Wednesday, August 15, 2018

ప్రమిద_దీపమునకు_నవగ్రహాలకు_వున్న_సంబంధం .


ప్రమిద_దీపమునకు_నవగ్రహాలకు_వున్న_సంబంధం .
ప్రమిదలో  దీప మెలిగించడంలో వున్న నిగూఢ అర్థము .
ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచి ఆయా గ్రహప్రభావ దోషాలను తొలగిస్తుంది .
ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు!
ప్రమిద,అందులోని నూనె ,వత్తులు , కాంతికి, నవగ్రహాలకు సంబంధం వుంది .
ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు .
ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని శాస్త్ర వచనం .
1. ప్రమిద దీపం ...సూర్యుడు
2. నెయ్యి , నూనె- ద్రవపదార్థం ..చంద్రుడు .
3. వత్తులు ..బుధుడు ..
4. ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల .. అంగారకుడు .
5. ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన  రాహువును సూచిస్తుంది .
6. జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు .
7. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం
8. దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం .. కేతువుకు సంకేతం
9. ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి  శుక్రుడు సంకేతం . శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది . 
తమసోమా జ్యోతిర్గమయా .!
ఆశలతో మానవజన్మ సార్థకం కాదని , తద్వారా మోక్షం లభించడం కష్టమని , తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతూ , విషయవాసనల చక్రంలో బందీ అవుతాడు .
*కనుక కర్మలన్నియు భగవదర్పిదంగా చేయవలెనని "గీత"  బోధిస్తుంది*..స్వస్తి ..!!Source:: praveen kumar

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS