాధించును. కాని మరణం కలగదు.
* నాగుల కట్లపాము -
దీనిని నాగ పరుగుడు అని కూడా అంటారు. ఇది 36 అంగుళముల పొడవు ఉండును. ఇది చూడటానికి నల్ల త్రాచువలె ఉండును. దీని కాటువలన విషం ఎక్కడం దిగడం జరుగును. మంత్రౌషదాల వలన విషం విరుగును. మరణం కలగదు.
* నూనె కట్లపాము -
ఇది 36 అంగుళముల పొడవు కలిగి ఉండి శరీరం అంతయు తెల్లని కట్లు కలిగి ఉండి మెరుస్తూ ఉంటుంది. దీని విషం మిక్కిలి చురుకు అయినది. దీని కాటు వలన బాధ కలుగును. విషం వలన మరణం సంభవించదు.
* బర్రెకట్ల పాము -
ఇది 50 అంగుళాల పొడవు ఉండి మొద్దు వలే లావును , శరీరం నందు గరుకు కలిగి ఉండును. ఇది క్రూరమైన విషం కలిగి ఉండును.
* కట్లపాము లక్షణము -
ఇది మూడుమూరల పొడవు , శరీరం నందు గణుపుల వంటి కట్లు కలిగి ఉండును. ఇది కాటు వేయడం వలన మాటిమాటికి విషం ఎక్కడం , దిగడం జరుగును. మరణం కలుగనేరదు .
* తాడిగిరి లేదా తాటిబొలుగు పాము -
ఇది చిటికెన వ్రేలు లావును , మూడు జానల పొడవు నూనె రంగును కలిగి ఉండును. ఇది తీగ జాతి చెట్లలో విశేషంగా తాటిచెట్ల యందును సంచరించును. మనుజుల నిది తలమీదనే తప్ప మరి వేరే ప్రదేశంలో కరవదు. అందువలన తక్షణమే విషమెక్కి మనుజుడు గంటలోపునే చచ్చును. దీని విషముకు విరుగుడు లేదు . ఇది పగబట్టిన మనిషిని చంపియే తీరును . ఒకవేళ చంపలేక పోతే నిరసన వ్రతం బూని 6 నెలలలో అతనికోసం వేచి చూసి చివరకు చచ్చును.
* చెట్టగురు పాము -
ఇది చిటికెన వ్రేలు లావు , అడుగున్నర పొడవు ఉండి ఎప్పుడూ చెట్ల మీదనే ఉండును. ఇది ఒక చెట్టు పై నుంచి మరియొక చెట్టు పైకి తటాలున దుమక గలదు. ఇది మనుజులను తలమీద కాని కన్నుల మీద కాని కరుచును. ఇది పగ సాధించుట విషయంలో తాడిగిరి పామును పోలి ఉండును. ఇది కరిచినచో ఔషదం ఇచ్చు సమయం కూడా ఉండదు. అంతలోపు మనుజుడు మరణించును. జీవజంతువులు ను చంపుటలో దీని విషాన్ని మించినది లేదు . కావున పర్వాతారణ్యాలు , ఉద్యానవనాలు యందు తిరిగే వారు ఈ సర్పాన్ని సదా కనిపెట్టి తిరగగలరు.
* గొడ్డలిమొగపు పాముల లక్షణము -
ఇది ఉదారంగును , గొడ్డలి వంటి తల కలిగి ఉండును. రేగటి మట్టి భూములలో , చౌడు భూముల్లో , బురద నేలల్లో నివసించును. వర్షాకాలంలో మాత్రమే బయట తిరుగును. మూరెడు పొడవు కలిగి ఉండును. ఈ పాముచే కరవబడిన మనుజుడు యొక్క అంగాలు కుంచించుకు పోయి పొట్టివాడు అగును.
* గోడప్రాకుడు పాము లక్షణము -
ఇది రెండు మూరల పొడవు కలిగి తెల్లని శరీరం కలిగి శరీరం పైన నల్లని అడ్డు చారలు కలిగి ఉండును. వేలెడు లావు కలిగి ఉండును. అతిక్రూరమైన విషము కలిగి ఉండును.ఈ సర్పము ఎంత చదరము అయిన గోడని అయినా ప్రాకి ఎక్కగలదు. కాని దిగుట తెలీదు . గబుక్కున కింద పడును.
ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి వివరణ - 5
అంతకు ముందు పోస్టులో రాజీమంత సర్పాలు మొత్తం 21 రకాలు వాటి గురించి సంపూర్ణ వివరణ ఇచ్చాను. ఇప్పుడు కుంభీన జాతి సర్పాలు గురించి వివరిస్తాను.
ఈ కుంభీని జాతి సర్పాలు మొత్తం 8 రకాలు .
* ఘంటాపుచ్చము .
* గరున్నాగము .
* త్రిశూలి .
* జటాధరము .
* కుంభీనసము .
* శోణముఖము .
* లోహితాక్షము .
* ఛత్రపతి.
ఈ విధంగా 8 రకాలుగా ఉంటాయి.
* ఘంటాపుచ్చ సర్ప లక్షణము -
మిక్కిలి పొడవు శరీరం , క్రూరత్వం , మిక్కిలి పరాక్రమం సంచరించునప్పుడు తోక చివర యందు ఘంటానాదం కలిగి ఉంటుంది. ఈ సర్పం సర్వ జంతువులను భక్షించును . ఉగ్రమైన విషం కలిగి ఉండును. సంచారం బయలుదేరడం మొదలు కాగానే దీని తోక యందు ఘంటానాదం వినపడును. ఆ నాదం వినపడిన వెంటనే సమస్త జంతువులు పారిపోవును. ఈ సర్పం ఆఫ్రికా దేశ పర్వతారణ్యములలో సంచరించును.
* గరున్నాగ సర్ప లక్షణము -
ఖడ్గము వంటి నాలుక , గబ్బిలపు రెక్కల వంటి రెక్కలు , గుడ్లగూబ వంటి ముఖం, భూమి మీద మరియు ఆకాశ గమనం , 8 మూరల పొడవు కలిగి ఉండును. ఇది పక్షిజాతులను భక్షించును . ఇది ఆఫ్రికా దేశ పర్వతారణ్యాలలో నివశించును.
* త్రిశూలీ సర్ప లక్షణము -
పిల్లివంటి ముఖం , తోక యందు గరుడపచ్చ కాంతి వంటి రేఖలతో ప్రకాశించుట , మీసాలు కలిగి ఉండును. 16 మూరలు పొడవు కలిగి ఉండిన దేహము , తోక త్రిశూలం వంటి మూడు చీలికలు కలిగి ఉండును. ఇది ఆఫ్రికా ఖండం నందు ఉండును.
* జటాధరా సర్ప లక్షణము -
మేకవంటి స్వరము , అతి పెద్ద శరీరం , గొఱ్ఱెవలె జడలు , 6 మూరల పొడవు , కంబడి చాయ వంటి లక్షణములు కలది. ఇది సింహళ ద్వీపం నందు ఉండును.
* కుంభీనస సర్ప లక్షణము -
మూడు మూరల పొడవు , పంది ముఖం , కడవ వంటి కడుపు , కురచ అయిన తోక , చిన్నగా పాకును . తుమ్మెద ధ్వని వంటి కూత ఈ లక్షణములు గలది కుంభీనస సర్పం అనబడును. ఇది అన్ని దేశాలలో ఉండును.
* శోణముఖ సర్ప లక్షణం -
స్పటిక ఛాయ గల శరీరం , పద్మరాగ మణి వంటి శిరస్సు , అతి భయంకరమైన కామక్రోధములు , భయంకరమైన గర్జన , 12 మూరల పొడవు గల శరీరం కలిగి ఉండునది శోణముఖ సర్పం అనబడును.
* లోహితాక్ష సర్ప లక్షణం -
నల్లని వర్ణం, భూమి నుండి చెట్ల పైకి , చెట్ల పై నుంచి భూమి పైకి దుముకుట , బారెడు పొడవు గల శరీరం , అగ్ని కణముల వంటి నేత్రములు , భయంకర ఆకారం కలిగి ఉండును.
* ఛత్రపతి సర్ప లక్షణము -
5 మూరల పొడవు , అతిస్నిగ్ధమైన కోమలాకారం , సంచరించునప్పుడు శరీరం వికసించును. సంచరించనప్పుడు శరీరం ముడుచుకుని ఉండును. శ్వేత ఛత్రం గల శిరస్సు , సర్వ జంతువుల ధ్వనిని చేయగలిగి ఉండును. క్షణంలో ప్రాణం తీయును.రాత్రుల యందు చెట్ల మీద నివసించును . ఇది కేరళ నందు నివసించును .
మహాసర్పముల వివరణ -
మహాసర్పములు మొత్తం 3 రకాలు అవి
* దాసరి పాము .
* కొండ చిలువ .
* సముద్రపు చిలువ .
* దాసరిపాము లక్షణము -
60 మూరల పొడవు , బారెడు లావుగల శరీరం , శరీరం అంతా త్రిపుండ్రాకారం గల నామములు , కాటుక వంటి ఛాయ , ముఖం నందు ఊర్ద్వత్రిపుండ్రములు కలిగి ఉండునది దాసరిపాము అని చెప్పబడును . దీనికి దొరికిన ఏ జంతువుని అయినా బిర్రుగా చుట్టుకుని చంపి దిగమింగును.
* కొండచిలువ లక్షణము -
నూరు మూరల పొడవు , మూడు బారల వలయము , వెడల్పు గల తెల్లని పొడలు , నీలవర్ణం గల శరీరం కలిగి ఉండునది కొండచిలువ అని చెప్పబడును . ఇది ఏ జంతువుని అయినా చటుక్కున మింగి చెట్టుకు చుట్టుకుని నీల్గును . అంతట పొట్టలోని జంతువు జీర్ణం అగును.ఇది కొండల యందు మాత్రమే నివసించును .
* సముద్రపు పాము లక్షణము -
మిక్కిలి పొడవు , స్థూలమగు శరీరం గలది . దీనిచేత కరవబడిన మనిషిని భూమి పైకి తీసుకొచ్చి చికిత్స చేసిన విషము హరించదు. సముద్రము నందు ఉంచే చికిత్స చేయవలెను .
* సర్పజాతి వివరణ సంపూర్ణం *
ఇప్పుడు మీకు సర్పాలు కాటువేసినప్పుడు చేయవలసిన చికిత్సల గురించి వివరిస్తాను.
సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు -
అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.
* 1వ చికిత్స -
ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం నోటి నుండి పొగ వెడలుచుండును. యే మనుజుడు అయినా అట్టి సర్పముచే కరవబడినను ఆ సర్పం వదిలిన పొగచే స్మృశించబడిన ఆహార పదార్థాలను భక్షించిన వెంటనే విషం ఎక్కును.ఆ విషాన్ని చికిత్సల ద్వారా తొలగించవలెను . వెంటనే ఆ విషార్తునకు ఆవుపాలు , ఆవునెయ్యి , తేనె సమాంతరములుగా కలిపి అందు రెండు గురిగింజల అంత వత్సనాభిని కలిపి త్రాగించి గాయమునకు కూడా వత్సనాభిని కరిచినచొట పైపూతగా రాయవలెను .వెంటనే విషం హరించును .
* 2 వ చికిత్స -
సర్పం కాటువేసిన వానికి వెంటనే ఎడమ ముక్కునందు చెవిలో గులిమి పట్టించి మనిషి మూత్రం ఆ ముక్కులో ఉంచిన విషం ఎక్కదు.
* 3 వ చికిత్స -
నేలగుమ్ముడు గడ్డను గంథం తీసి కాటువేసిన చోట లేపనం చేసిన విషం హరించును . దీని చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును.
* 4 వ చికిత్స -
పెన్నేరు గడ్డ అనగా అశ్వగంధ , చిర్రివేరు , మహిసాక్షి , కరిదువ్వ ఈ వస్తువులను గోమూత్రం తో నూరి పట్టించిన సర్పవిషం హరించును . విషంని హరించుటలో దీన్ని మించిన గొప్ప ఔషదం లేదు .
* 5 వ చికిత్స -
ఆగాకర గడ్డ ని గంథం తీసి అనగా సానమీద అరగదీసి ఆ గంధాన్ని తీసి కాటువేసిన స్థలం నందు దానిని పూసిన విషం హరించును .
* 6 వ చికిత్స -
కాటువేసిన స్థలం నందు జిల్లేడు వేరు అరగదీసి పట్టించినను లేదా ఎర్ర చిత్రమూలం , ఆరుద్ర పురుగు కలిపి నూరి పట్టించినను విషం విరుగును.
* 7 వ చికిత్స -
కరక్కాయ , తేనె , మిరియాలు , ఆకుపత్రి , ఇంగువ, మణిశిల , వస వీనిని సమానంగా నీరు వేసి నూరి ముక్కులో వేసిన సర్పముచే కరవబడిన వాడు జీవించును.
* 8 వ చికిత్స -
మణిశిల , ఇంగువ, వస , త్రికటుకములు అనగా శొంటి,పిప్పిళ్లు , మిరియాల సమాన చూర్ణం , కరక్కాయలు, లవంగచెక్క, ఆకుపత్రి అనునవి సమానంగా తీసుకుని నీటితో కలిపి నూరి ముక్కులో వేసినచో ఎంత విషపూరితమైన సర్పం కరిచినను ఆ వ్యక్తి బ్రతుకుతాడు.
* 9 వ చికిత్స -
దేవకాంచన చెట్టు వేరు గంధంని ముక్కులోపల వేసినచో అసాధ్యం అయిన సర్పవిషం హరించును .
* 10 వ చికిత్స -
నేపాళపు గింజల్లోని పప్పులను నిమ్మపండ్ల రసంలో 21 సార్లు భావన చేయవలెను . భావన అనగా నిమ్మపండ్ల రసంలో గింజల్లోని పప్పు నానబెట్టి మళ్ళీ పూర్తిగా ఎండించడం మరలా నానబెట్టి మరలా ఎండించడం ఈ విధముగా 21 సార్లు చేయవలెను . ఆ తరువాత దానికి ఉమ్మి తో నూరి కణికలు చేసి ఎండించి మాత్రలులా చేసుకోవలెను . కావలసినప్పుడు ఉమ్మితో అరగదీసి కాటువేసిన స్థలం నందు లేపనం చేయవలెను . తరువాత కన్నులకు కాటుక వలే ఆ గంధాన్ని పట్టించవలెను . విషం విరిగిపోవును.
* 11 వ చికిత్స -
గుంటగలగర వేఱు గాని , తిప్పతీగ వేఱు కాని , త్రిశూలి చెట్టు వేఱు గాని నీటితో నూరి లోపలికి తీసుకుని కాటువేసిన స్థలం నందు పూయడం వలన సర్పవిషం హరించును .
* 12 వ చికిత్స -
భావంచి విత్తనాలు గోమూత్రంలో నానబెట్టి గోమూత్రంతోనే నూరి లోపలికి తాగవలెను .
* 13 వ చికిత్స -
తెల్లగురిగింజ వేరుని నోటిలో ఉంచుకుని రసం మింగుచున్న సర్పవిషం హరించును .
* 14 వ చికిత్స -
అశ్వగంధ సమూలం మేక మూత్రంతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషంని హరించును .
* 15 వ చికిత్స -
నల్ల ఉమ్మెత్త వేఱు చిన్న ముక్కను తీసుకుని 10 ml కానుగ విత్తనాల నూనె వేసి నూరి మాత్ర వలే చేసి పుక్కిట పట్టుకొని ఆ మాత్రని నిమ్మపండ్ల రసముని కలిపి త్రాగిన సర్పవిషం హరించును .
* 16 వ చికిత్స -
అత్తిపత్తి చెట్టు వేఱు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొనిపోవును . మరియు నీలివేరు ను మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజ లోని పప్పుల గంధమును కాటువేసిన స్థలం నందు పట్టించిన సర్పవిషం హరించును .
* 17 వ చికిత్స -
గొమూత్రంలో గాని మనుష్యుని మూత్రంలోగాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్పవిషము హరించును .
* 18 వ చికిత్స -
పాము కరిచిన వెంటనే నరమూత్రం సేవించిన విషం ఎక్కదు.
* 19 వ చికిత్స -
కటుకరోహిణి , నేలతాడిగడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పవిషం హరించును .
* 20 వ చికిత్స -
కుంకుడువేరు నూరి కుంకుడు గింజ ప్రమాణంలో పుచ్చుకొనిన సర్పవిషం హరించును .
* 21 వ చికిత్స -
నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్పవిషాలు హరించును .
* 22 వ చికిత్స -
జిల్లేడు యొక్క లేత మొగ్గలని కోసి ఆ మొగ్గలు తెంచునపుడు స్రవించు పాలను ఒక గ్లాసులో పట్టి ఆ పాలతో ఆ మొగ్గలను నూరి రేగు పండు ప్రమాణం మాత్రలను చేసి ఆ మాత్రలను తమలాపాకులో చుట్టి గంటకి ఒకసారి మింగించిన సర్పవిషం హరించును . ఇలా 6 మాత్రలు కు తక్కువలేకుండా మింగించవలెను . మింగలేని స్థితిలో ఉన్నచో నీటితో కలిపి తాగించవలెను .
* 23 వ చికిత్స -
జిల్లేడు ఆకులకు ఇరువైపులా అంటుకొని ఉండే దూది వంటి తెల్లని నునగును గీచి ఒక గాజుపాత్రలో వేసి జిల్లేడు లేత మొగ్గలను తుంచునప్పుడు తొడిమలు నుండి స్రవించు పాలతో తడిపి చేతితో చక్కగా పిసికి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి నీడలో ఎండపెట్టి ఆ మాత్రలకు గాలి తగలకుండా సీసాలో వేసి కార్క్ మూత బిగించి ఈ మాత్రలను గంటకొకటి చొప్పున మూడు గంటలసేపు మింగించిన సర్పవిషం నిస్సందేహంగా నివర్తించును.
ఈ మాత్రలు తయారుచేసిన రెండు నెలల వరకే పనిచేయును . కావున రెండు నెలలోకసారి ఈ మాత్రలు తయారుచేసి నిలువ ఉంచుకొనవలెను .
* సర్ప విష చికిత్సలు సంపూర్ణం *
గమనిక -
కొంతమంది ప్రాచీన వైద్య పండితులు పాము కరిచిన సాధారణంగా మనుషులకు మృతి సంభవించదు అని తమతమ గ్రంథాలలో వివరించారు . పాము కరిచినవారికి స్మృతి తప్పి ఉచ్వాస నిశ్చ్వాసములు ఆగి , హృదయచలనం ఆగి నాడిగమనం ఆగి ఉన్న సమయంన మృతుడు అయినట్టు నిర్ణయించుకుని చక్కగా కూర్చొండబెట్టి 500 వందల బిందెల నీటిని నెత్తిన ధారగా పోసిన బొందిలోకి ప్రాణం వచ్చి లేచును.
ఈ విధంగా చేసినను ప్రాణం రానిచో ఒక గచ్చు తొట్టిలో కాని , చెక్క తొట్టిలో కాని నిండుగా నీరు నింపి మూడు దినములు ఉంచిన ఉదకం నుండి బుడగలు వచ్చును. బుడగలు మొదలు అయినచో శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అని అర్థం. ఈ విధంగా బుడగలు మొదలయిన గడియ తరువాత కాటు తిన్న వాని శరీరం బయటకి తీసి కూర్చుండబెట్టి శిరస్సు పై నుంచి నీటిని ధారగా పోయ?