Wednesday, August 29, 2018

శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి వారి దేవస్థానం, ముక్త్యాల



MUKTHESWARA SWAMY, MUKTYALA
శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి వారి దేవస్థానం, ముక్త్యాల
కృష్ణాతీరాన వెలసిన అతి ప్రాచీన పుణ్యక్షేత్రమిది. రెండు శివలింగాలు .. రెండు నందులు.. ఒకే స్వామికి రెండు ఆలయాలు .. పరమ శివుడు స్వయంగా కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల గ్రామ ఒడ్డున ‘ముక్తేశ్వరస్వామి’గా వెలసిన సుక్షేత్రమిది.  సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు పాటు మాత్రమే తెరచి వుంటుంది.. మిగతా ఆరు నెలలు నదిలోనే మునిగి వుంటుంది... ఆ సమయంలో ముక్తేశ్వరుని దేవతలు ఆరాధిస్తారని భక్తుల విశ్వాసం.... ఈ ఆలయంలో కనిపించే రెండు శివలింగాల్లో ఒకటి స్వామి వారికి, రెండవది అమ్మవారికి ప్రతీకలుగా భక్తులు విశ్వసిస్తారు. అలాగే విగ్రహానికి ఎదురుగా రెండు నందులు ఉంటాయి.. వీటిలో దక్షిణం వైపున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.. పూర్వ కాలంలో భార్య సుఖప్రసవానికి భర్త ఈ నందిని తిప్పేవాడని అలా చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ప్రసవం అయ్యేదని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఉత్తరవాహినిలో స్నానం చేయడం వలన సకల పాపలు తొలగుతాయాని భక్తులు భావిస్తారు.
నదిలో వుండే దేవాలయము
శ్రీ  ముక్తేశ్వర స్వామి వారు
జగ్గయ్యపేటకు పది కిలోమీటర్లు దూరంలో వున్న పరమ పవిత్రమైన శైవ క్షేత్రం. అంతే కాకుండా అన వేమారెడ్డి రాజు కొలువులో వాసి కెక్కిన 'వాసిరెడ్డి' జమీందారుల సంస్థానం. ఈ సంస్థానానికి చింతలపంటు అనే పేరు వుంది... చారిత్రాత్మక కోట గల ప్రాంతం...  కోటి లింగాల ప్రతిష్ట జరిగిన ప్రాంతం... సుమారు 1300 సంవత్సరాల చరిత్ర గలిగిన శివాలయం... ఒకనాడు బౌద్ధ బిక్షువులకు  ఆవాసమైన  ప్రదేశమే ఈ ముక్త్యాల....
అతి పురతనమైన  శ్రీ ముక్తేస్వరస్వామి వారి శివాలయం ద్వారం
ముక్త్యాల జమీందారులు కవులను విశేషంగా ప్రోత్సహించారు. మాహిష్మతి ముద్రణాలయాన్ని నెలకొల్పి అనేక పుస్తకాలను అచ్చు వేశారు.  ఎందరో కవులు, కళాకారులు తమ విద్యా నైపుణ్యాన్నిప్రదర్శించి  రాజుల మెప్పు పొందారు. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ...ముక్తినొసంగుతూ... ముక్తేశ్వరస్వామి కొలువై ఉన్నందువల్ల ముక్తేశ్వరపురం, ముక్త్యాల అనే పేరు వచ్చింది.
స్థల పురాణం :  ఈ క్షేత్రం మూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం.. త్రేతాయుగంలో పలువురు బుషులు ఈ తీర్ధంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానమాచరించే వారని పురాణా గాధ. నది తీరంలోని ముక్తేశ్వరస్వామి ఆలయంలో  ఆరు నెలలు దేవతాపూజా, ఆరు నెలలు భక్తులతో పూజలు నిర్వహిస్తుంటారు. దేవతా పూజ అంటే కృష్ణానదికి వరదలు వచ్చిన ఆరు నెలలు ఈ ఆలయం నీట మునిగి ఉంటుంది. ఆ సమయంలో మహాబుషులు, దేవతలు పూజిస్తారని భక్తుల నమ్మకం. నదీగర్భంలోని ఈ ఆలయం కాకనదీతీరంలో మరొక భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం కన్పిస్తుంది.
రెండువేల నాటి” శాలివాహన సప్తశతి “లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు చరిత్ర కారులు చెపుతారు. ముక్తేశ్వర స్వామిని బలి చక్రవర్తి ప్రతిష్టించాడని ప్రతీతి. బాణాసురుని తండ్రి ఐన బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరునితో స్వామి.. కృష్ణ నది ఉత్త్తర వాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమయిన ప్రదేశంలో వున్న మానవాళికి ముక్తిని ప్రసాదించుటకు నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలసి అందరిని కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా శివుడు అందులకంగీకరించి ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభువుగా కొలువైనాడని పురాణగాధ. క్రీ.శ 12 వశతాబ్దపు నాటి శాసనాలు శ్రీభవానీ ముక్తేశ్వరస్వామి దేవాలయనందు కన్పిస్తున్నాయి. ఇక్కడే చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండటంతో హరిహరక్షేత్రమైంది. నదీ గర్భం లో బలి చక్ర వర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం వుందని చెప్పు కొంటారు .కృష్ణ అవతల  గుంటూరు జిల్లా, పశ్చిమాన తెలంగాణా, ఉత్తరం తూర్పులలో కృష్ణా నది వున్నవి.
శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి వారి ఆలయం
కార్తీకమాసంలో విశేషపూజ లుంటాయి. ఈ భవానీ ముక్తేశ్వరస్వామి కి మాఘ బహుళ చతుర్ధశి  మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. పర్వదినాల్లోను, పుష్కర సమయాల్లోను ఇచ్చట కృష్ణవేణి ఉత్తరవాహిని లో స్నానం చేయడానికి దూరప్రాంత భక్తులు కూడ తరలివస్తారు.
editing by...sri..Vh Mahesh Vishwakarma gaaru
ముక్త్యాల కోట
కృతయుగంలో బలిచక్రవర్తి కట్టిన దేవాయం కాలగమనంలో నదీగర్భంలోకి వెళ్ళిపోయిందన్నది ఇక్కడి స్థల పురాణ ప్రాశస్త్యం, కాకతీయ, రెడ్డిరాజులు  11వ శతాబ్ధానికి ముందే నదీతీరంలోని ఈ ఆలయాన్ని  భక్తుల కోసం పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. సంతానం కోసం జంట నందులతో కూడిన ఈ శివాలయంలో అర్చన విశేష ఫలితాన్ని ఇస్తుందన్న విశ్వాసంతోనే వారు ఎక్కడా లేని విధంగా వీటిని ప్రతిష్టించారు. కాలగమనంలో ఈ నందులు కూడా ఛిద్రంకాగా ప్రస్తుత వాసిరెడ్డి వంశీయులే వాటిని పునఃప్రతిష్టించారు.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS