లక్ష్మీ కటాక్షం కోసం 🌹🙏
ప్రతి రోజు చేసే నిత్య పూజ లో లక్ష్మీ దేవి ఫొటో కానీ విగ్రహం కానీ... పసుపుకుంకుమా, పువ్వులు తో అలంకారం చేసి.. ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని.ఈ పూజ చేయాలి..
పూజ విధానం
108 ఒక్కరూపాయి బిల్లలు తీసుకుని లక్ష్మీ అష్టోత్తరం తో ఒక్కో నామం చదువుతూ.. ఒక్కో రూపాయి బిళ్ళ అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి..హారతి ఇవ్వాలి రోజూ మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు కానీ శుక్రవారం మటుకు బెల్లంఅన్నం నివేదన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వరులు అయిపోతారు అని నేను చెప్పను కానీ.. మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు అప్పు చేసే అవసరం రాదు, అప్పు ఉన్న కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటుంది... ఈ పూజకు ఆహార నియమాలు , ఇంక ఏమైనా నియమాలు అంటూ లేదు కానీ లక్ష్మీ దేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు.
రోజూ ఈ కాసులు పూజ ఐయాక కూడా అక్కడే ఉంచాలి రోజూ అవే వాడాలి .ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికి ఇవ్వకూడదు.. ఖర్చు పెట్ట కూడదు.పూజ 41 రోజు మొక్కుకొని చేయవచ్చు. తర్వాత కూడా ఎన్ని రోజులైనా చేయవచ్చు.
ఈ పూజ ఇదే విధంగా తామర గింజలు తో,పసుపు కొమ్ములతో కూడా చేయవచ్చు. స్తోమత ఉన్నవారు.108 వెండి కానీ బంగారు పుష్పాలతో అష్టోత్తరం చదివి పూజ చేయవచ్చు.
మంత్రం ఉపదేశం ఉన్న వారు లక్ష్మీ గాయత్రి, లక్ష్మీ మూల మంత్రం, కమలదేవి మంత్రం తో ఇదే విధంగా 108 సార్లు అర్చన చెలుకోవచ్చు.
లక్ష్మీ దేవికి నేతితో దీపారాధన శ్రేష్టం, నువ్వులు నూనె ,కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. నిమ్మపండు పులిహోర, పెసరపచేసుకోవచ్చు.సెనగలు.ఇష్టమైన నైవేద్యం..
లక్ష్మీ పూజకు, కుబేర పూజకు .ధన ప్రాప్తి కోసం చేసే పూజలో సువాసన గల ఆగరబతి గాని సాంబ్రాణి కానీ.సువాసన గల పుష్పలు.పూజ మందిరం సువాసన తో ఉండాలి పూజలో ఇది ముజ్యమైన విషయం.
రోజూ కుదరని వాళ్ళు ప్రతి గురువారం, శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఈ రూపాయి బిల్లలు బీరువాలో పెట్టుకోవచ్చు లేదా నిత్యం పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు ఉంచడం మంచిది.
🕉శుభమస్తు 🕉
No comments:
Post a Comment