Saturday, August 11, 2018

ఏలినాటి శని

శని గ్రహ దోషానివారణకు "కాలమణి"
జాతకంలో ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, శని మహాదశలు జరుగుతున్నవారు ఈ కాలమణిని ఉపయోగించి దోష నివారణను తగ్గించవచ్చును. ప్రతిరోజు సూర్యోదయానికి గంట ముందు వచ్చే శని కక్ష్య లో ఈ కాలమణిని చేతిలో ఉంచి శని జపం చేసిన లేదా శారీరక శ్రమ చేసిన, శనిగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది.
దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నవారు, బద్ధకం, అలసత్వం, ఒళ్ళు నొప్పులు ఉన్నవారు ఈ కాలమణిని నీటిలో ఉంచి ఉదయం సూర్యోదయంలో ఒక గంట సేపు ఉంచిన తరువాత ఆ నీటిని స్వీకరించిన లేదా ఆ నీటిని శరీరానికి తడిగుడ్డతో రుద్దిన శారీరక బాధల నుండి విముక్తి కలుగుతుంది.
వ్యాపార సంస్ధల యందు గాని, ఇంటికి గాని నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటే నల్ల గుడ్డలో ఈ కాలమణిని ప్రదాన సింహాద్వారానికి ఉంచిన నరదృష్టి ప్రభావం నుండి ఇంటిని, వ్యాపార సంస్ధని రక్షణ కవచంలా కాపాడుతుంది. శనిగ్రహాల దోషాలు ఉన్నవారు, నరదృష్టి ఉన్నవారు ఈ కాలమణిని లాకెట్ గా గాని, చేతికి బ్రాస్ లెట్ గాని ధరించవచ్చును. శనిగ్రహ జపం చేసేవారు ఈ కాలమణి మాలతో జపం చేయవచ్చును.
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. మందగమనం కలిగినవాడైనందున శనైశ్వరుడు అంటారు. ఈయన నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ఈయనకు కాకి వాహనం మకరం, కుంభ రాశులకు అధిపతి శని. శనైశ్వరుని భార్య జ్యేష్టాదేవి.
గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి.
జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అని వ్యవహరించడం జరుగుతోంది.
12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు.సమయం వృధా, అనవసర వ్యయం కలుగుతాయి
జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు, వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు.
రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. చేతిలో డబ్బు నిలవనియ్యాడు. కుటుంబ పోషణ భారం కలుగుతుంది
జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. రెండవ పర్యాయము (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి. మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమసయలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.
అర్ధాష్టమ శని:- జన్మరాశి నుంచి నాలుగువ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం కలుగుతాయి.
అష్టమ శని:- జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.శత్రు బాదలు,ఊహించని నష్టాలు వస్తాయి.
దశమ శని:- జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.తండ్రితో గొడవలు.
అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు , గోచారం లో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు ఉదయాన్నే వాకింగ్ కానీ,మేడిటేషన్ (గాలి పీల్చటం వదలటం) చేస్తే శని తృప్తిపడతాడు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS