వారాహి వారాహీ దేవి
వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి...అందుకే ఆవిడను దండనాథ అన్నారు...
అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి...ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది...వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే...రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు...అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది...నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం( Land preparation before sowing )...అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది....
పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి...శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు...దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు...ఈ తల్లి ప్రాణ సంరక్షిణి....ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం
వారాహి దేవి
ఈ అమ్మవారు శాక్తేయం లో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం,చక్రం,నాగలి,గునపం,అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.
శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.
దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .
వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది .లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం . ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
ప్రకృతి పరంగా చూసినట్లైతే...ఈ సమయంలో వర్షం కురుస్తుంది...రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు...దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది...
అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి...బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి...ముఖ్య ప్రాణ రక్షిణి...హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు...
-పంచమి
-దండనాథా
-సంకేతా
-సమయేశ్వరి
-సమయ సంకేతా
-వారాహి
-పోత్రిణి
-వార్తాళి
-శివా
-ఆజ్ఞా చక్రేశ్వరి
-అరిఘ్ని
దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం
ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ...
శ్రీ వారాహీ దేవి ధ్యానములు
శ్రీ వార్తాళి వారాహీ ధ్యానం
చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్ I
సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్ II
శ్రీ బృహద్వారాహీ ధ్యానం
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్ II
శ్రీ లఘు వారాహీ ధ్యానం
మహార్ణవే నిపతితా ముద్ధరంతాం వసుంధరాం I
మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యున్మత్త భైరవీమ్ II
శ్రీ స్వప్న వారాహీ ధ్యానం
ధ్యాయేద్దేవీం ఘనశ్యామాం త్రినేత్రామున్నతస్తనీం
కాల్యాస్యామీ చంద్రఫాలాం చ దంష్ట్రోద్ధృత వసుంధరామ్ II
ఖడ్గాంకుశౌ దక్షిణయోర్వామయోశ్చర్మపాశకౌ
అశ్వారూఢాం చ వారాహీం నానాలంకార భూషితామ్ II
శ్రీ ధూమ్ర వారాహీ ధ్యానం
నమస్తే ధూమ్రవారాహి వైరిప్రాణాపహారిణి I గోకంఠమివ శార్దూలో గజకంఠం యథాహరిః II
పిబరక్తం చ దేవేశి అశలమాంసం చ భక్షయ I పశూన్ దదామి తే శత్రూన్వందే త్వాం శత్రురూపిణి II
శ్రీ కిరాత వారాహీ ధ్యానం
ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాంపరాం
ఉగ్రాం కాలిమకాలమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం I
క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం
ధ్యాయేత్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితామ్ II
ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణ తత్పరాం I
శత్రుపత్నీ కంఠసూత్ర ఛేద క్షురికరూపిణీం II
దేవీం జగత్త్రయే క్షోభకారక క్రోధ సంయుతాం I
అతిక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహీం చితయేత్పరామ్ II
శ్రీ వారాహీ దేవి స్తవము
శ్లో II ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాంI
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీమ్ II
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాళాకృతిం I
వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితామ్ II
శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్ I
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్II 1
వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్ I
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీమ్II 2
స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ I
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్II 3
పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబామ్ I
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీమ్ II 4
విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ I
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయేII 5
దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢామ్ I
శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయేII 6
ఉద్ధత్రీక్ష్మాం జలనిది మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళామ్ I
భక్తనతిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వన్దేII 7
సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యామ్I
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వన్దేII 8
నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతామ్I
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయామ్II 9
సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యామ్I
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీమ్II 10
వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యామ్I
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీమ్II 11
చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్I
దేవీం సింహతురంగా వివిధాయుధ ధారిణీం కిటీం నౌమిII 12
ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్I
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీమ్II 13
వర్ణచతుర్వింశతికా మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థామ్I
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యామ్II 14
బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యామ్I
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీమ్II 15
వారాహీ స్తోరతమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః I
స వే ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదమ్II 16.శ్రీ వారాహీ దేవి కవచం
అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా
ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ 1
జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ 2
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ 3
పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ 4
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ 5
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా 6
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి 7
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా 8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో 9
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. 10
యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. 11
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. 12
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. 13
తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. 14
మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. 15
అద్భుతం 🙏 జయ వారాహి జయ జయ వారాహి జయ జయ జయ వారాహి 🌺🙏
ReplyDelete