అబ్దికంలో కూడని పదార్థాలు ఏమిటి? భస్మ, తిలక ధారణలతో ఆబ్దికం పెట్టవచ్చా?
జ: గుమ్మడికాయ, గేదెపాలు, కందిపప్పు, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, కొబ్బరి, ఖర్జూరం, పొట్లకాయ, శొంఠి - ఆబ్దికానికి పనికిరావు.
కూష్మాండం మహషీక్షీరమాఢకం రాజమషకమ్!
చణకంచ కుళుత్థంచ షడేతే శ్రాద్ధఘాతుకాః!
నారికేళం చ ఖర్జూరం పటోలీనాగరం తధా!
కూష్మాండం మహిషీ క్షీరం షడేతే శ్రాద్ధఘాతుకాః!!
ఎరుపు వస్త్రాలు ధరించడం, ఉన్ని వస్త్రాలు దాల్చడం, రుద్రాక్ష, విభూతి ధరించడం, బొట్టుపెట్టుకోవడం ఆబ్దికంలో చేయరాదు. వాటిని వాడితే పితృదేవతలు నిరాశతో. వెళ్ళిపోతారు.
కాషాయం కంబళం కాంస్యం భూతి రుద్రాక్షధారణమ్!
లలాటే తిలకం కుర్యాత్ నిరాశాః పితరో గతాః!!-----సామవేదం
No comments:
Post a Comment