వ్యాపార అభివృద్ధి-పరిహారాలు
చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు వ్యాపారాలలో అభివృద్ధి చెందాలి అంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించండి. కొంతమంది వ్యాపారాలలో మంచిగా లాభాలు గడిస్తుంటారు. మరికొంతమందికి మందగతిలో వ్యాపారం సాగుతూ ఉంటుంది మరి కొంతమంది వ్యాపారం అభివృద్ధి చెందడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.ఎంత కష్టపడినప్పటికీ వ్యాపారంలో కొంత మందికి లాభాలు రాకుండా ఉంటాయి. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కొన్నికొన్ని పరిహారాలు పాటిస్తూంటే వ్యాపారం అద్భుతంగా రాణిస్తోంది వ్యాపారాల్లో నష్టాలు రాకుండా ఉండాలన్నా వ్యాపారుల్లో పోటీని తట్టుకొని బాగా లాభాలు రావాలన్న ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుందాం.ఏ వ్యాపారం చేసే వాళ్లయినా సరే వ్యాపారం బాగా కలిసి రావాలంటే మీ షాపులో ఉత్తర దిక్కులో లక్ష్మీదేవి ఫొటో పెట్టుకోవాలి ఆ లక్ష్మీదేవి ఫొటో దగ్గర షాపు తెరవగానే అగరబత్తులు వెలిగించాలి.లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారం బాగా సాగుతోంది ఒకొక్కసారి వ్యాపారం సరిగ్గా జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు వ్యాపారం బాగా సాగాలంటే బియ్యంపిండితో పరిహారం చేయండి.శుక్లపక్షంలో సూర్యోదయానికి ముందే ఏ బిజినెస్ చేసేవాళ్లయినా చిటికెడు బియ్యం పిండి తీసుకుని వెళ్లండి. మీ షాపు మెయిన్ ఎంట్రన్స్ తలుపుమీద కొద్దిగా బియ్యప్పిండి చల్లి ఇంటికొచ్చేయండి. తరవాత స్నానంచేసి షాపుకు వెళ్లి షాప్ ఓపెన్ చేసి వ్యాపారం చేసుకోండి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఎవరైతే బిజినెస్ చేసేవాళ్లు రోజు సూర్యోదయానికి ముందే వ్యాపార స్థలానికి వెళ్లి మెయిన్ఎంట్రన్స్ మీద ఒక చిటికెడు వరిపిండి చల్లివస్తారో వారికి వ్యాపారం బాగా సాగుతోంది. మీరు వ్యాపారం చేసేచోట ఏదోఒక చెట్టులేదా చిన్న మొక్కను పెంచండి.ఆ మొక్క లేదాచెట్టు దగ్గర అగరబత్తులు వెలిగించి కొద్దిగా పాలు పోయండి.ఇలా చేస్తే వ్యాపారం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అలాగే వ్యాపారం సక్సెస్ అవ్వటానికి రావిచెట్టు పరిహారం కూడా చేయవచ్చు.శనివారం రోజు ఒక తెల్లటి వస్త్రాన్ని జెండాలాగా తయారుచేసి రావి చెట్టు కొమ్మకి ఆ జెండాను కట్టిరండి ఏ బిజినెస్ చేసే వాళ్లైనా తెల్లటి వస్త్రాన్ని జెండాలాగా తయారుచేసి శనివారం రావి చెట్టు కొమ్మ కట్టాలి.ఆ రావి చెట్టు కొమ్మకు జెండా ఎగురుతున్నట్టుగా కడితే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది.అదే విధంగా శనివారంనాడు దేవాలయంలో పులిహోర పంచిపెట్టడం గానీ లేదా శనివారంనాడు పాదరక్షలు దానంగాఇవ్వడం గానీ చేస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది.
No comments:
Post a Comment