Friday, March 18, 2022

వాహనము రంగులు

 వాహనము రంగులు



చాలామందికి ఏ రంగు వాహనము వారికి కలిసివస్తుంది అని  తెలుసుకోవాలని ఉంటుంది.జాతక రీత్యా ఆ రంగు వాహనాలను వాడడానికి ప్రయత్నం చేస్తుంటారు.అందరికీ కలిసి వచ్చే రంగు నేవీ బ్లూకలర్ అందరికీ ఈ కలర్ కలిసొస్తుంది.ఈ కలర్ వాహనాలు సాధారణంగా యాక్సిడెంట్లు ఇవ్వవు. అంతేకాకుండా బ్రేకులు ఫెయిల్ అవడం లాంటి విషయాలు కూడా సాధారణంగా జరగవు.ఇదే విధంగా అందరికీ కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఈ వాహనాలు  దాదాపుగా ఎటువంటి ప్రమాదాలు ఇవ్వవనేచెప్పాలి.సాధారణంగా ఇబ్బందిపెట్టే రంగు ఎరుపు రంగు వాహనాలను చెప్పాలి కానీ ఇది అందరికీ ఇబ్బంది పెట్టదు లక్కీ నెంబర్ తొమ్మిది అయినవాళ్లు జాతకంలో కుజగ్రహ అనుకూలంగా ఉన్న వాళ్లకి ఈ రంగు కలిసొస్తుందనే చెప్పాలి మిగిలిన వాళ్ళకి కాస్త ఇబ్బంది పెడుతుంది.కొంతమంది గ్రే కలర్ బండి కొంటూ ఉంటారు దీనివల్ల ఆర్థిక పరంగా  పెద్దగా ఇబ్బందేమీ ఉండదు కానీ కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రౌన్ కలర్ లేదా మీగడ రంగు కలర్ ఈ కలర్ వాహనాలు జాతకంలో రవి భగవానుడు బలహీనంగా ఉంటే  వాడకూడదు ఒకవేళ వాడితే వీరికి ఆర్థికపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.పూర్తి తెలుపురంగు వాహనాలు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు కానీ  అప్పుడప్పుడు అద్దాలు  పగిలిపోయే అవకాశం ఉంటుంది.

స్కై బ్లూ కలర్ వాడేవారు... ఈ వాహనానికి పెద్దగా పనుండదు అప్పుడప్పుడు మాత్రం బయటకు తీస్తూ ఉంటారు.ఈ రంగులన్నీ యూనివర్సల్ గా ఉపయోగపడే రంగులు మాత్రమే.సాధారణంగా జాతకం చూసుకొని జాతకచక్రంలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయో ఏగ్రహాలు ఉపయోగపడుతున్నాయో దాని ఆధారంగా ఆ రంగులు వాహనాలు వాడుతున్నప్పుడు బాగా కలిసి వస్తుంది.కానీ యూనివర్సల్ కలర్స్ వాడే వారు ఏ రోజు ప్రయాణం చేస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించిన దుస్తులు ధరించినపుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగుతుంది.అన్ని రంగుల బట్టలు ధరించడం కష్టం అనుకున్నప్పుడు ఆ రంగు ఉన్న కర్చీఫ్ జేబులో ఉంచుకోవడం వల్ల కూడా అనుకూల ఫలితాలు లభిస్తాయి.ఆదివారం  గోధుమరంగు సోమవారం తెలుపురంగు మంగళవారం ఎరుపు,బుధవారం ఆకుపచ్చ,గురువారం పసుపు,  శుక్రవారం తెలుపు, శనివారము నీలం రంగు కర్చీఫు వాడటం వలన అనుకూల ఫలితాలు వస్తాయి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS