Saturday, August 11, 2018

అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి .


అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి .    త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది. * స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. * సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. * పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. కదంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ, ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది, పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే ... సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ! సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో ,కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది . సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము. * ఇఛ్ఛా శక్తి: వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి * జ్ఞాన శక్తి: లక్ష్మీదేవి, విష్ణువు యొక్క దేవేరి * క్రియా శక్తి: రౌద్రి, శివుడు యొక్క దేవేరి ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు.అనేక సంవత్సరములు తపస్సు చేసాడు . అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అదగగా, మహర్షి ఆయ్నకు నమస్కరించి "పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి దానికి హయగ్రీవుడు "మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే" అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను, పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి భండాసురుదిని వధించటం కోసమే, సమస్త లోకాలను, దేవజాతులను,ప్రకృతిని, ప్రాణకొటిని, వస్తుజాలాన్ని, మరల సృష్టించటం, సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము, ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు "కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి " అనే నామం ఏర్పడింది. సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు .

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS