Wednesday, August 15, 2018

ఏ నామాన్ని జపిస్తే ఏం ఫలితం కలుగుతుంది

ఏ నామాన్ని జపిస్తే ఏం ఫలితం కలుగుతుంది
మానవుని కష్టాలు, బాధలు తొలగిపోవాలంటే నిత్యం దైవ నామ స్మరణ చేయాలని, ఆ దైవాన్ని నమ్ముకుంటే ఏటువంటి బాధలు మన దరి చేరవని, సుఖ సంతోషాలతో జీవించవచ్చునని మన పెద్దలు తెలుపుతున్నారు. ఏ నామాన్ని జపిస్తే ఏం లాభాం కలుగుతుందో వారు సూచిస్తున్నారు..
జగన్మాతా అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి కలుగును..
జగజ్జనననీ అని స్మరిస్తే సర్వ భయాలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత దొరుకును..
శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగును.. ఎంతటి కష్టమచ్చిన తట్టుకునే గుండె ధైర్యం ఆ భగవంతుడు మనకు ప్రసాదించును..
శివ శివ అని స్మరిస్తే సకలమూ మన దరిచేరును.. మృత్యు భయం ఉండదు.. ఆ మహేశ్వరుని కృప వల్ల సునాయాస మరణం కలుగును..
నారాయణా అని జపిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు తొలగిపోవును..
మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరును..
శ్రీరామ నామాన్ని జపిస్తే జయం కలుగుతుంది..
దామోదరుడ్ని జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి కలుగును..
కేశవా అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవును..
ఆచ్చుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచేయును..
గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి లభించును..
శ్రీలక్ష్మీ విష్ణువులనూ స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడును..
నరశింహా అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే ఘన విజయం.. అదే నారసింహా అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగును..
సర్వేశ్వరా అని స్మరిస్తే చేప్టిన కార్యం సత్వరమే పూర్తవును.. విజయం సిద్ధించును..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS