బుధగ్రహ దోష నివారణకు "చతుర్ముఖి రుద్రాక్ష"
జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, అస్తంగత్వం చెందిన, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న శుభగ్రహ దృష్టి లేని శత్రు స్ధానాలలో ఉన్న తెలివితేటలు తక్కువగా ఉండటం, చదువులో రాణించలేక పోవటం, వ్యాపారంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవటం, తన మనసులోని భావాలను బయటకు వ్యక్త పరచలేక పోవటం, ఇతరుల దగ్గర ఏది మాట్లాడిన తప్పుగా అర్ధం చేసుకోవటం. బుద్ధి నిలకడ లేకపోవటం, చర్మవ్యాదులు, ఫిట్స్, నరాల బలహీనత, చెవుడు, నపుంశకత్వం, నిద్ర పట్టక పోవటం జరుగుతుంది.
బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.
చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు ధారలు కలిగి ఉంటుంది.చతుర్ముఖి రుద్రాక్ష ‘బ్రహ్మదేవుని’ స్వరూపం. చతుర్ముఖి రుద్రాక్షకి బుధుడు అధిపతి విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు రచయితలు, జ్యోతిష్యుల ధారణకు యోగ్యమైనది. విధ్యార్ధులకు జ్ఞాపకశక్తిని పెంచును.మానసిక రుగ్మతలు ఉన్నవారు, చర్మవ్యాది గ్రస్తులు చతుర్ముఖి రుద్రాక్షను నీటిలో వేసుకొని త్రాగిన మంచి ఫలితం కలుగును. మాటలు సరిగా రానివారు, మూగవారు, చెవిటివారు చతుర్ముకి ధరించిన ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్ధులు, వార్తాపత్రికల వ్యాపారులు, విద్యాలయాల వాళ్ళు, రచన, ఎక్కౌంట్స్ చేసేవారు చతుర్ముఖి ధరించాలి. ఈ రుద్రాక్షలను మణి కట్టు వద్ద కూడ చేతికి ధరించవచ్చును.
'చతుర్ముఖి' రుద్రాక్ష సకల పాపాలను హరించుటలో ప్రధానపాత్ర పోషిస్తుంది. బ్రహ్మదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, విద్యావంతులను చేస్తుంది. బుద్ధి బలాన్ని తేజస్సును పెంచి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనేలా చేస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు,చవితి తిధి రోజున జన్మించినవారు, కన్య, మిధున రాశిలో జన్మించిన వారు, జాతకంలో బుడుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, మీనరాశిలో నీచలో ఉన్న, బుధుడు శత్రుక్షేత్రాలలో ఉన్న, బుదదశ, అంతర్దశలలో, పిల్లలకు చదువులో ఆటంకాలు కలుగుతున్న, చదువు పైన ఆసక్తి లేకపోయిన చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది.
చతుర్ముఖి రుద్రాక్షను బుధవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి బుధహోరలో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన వారికి మానసిక రుగ్మతలను, పక్షవాతం, నాసికా సంబంధ, కంఠ సంబంద వ్యాదులను రాకుండా చేస్తుంది. వాక్శుద్ది, తెలివితేటలు మొదలగు ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:- ``ఓం హ్రీం నమః''
No comments:
Post a Comment