Friday, March 11, 2022

స్నానానికి సమయం మీకు తెలుసా ?

 స్నానానికి సమయం మీకు తెలుసా ? 



తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి... ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం....


ఇక స్నానాల్లోకెల్లా... చన్నీటి స్నానం. ఉత్తమమైనది. ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మధ్యమం. నూతివద్ద స్నానం చేయడం అధమం. మిగతా స్నానాలకు పేర్లులేవు. వేయిపనులున్నా... వాటిని వదిలి... సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.


నదీస్నానం, కాలవల్లో స్నానం చేసేప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానం చేయాలి. మగవారు ఎదురుగా కాకుండా, వాలుగా స్నానం చేస్తే వారి మగతనం నషిస్తుంది. అదేవిధంగా ఆడవారు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేస్తే... వారి స్త్రీత్వం నశిస్తుంది. (ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే... నేడు సంతానలేమికి కారణమవుతున్నాయి)


ఒక నదిలో స్నానం చేసేప్పుడు మరో నదిని దూషించకూడదు

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS