వీదిపోట్ల నివారణకు బాఘవా మిర్రర్(ఫాకువా మిర్రర్)
బాఘవా మిర్రర్ (ఫాకువా మిర్రర్) ఒక చెక్కని ఎనిమిది కోణాలు ఉండేవిధంగా కట్ చేయబడి ఉంటుంది.మద్యలో కుంభాకారం కలిగిన అద్దం ఉంటుంది. ఈ అద్దం చుట్టు లోపలి భాగంలో ఎరుపు రంగులో ఉంటుంది.
ఎరుపు రంగు పైన పసుపు రంగు గాని,బంగారపు రంగు కలిగిన గీతాలు ఉంటాయి.చెక్కకు ఎనిమిది కోణాలు కలిగిన మూలలో గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది.కొన్ని ఫాకువా మిర్రర్ మధ్యలో కుంభాకార అద్దం లేదా ప్లాటుగా ఉండే అద్దాలు అమర్చబడి ఉంటాయి.దీనిపైన గోడకు తగిలిచ్చుకోవటానికి వీలుగా ఒక కొక్కెం అమర్చబడి ఉంటుంది.
వాస్తు శాస్త్రంలో వీధి పోట్లకు అధిక ప్రాముఖ్యత ఉన్నది. విధిని మార్చే శక్తి వీధిపోట్లకు ఉన్నది అనేది అక్షర సత్యం. ఈ వీధిపోట్లలో మంచివి, చెడు వీధి పోట్లు కూడా ఉన్నాయి. కొన్ని మంచి వీధి పోట్లు వున్న ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా చాలా గొప్పగా రాణించగల స్థితిలో ఉంటారు.
గృహం కానీ, గృహ ఆవరణ కానీ, రోడ్డుకన్నా తక్కువ ఎత్తులో ఉంటే ఆ గృహానికి మంచి వీధి పోట్లు వలన కలిగే మంచిని ఎక్కువగా పొందడానికి అవకాశం ఉండదు.
గృహం కానీ, గృహ ఆవరణ కానీ, రోడ్డుకన్నా తక్కువ ఎత్తులో ఉంటే ఆ గృహానికి మంచి వీధి పోట్లు వలన కలిగే మంచిని ఎక్కువగా పొందడానికి అవకాశం ఉండదు.
భాఘవా మిర్రర్ ని ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలలో ప్రధాన సింహద్వారానికి పైన అమర్చాలి.
ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలకు వీది పోటు ఉన్న తప్పకుండా భాఘవామిర్రర్ సింహాద్వారానికి పైన ఉంచాలి.నరదృష్టి ఉన్న తొలిగిపోతుంది.
దేవాలయాల యొక్క నీడ పడుతున్న భాఘవా మిర్రర్ ని సింహాద్వారానికి పైన ఆ దేవాలయం యొక్క ప్రతిబింబం ఆ అద్దంలో పడే విధంగా ఉంచాలి.
విద్యుత్ స్తంభాలు ఇంటి ఎదురుగా ఉన్న ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.ఈ నెగిటివ్ ఎనర్జీ పోవటానికి తప్పనిసరిగా భాఘవా మిర్రర్ ఉంచాలి.
ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలకు ఎదురుగా హాస్పటల్స్ గాని ఎత్తైన ప్రాకారాలు గాని ఉంటే తప్పనిసరిగా భాఘవా మిర్రర్ ఉంచాలి.
ఎత్తైన చెట్లు లేదా ఎత్తైన కొండలు ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలకు ఎదురుగా ఉన్న భాఘవా మిర్రర్ ఉంచాలి.
స్ధలానికి గాని గృహానికి గాని వీధిపోటు ఏర్పడినప్పుడు ఆ స్ధలాన్ని కొనుగోలు చేయకపోవటం లేక ఆ స్ధలంలో గృహా నిర్మాణం చేయకపోవటం మంచిది.స్ధలానికి గాని గృహానికి గాని వీధిపోటు ఏర్పడినప్పుడు ఆ గృహంలో నివసించే వారికి అభివృద్ధి ఉండదు.కాబట్టి ఇటువంటి వీధిపోటు ఉన్న స్ధలంలో గృహ నిర్మాణం చేయకూడదు.
మన స్ధలానికి గాని గృహానికి గాని ప్రక్కనే రోడ్డు వచ్చి అంతటితో అంతమైతే ఆ రోడ్డులో తిరిగే వ్యక్తులు ఆ రోడ్డు చివరి దాకా వచ్చి వెనకకు తిరిగి వెళ్ళేటప్పుడు మనం నివాసం ఉంటున్న ఇంటిని చూసుకుంటూ వెళతారు కాబట్టి ఆ ఇంటికి నరదృష్టి తగులుతుంది.కాబట్టి ఇలాంటి స్ధలాన్ని గాని గృహాన్ని గాని నిర్మాణం చేయక పోవటం మంచిది.
ఇలాంటి వీధిశూలలు ఉన్న స్ధలాన్ని గాని గృహాన్ని గాని తప్పని పరిస్ధితులలో కొనుగోలు చేయవలసి వచ్చిన లేదా గృహా నిర్మాణం చేయవలసి వచ్చిన స్ధలానికి గాని గృహానికి గాని 1 వ భాగంలో (తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం,పశ్చిమ వాయువ్యం) దిక్కుల యందు వీధిశూల ఏర్పడినప్పుడు గేటు గాని,డోరు గాని ఏర్పరుచుకొని గృహా నిర్మాణం చేయవచ్చును.
స్ధలానికి గాని గృహానికి గాని 2 వ భాగంలో (తూర్పు,దక్షిణం,పడమర,ఉత్తరం) దిక్కులలో వీధిశూల ఏర్పడినప్పుడు మరీ తప్పని పరిస్ధితులలో గేటు గాని,డోరు గాని ఏర్పరుచుకొని గృహా నిర్మాణం చేయవచ్చును.
స్ధలానికి గాని గృహానికి గాని 3 వ భాగంలో (తూర్పు ఆగ్నేయం,దక్షిణ నైఋతి ,పశ్చిమ నైఋతి ,ఉత్తర వాయువ్యం) దిక్కులలో వీధిశూల ఏర్పడినప్పుడు ఆ స్ధలాన్ని తీసుకోకపోవటం గాని గృహా నిర్మాణం చేయకపోవటం గాని మంచిది.
వాస్తు పురుషుని శరీర భాగాలు ఎక్కువ ఆక్రమించని ప్రదేశాలలో టాయిలెట్స్ నిర్మాణం చేస్తే మంచిది.ఆగ్నేయ దిక్కు,దక్షిణ దిక్కు,పడమర దిక్కు,వాయువ్య దిక్కులలో శరీర భాగాలు తక్కువ ఆక్రమిస్తాయి కాబట్టి ఈ దిక్కులలో టాయిలెట్స్ నిర్మాణం చేస్తే మంచిది.
No comments:
Post a Comment