సిద్దేశ్వరకోన-- ఘటిక సిద్దేశ్వరక్షేత్రం.
ప్రసిద్ధశైవక్షేత్రాలలో ఒకటైన సిద్దేశ్వరక్షేత్రంలో పరమేశ్వరుడు సిద్దేశ్వరుడిగా,అమ్మవారు ఇష్టకామేశ్వరిగా కొలువైయిన్నారు.
చుట్టూ నల్లమల్ల అడవులు,ఆహ్లదకరమైన వాతావరణంలో
నెల్లూరు జిల్లాకు 110 కి.మీ దూరంలోనూ,బైరవకోనకు 50 కి.మీ దూరంలోనూ కొలువైన క్షేత్రం ఘటికసిద్దేశ్వరక్షేత్రం.
చుట్టూ నల్లమల్ల అడవులు,ఆహ్లదకరమైన వాతావరణంలో
నెల్లూరు జిల్లాకు 110 కి.మీ దూరంలోనూ,బైరవకోనకు 50 కి.మీ దూరంలోనూ కొలువైన క్షేత్రం ఘటికసిద్దేశ్వరక్షేత్రం.
సిద్దులు తపస్సు చేసినప్రాంతం కనుక దీనికి సిద్దేశ్వరకోన అన్నపేరువచ్చింది.ఇప్పటికీ కొండపైన గుహలలో సాధువులు తపస్సు చేస్తుంటారని చెబుతారు.అగస్థ్యమహర్షి ఇచ్చట తపస్సు చేసినట్లుగా చరిత్ర చెబుతుంది.ఇక్కడ ఆయన కూర్చున్న ప్రదేశాన్ని అగస్థ్యపీఠంగా పిలుస్తారు.
కీ .పూ 6వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కీ.శ 1406 లో విజయనగరరాజులచే ప్రాకారమండపం నిర్మించబడగా,1974 లో జీర్ణోద్దరణ గావింపబడింది.
అతిప్రాచీనమైన ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ కాశినాయన పునరుద్దరించి,నిత్యాన్నదానం ప్రవేశపెట్టినారు.
ఇంతటి అరణ్యంలోకూడ విరామం లేకుండా నిరంతరం అన్నదానం జరగడం మంచినీటికి,ఆహరానికి భక్తులకు లోటులేకుండా ఉండటం శ్ర్రీ కాశినాయన కృపాకటాక్షం.
ఇంతటి అరణ్యంలోకూడ విరామం లేకుండా నిరంతరం అన్నదానం జరగడం మంచినీటికి,ఆహరానికి భక్తులకు లోటులేకుండా ఉండటం శ్ర్రీ కాశినాయన కృపాకటాక్షం.
మేము మహశివరాత్రి ముందురోజు బైరవకోన దర్శించుకొని నెల్లూరు పెంచలకోనకు వెళ్ళేదారిలో ఈ క్షేత్రం దర్శించాము.
ఆరోజు ఎన్నో మీనీలారీల ద్వారా వంటదినుసులు, కూరగాయలు ఇక్కడకు అన్నదానం నిమిత్తం వచ్చినవి.ఈ క్షేత్రం చుట్టుప్రక్కల గ్రామాల రైతులు తమ మొదటి పంట చేతికిరాగానే కొంతభాగాన్ని ఈ క్షేత్రానికి సమర్పించడం ఆనవాయితీ అని తెలిసింది.

ఆలయ పరిసరాలలో ఉన్న అన్ని భవనాలలో అన్నదానం చేస్తున్నారు.వడ్డించేవాళ్ళుకూడా ఎంతో ఆదరంగా వడ్డనచేస్తారు.ఇంతటి మహమాన్వితమైన క్షేత్రాన్ని అనునిత్యం ఎందరో దర్శించుకొంటారు.
మహశివరాత్రి,కార్తీకపౌర్ణమి రోజులలోవేలాదిగా భక్తులు స్వామిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరిస్తారు.
మహశివరాత్రి,కార్తీకపౌర్ణమి రోజులలోవేలాదిగా భక్తులు స్వామిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరిస్తారు.
రూట్--నెల్లూరు నుండి ఉదయగిరి మీదుగా సీతారామపురం రూట్లో పోలంగారిపల్లె వరకు బస్సులు నడుస్తాయ.
అక్కడ నుండి 15 కి.మీ ఆటో కిరాయికి మాట్లాడుకొని సిద్దేశ్వరం చేరవచ్చు.
బైరవకోన దర్శించేవాళ్ళు స్వంత వాహనంలో సిద్దేశ్వరం చేరవచ్చును.
అక్కడ నుండి 15 కి.మీ ఆటో కిరాయికి మాట్లాడుకొని సిద్దేశ్వరం చేరవచ్చు.
బైరవకోన దర్శించేవాళ్ళు స్వంత వాహనంలో సిద్దేశ్వరం చేరవచ్చును.
అకామిడేషన్-- శ్రీశ్రీశ్ర్రీ కాశినాయన సత్రంలో రూములు ఇస్తారు.
సిద్దేశ్వరక్షేత్రం దర్శించేవాళ్ళు కోరితే కాశినాయన పొటోతో పాటు రూపాయి కాయిన్ కలిగిన కవరు ఇస్తారు.అది ఇంట్లోఉంటే ఆ ఇంట్లో అన్నపానీయాలకు ఎప్పుడూ లోటుండదని నమ్మకం.
No comments:
Post a Comment