Saturday, August 18, 2018

శ్రీకృష్ణుని అష్ట భార్యలు

శ్రీకృష్ణుని అష్ట భార్యలు
*1. రుక్మిణి*

రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు. ప్రేమవివాహం.

*2. సత్యభామ*

సత్రాజిత్తు కుమార్తె. ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు.

*3. జాంబవతి*

జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. వీణా విద్వాంసురాలు.

*4. మిత్రవింద*

ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు.

*5. భద్ర*

మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె . పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

*6. సుదంత*

నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో బంధించి పెళ్ళి చేసుకున్నాడు. నాగ్నజితి.
కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను.
శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.

*7. కాళింది*

పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.

*8. లక్షణ*

మద్ర దేశపు రాజకుమారి. మత్స్యయంత్ర పరీక్ష. స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు.



No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS