Wednesday, August 15, 2018

సిరి సంపదలిచ్చే “లక్ష్మీ గవ్వలు"

సిరి సంపదలిచ్చే “లక్ష్మీ గవ్వలు"
గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి.శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.
గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది.దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది .గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం .
క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి. గవ్వలని లక్ష్మీ దేవి చెల్లెల్లు అని శంఖాలని లక్ష్మీదేవి సోదరులనీ పలువురు భావిస్తారు.గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబందం ఉంది.శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉన్నాయి .ఇంకా శివుని జటాజూటం లోను,నందీశ్వరుని మెడలోను గవ్వలే అందం.
గవ్వలు కొందరికి అలంకరణ వస్తువుగాను,కొందరికి ఆటవస్తువుగాను ,కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు."అని ఉంది.కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక,సాంస్కృతిక,ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.
ఉపయోగాలు
పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.
కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు.
కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి.అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.
గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.
వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది.
గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది.కాబట్టి గవ్వలు కామప్రకోపాలు. వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.
వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS