Monday, August 6, 2018

నమస్కారం " అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.

నమస్కారం " అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.
తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.
మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష.
సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.
* శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)
*హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు..
*గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి .
*తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి.
*తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.
*యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.
నమస్కారంలోని అంతర్గతం ....

హిందూ సంస్కృతిలో నమస్కారం 
విశిష్ట ప్రక్ధియ. ఒకరికొకరు ఎదురైతే
రెండు చేతులు జోడించి హృదయ -
స్థానం దగ్గర ఉంచి నమస్కారం  చెప్పడం 
హిందువు అలవాటు  .  మామూలుగా
చూస్తే నమస్కారం చేయడం  అంటే 
ఎదుటి వ్యక్తికి గౌరవం  ఇవ్వడం  ..
నమస్కారం అన్న పదం  సంస్కృతం
నుంచి వచ్చింది .
సంస్కృతానికి చెందిన నమః  అనే
పదం నుంచి  నమస్కారం  అన్న. పదం 
ఏర్పడిననది ..  సంస్కృతంలో నమః
అంటే విధేయత. ప్రకటించామని  అర్ధం ..
మనషులందరిలోనూ దైవత్వము
ఉంటుందని  హిందువులు నమ్ముతారు ...
దీనినే ఆత్మ అంటారు  .
నమస్కారం పెట్టడం  అంటే  ఒక వ్యక్తిలో
ఉన్న ఆత్మ ఎదుటి  వ్యక్తిలోని ఆత్మను
గుర్తించి దానికి విధేయత ప్రకటించడం ..
ఇది అధ్యాత్మిక పరమైన వివరణ ..
శాస్త్రీయంగా చూస్తే నమస్కారం  చేసేటప్పుడు
రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి
తాకుతాయి  మనం చేతి వెళ్ల కొనలకు
కళ్ళు చెవి మెదడులతో సంబంధం -
ఉంటుంది.  నమస్కారం  చేసేటప్పుడు
చేసేటప్పుడు  వేలి కొనలు పరస్పరం
ఒత్తుకోవడం  వల్ల కళ్ళు చెవి మెదడు
కేంద్రాలు ఉత్తేజమవుతాయి  దాంతో -
కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని  మెదడు ఎక్కువ -
కాలం  గుర్తు పెట్టుకోవడం .
వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం.
జరుగుతుంది ..
అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి -
నమస్కారం పెడితే  వాళ్ళు మనకి
ఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థము  ..
నమస్కారం పెట్టేటపుడు మనం 
ఎదుటి వాళ్ళను ముట్టుకోనవసరంలేదు
దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు -
సోకె ప్రమాదం ఉండదు.
భౌతిక సంబంధం లేకపోవడంవల్ల.
ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన
ప్రదానం జరుగుతుంది.
ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల
ఒకరి నుంచి చెడు భావనలు  మరొకరిలోకి -
చొరబడే అవకాశము కూడ. ఉండదు.
నమస్కారం అన్నది సత్యగునమైనది .
అవకాశం ఉన్నంతవరకు  ఎదుటి వ్యక్తికి -
మంచి మనస్సు తో
చేతులు జోడించి నమస్కంరించడం
మంచిది  ....
" నమస్కారం  మంచి  సంస్కారం "
దీన్ని మనం   అందరం  పాటిదాం .
ఎదుట వారికి   నమస్కరించటం  తో  మన  విలువ  పెరుగుతుంది .
ఈ సాంప్రదాయాన్ని  మనం  పాటిస్తూ , మన  పిల్లలకు  నేర్పిద్దాం .

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS