Wednesday, August 15, 2018

కదిరి

కదిరి
     అనంతపురం నకు ఆగ్నేయంగా 90 కీ.మీ దూరాన కదరి అను పట్టణం కలదు.  ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి " కదిరి " అని పేరు వచ్చింది. ఇచ్చట శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహాలయం ఉంది.  ఖదిరి వృక్షం(చండ్ర చెట్టు) క్రింద పుట్టలో స్వామి స్వయంభూవుగా ఉద్భవించాడు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది.  ఆలయానికి నాలుగు వైపుల గాలి గోపురాలు ఉన్నాయి.  ప్రధాన ఆలయంలో గర్భాలయం, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం కలవు. రంగ మండపం నందలి నాలుగు స్తంభాలపై గల శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. 
     గర్భాలయంను శ్రీ ప్రహ్లాద వరద నరసింహ స్వామి సన్నిధిగా పిలుస్తారు.  మూల విరాట్టు అష్ట భుజములు కలిగిన ఉగ్రనరసింహడు.  స్వామి అభిషేకానంతరం, వృక్షస్ధలం నందు శ్వేత బిందువులు కానవచ్చును.  ఉత్సవమూర్తిని వసంత వల్లభుడుగా పిలుస్తారు.   ప్రధానాలయంకు ఎడమ భాగం నందు శ్రీ అమృతవల్లి సన్నిధి ఉంటుంది.  ఆలయ ప్రాంగణము లో  శ్రీ వారి శయన మందిరం, నమ్మాళ్వార్ సన్నిధి, శ్రీ రామకోటి స్ధూపం, శ్రీ రామాలయం, శ్రీ ఆంజనేయ స్వామి సన్నధి, శేషశయనుడు, నిత్య అన్నదాన హాలు మొదలగునవి కలవు.
     బ్రహ్మోత్సవాలు పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి  ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా "పౌర్ణమి"ని కదిరి పున్నమిగా జరుపుతారు. ఏటా  అలయంలో వైశాఖ శుద్ధ చతుర్దశి  నాడు నృసింహ జయంతిని , వైకుంఠ ఏకాదశి కి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం.  పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా రథోత్సవం నిర్వహించుతారు.  రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది.  రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో, సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. రథోత్సవం సమయంలో భక్తులు రథంపైకి దవణం, పండ్లు, మిరియాలు చల్లుతారు. క్రింద పడినవి ప్రసాదంగా స్వీకరించుతారు. వీటిని ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక.
     ధర్మవరం  -  పాకాల రైలు మార్గములో కదిరి (RS) ఉంది.  గుంతకల్లు నుంచి తిరుపతి & గుంతకల్లు నుంచి కాట్పాడి రైలు సర్వీసులు (వయా) ధర్మవరం, కదిరి, పాకాల మీదగా ఉంటాయి.  అనంతపురం  - కృష్ణగిరి (తమిళనాడు) జాతీయ రహదారి (NH-42) నందు కదిరి పట్టణం ఉంటుంది.  అనంతపురం, పులివెందుల, జమ్మలమడుగు, కడప, రాయచోటి, ధర్మవరం, హింధూపూర్, చిత్తూరు, తిరుపతి, బెంగుళూర్ మొదలగు ప్రాంతములు నుంచి బస్సులు కదిరి పట్టణం కు ఉన్నాయి.  కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రిమాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా స్థానం సంపాదించు కున్నది.  కదిరి నుంచి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS