Thursday, March 17, 2022

33 కోట్ల దేవతలు ఎవరు?

 33 కోట్ల దేవతలు ఎవరు?



        

హిందువులను విరోధించువారు…           మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు.



అసలు ఈ  కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు.



హిందువులు అటువంటి చరిత్రను చదివి బుద్ధి హీనులు వారు అనిపించుకొనిరి.



 వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?



హిందూ ధర్మ - సంస్క్రతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది.  మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33కోట్ల పేర్లను చెప్పమని  బలవంతం చేస్తారు.  వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.



సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము'  'వర్గము' (type)  అని అర్థమూ ఉంది.



 ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. 



అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.



యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి  కోటి (33కోటి)  దేవతలు. 



హిందూ గ్రంధములేకాదు  బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి.  బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.



 ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో  వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:



12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) :      1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్  4. మిత్ర  5. ధాతా  6. విష్ణు  7. భగ. 8. వరుణ  9. సవితృ  10. శక్ర   11.అంశ  12. ఆర్యమ.



11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):


1.మన్యు  2. మను  3. మహినస  4. మహాన్ 5. శివ  6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా  8. భవ  9  కాల 10. వామదేవ 11. ధృతవృత.  



8 వసువులు(అష్టవసువులు): 


1. ధరా 2. పావక  3  అనిల  4. అప 5. ప్రత్యుష  6. ప్రభాస  7. సోమ  8  ధ్రువ. 



మరి ఇద్ధరు: 1. ఇంద్ర  2. ప్రజాపతి. 



త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా!  ఈ పేర్లను  కంఠపాఠము చేయునది చాలా సులభము.  ఎవరైననూ ఇపుడు  33కోటి దేవతల పేర్లను చెప్పమంటే  వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS