Friday, March 11, 2022

నామ నక్షత్ర పీఠిక

 నామ నక్షత్ర పీఠిక 



చూ-చే-చో-లా  అనే  వాక్యాల యొక్క మొదటి అక్షరము 1 వ పాదము అని, రెండవ అక్షరము 2 వ పాదము అని, మూడవ అక్షరము 3 వ పాదము అని, నాలుగవ అక్షరము 4 వ పాదము అని ఈ ప్రకారము 27 నక్షత్రములకు చూచుకొనవలె. జన్మ నక్షత్రము కలిగిన వారు క్రింద గల పట్టికలోని తమ అక్షరము వెతికి ఆ నక్షత్రముగా గ్రహించవలెను. జన్మ నక్షత్రము తెలియని వారు, నామ నక్షత్రములను బట్టే చూచుకొనవలెను.


గమనిక : చాలా మంది తెలియక పిల్లలకు పెట్టే పేర్లలో పెద్ద పొరబాటు చేస్తున్నారు ప్రస్తుత కాలంలో. బిడ్డ జన్మించగానే ఎవరైనా పండితుని సంప్రదించి ఏ పేరు పెడితే బాగుంటుంది అని అడిగితే వారు బిడ్డ పుట్టిన సమయాన్ని బట్టి అక్షరం చెబుతున్నారు. అయితే తలిదండ్రులేమో నెట్ లో కానీ పుస్తకాల్లో కానీ వారు చెప్పిన అక్షరంతో ఇంగ్లీష్ లెటర్స్ బట్టి ఎంపిక చేసుకుంటున్నారు. దీనివల్ల చాలా తేడా వచ్చి పుట్టిన నక్షత్రం కాకుండా మరో నక్షత్రాన్ని పెట్టుకుంటున్నారు.


ఉదాహరణకు: పుట్టిన సమయాన్ని బట్టి పండితుడు లీల (భరణి-2వ పాదం) పెట్టుకోమని చెప్పారనుకోండి. తెలియక తలిదండ్రులు ఇంగ్లిష్  L  అక్షరంతో వెతుక్కుని లావణ్య  (అశ్విని-4) అనో పెట్టుకుంటున్నారు. దీనివల్ల జన్మనక్షత్రం చాలా మంది తేడాతో పెట్టుకున్నవారవుతున్నారు. తెలుగులో అయినా ఒకే అక్షరం వివిధ నక్షత్రాల్లో ఉంటుందని గమనించాలి, విధిగా నామ నక్షత్ర పట్టికను అనుసరించాలి. సరిగ్గా పండింతులు చెప్పిన అక్షరంతోనే పేరు వచ్చేలా పెట్టుకుంటే మంచిది. 

సంయుక్తాక్షర నామ నక్షత్ర వివరణ


పై పట్టికలో అన్ని అక్షరాలూ ఉంచబడనందున క్రింద తెల్పిన ప్రకారం సరి చూసుకునే కొన్ని పేర్లకు తగువిధంగా పూర్వులు వివరించారు. ఈ వివరణ బ్రహ్మ యామిళ కాలవిధానలలో వివరించ బడినవి.వివరణ:

కృష్ణ, క్రాంతి - మృగశిర 3 వ పాదం

హృతిక్, హృష్ణ - స్వాతి 1 వ పాదం

శ్రీధర్ - చిత్తా 4 వ పాదం

క్షేత్రజ్ఞ - హస్తా 2 వ పాదం

జ్ఞానేశ్వర్ - ఆర్ద్ర 3 వ పాదం

భీమేశ్వర్ - మూల 3 వ పాదం (ఇది బాగా గుర్తుంచుకోవాలి) 

భైరవ - పూర్వాషాడ 3 వ పాదం

క్షేమ - పునర్వసు 1 వ పాదం

ఫణి - ఉత్తర ఫల్గుని 3 వ పాదం

ద్రోణుడు, ద్రౌపది - స్వాతి 3 వ పాదం

యల్లన, యాచన, యగ్ని, యజ్ఞ - జ్యేష్టా 2 వ పాదం

యెఱ్ఱన - మూల 1 వ పాదం 


మరికొన్ని:


శివ, శోభ - ఉత్తరాభాద్ర 2 వ పాదం

స్నేహ - అనూరాధ 4 వ పాదం

స్వాతి, స్వప్న - రోహిణి 2 వ పాదం

ప్రభాకర్, బ్రాహ్మినీ, ప్రణీత - చిత్త 3 వ పాదం

హ్లాదిని - ఆశ్విని 4 వ పాదం


ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవాలి మొదటి అక్షరం సంయుక్తాక్షరం (ఉదా: కర్త, కర్మ, కన్య, భర్త), లేదా ద్విత్వాక్షరం (ద్విత్వాక్షరం అంటే అదే అక్షరానికి అదే వత్తు కలియునవి, ఉదా: అక్క, అన్న, అమ్మ, అవ్వ) అయినచో అక్కడ హైలెట్ అవుతున్న అక్షరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. (ఉదా: స్నేహ అంటే ఇక్కడ నే అనేదే హైలెట్ అవుతుంది గాన నే అనే అక్షరం కలిగిఉన్న {నా నీ నూ నే - అనూరాధ} అనూరాధ నక్షత్రం 4 వ పాదం గ్రహించబడింది).

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS