Friday, March 11, 2022

కాశి విశ్వనాథ్ ఆలయం



👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*

👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*

👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*

👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*

👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు*

👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*

👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*

👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*

👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*

👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*

👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*

👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*

👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*

👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*

👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*

👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*

👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*

👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*

👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 

👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*

👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*

👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*

👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*

👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*

👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*

👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*

*👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.🙏*

*సేకరణ 🙏*

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS