దేవుడికి దీపారాధన ఎలా చెయ్యాలి?
దీపారాధన గురించి అనేక విషయాలు చెప్తారు. శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు.
అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.
ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యాలి.
ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందుచేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి. ఇది ఆధ్యాత్మకం.
ఇంకా శాస్త్రీయం ఏమిటంటే ఈ దీపం చుట్టూ జీవ శక్తి ప్రసరిస్తూవుంటుంది. ఆ దీపం దగ్గరకూర్చుని పూజ చెయ్యటం, దానికి ప్రదక్షిణ చెయ్యటం, వగైరాలతో ఆ జీవశక్తి మన శరీరంపై ప్రభావం చూపి, మన శరీరంలోని చిన్నచిన్న లోపాలు పోగొడుతుంది.
బంగారం, వెండి ఆభరణాలు ధరించమని చెప్తారు. ఆ లోహాలను ఆయుర్వేదం మందుల్లోకూడా వాడుతూంటారు. బంగారం, వెండి ధరించటంవల్ల మన శరీరం వేడికి ఆ లోహాలు కరిగి కొంచెం కొంచెం శరీరంలోకి చేరతాయి. తద్వారా శరీరానికి కావాల్సిన ధాతువులు అందుతాయి.
అలాగే బంగారం, వెండి ప్రమిదల్లో ఆవునెయ్యితో దీపారాధనచేసి ఆ దీపం దగ్గర కూర్చుని పూజ చేసినట్లయితే మనలో జీవ శక్తి ప్రవేశించి చిన్న చిన్న లోపాలు సవరింపబడతాయి.
అలాగే బంగారం, వెండి ప్రమిదల్లో ఆవునెయ్యితో దీపారాధనచేసి ఆ దీపం దగ్గర కూర్చుని పూజ చేసినట్లయితే మనలో జీవ శక్తి ప్రవేశించి చిన్న చిన్న లోపాలు సవరింపబడతాయి.
జై శ్రీమన్నారాయణ
⚛⚛⚛⚛⚛⚛
No comments:
Post a Comment