Tuesday, August 14, 2018

శుక్రగ్రహ దోష నివారణకు "దక్షిణావృత శంఖం"

శుక్రగ్రహ దోష నివారణకు "దక్షిణావృత శంఖం"
దక్షిణావృతశంఖం ప్రత్యేకంగా జాతకచక్రంలో గల శుక్రగ్రహ దోషాలు పోగొడుతుంది. దక్షిణావృతశంఖంలో నీరు నింపి సంతానం లేని దంపతులు ఆ నీటిని తాగినచో సంతానయోగం కలుగుతుంది. దక్షిణావృత శంఖంలో నీరు నింపి తలపై రోజు చల్లుకుంటే పాపాలు, రోగాలు, కష్టాలు తొలిగిపోతాయి. దక్షిణావృత శంఖంలో నీటిని ఉంచి త్రాగటం వలన దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి.
దక్షిణావృతశంఖంతో పూజచేసే వారికి సరియైన సమయంలో వివాహం జరుగుతుంది. అంతేకాక వివాహ అనంతరం దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు ఉండవు.
ఋషిశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు దక్షిణావృత శంఖంలో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్య వంతులు అవుతారు. శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ‘ఓంకార నాధం’ వినిపిస్తుంది. శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగునని ప్రతీతి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు. శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.
దక్షిణావృత శంఖం "లక్ష్మీదేవి" స్వరూపం. దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మదనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మదనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో దక్షిణావృత శంఖం ఒకటి. విష్ణుపురాణం ప్రకారం దక్షిణావృత శంఖం లక్ష్మీ సముద్ర రాజతనయ అయినది.
దక్షిణావృత శంఖం లక్ష్మీకి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మీకి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. దీపావళి రోజున దక్షిణావృత శంఖాన్నిపూజ, ఆరాధన, అనుష్ఠాలలో, హారతిలో, యజ్ఞాలలో, తాంత్రిక క్రియలలో దీనిని ఉపయోగిస్తారు. దక్షిణావృతశంఖాన్ని తూర్పు ముఖంగా ఉంచి అభిషేకం చేసినప్పుడు కుడి ప్రక్కన అనగా దక్షిణం వైపు కడుపు (ఆవృతం) ఉంటుంది కాబట్టి ఈ శంఖానికి దక్షిణావృత శంఖం అంటారు. దక్షిణావృత శంఖాలలో తెలుపు రంగులో ఉన్నవి శ్రేష్టం. ఎరుపు రంగు గీతలతో ఉన్న శంఖాలను కూడ పూజిస్తారు.
“శంఖే చంద్ర మావాహయామి కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి ధారాయాం సర్వతీర్థ మావాహయామి”
దక్షిణావృతశంఖం సంపదలకు ప్రతీక. ఈ పవిత్రమైన శంఖాన్ని పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోను శుభకార్యాలలోను శోభను పెంచుతుంది.
దక్షిణావృత శంఖాన్ని దీపావళి, అక్షయ తృతీయ మరియు శుక్రవారం రోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు సాదించవచ్చు. దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఎర్రని వస్త్రంపైనగాని, బియ్యం పైనగాని, కుంకుమ పైన గాని, కూర్మస్టాండ్ పైనగాని ఉంచి లలితసహస్త్రనామంతో గాని, లక్ష్మీ అష్టోత్తరంతో గాని చదువుతూ పూజచేయాలి. ఇంకా శంఖంతో విగ్రహాలను అభిషేకించవచ్చును.
“సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌” అనే మంత్రం గాని "ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయనమః" అను మంత్రాన్ని గాని 108 సార్లు పఠించాలి.
ఆయుర్వేదశాస్త్ర రీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయని నిరూపించారు. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోను దక్షిణావృత శంఖాన్ని స్థాపించి ఆరాధించేవారు. కూర్మపీఠం మీద ఎరుపు పట్టువస్త్రాన్ని వేసి దక్షిణావృత శంఖాన్ని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధి కలిగేది. శంఖం సాధకుని మనోవాంచలను పూర్తి చేస్తుందని, సుఖ సంతోషాలను కలగజేస్తుంది అని నమ్మకం.
దక్షిణావృత శంఖాన్ని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను అభిషేకిస్తూ వుంటారు. దక్షిణావృత శంఖాన్ని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దక్షిణావృత శంఖాన్ని పూజించటం వల్ల వాస్తు దోషాలు పోతాయి. వాస్తుదోషం పోవడానికి ఆవుపాలతో దక్షిణావృత శంఖాన్ని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఆ పాలను ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడంవల్ల అసాధ్యరోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. దక్షిణావృత శంఖాలు వున్న చోట నుండి లక్ష్మీ తరలిపోదు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS