Friday, March 18, 2022

శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం

 శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం



ఆదాయం లేదా ధనం పెరగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం  కోసం కచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.ప్రధానంగా నాలుగు చోట్ల కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మొదటిది ఇంటి గుమ్మం .రెండోది వంటగది.3 దేవుడు గది.  4 బీరువా ఈ నాలుగు చోట్ల ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఇంటిలోపలికి ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మొట్టమొదటిది ఇంటిగుమ్మం .100 గ్రాములు నవధాన్యాలు తీసుకోండి. వీటిని ఎల్లో కలర్ గుడ్డలో మూటగట్టి ఇంటి సింహద్వారం లోపల భాగంలో కట్టండి ఇది  శుక్రవారం పూట చేయాలి. మళ్లీ మూడు నెలలకొకసారి నవధాన్యాలు మార్చాలి.తీసి వేసిన నవధాన్యాలను ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఏదైనా చెరువులోగానీ కలపండి.   అలా చేస్తే గుమ్మంలోకి ధన ఆకర్షణ పెరుగుతుంది.ఆ తర్వాత వంటగది లో శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో,మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్య  టైంలో ఒక పళ్లెంలో దొడ్డు ఉప్పు పోసి పైన ఒక పసుపుకొమ్ము ఉంచాలి.ఈ విధంగా పైన చెప్పిన మూడు సమయాలలో మూడు పళ్లాలలో ఉప్పు పోసి,పసుపు కొమ్ము పెట్టి ఉంచాలి.మర్నాడు శనివారం ఉదయాన్నే దొడ్డు ఉప్పు పసుపు కొమ్ములను ఏదేనా చెట్టు మొదట్లో వేయాలి.మొదటి శుక్రవారం వంటగదిలో ఈ విధంగా చేస్తే ధన ఆదాయం పెరుగుతుంది.

మూడవది పూజ మందిరం పూజా మందిరంలోనికి ధనాకర్షణ కలగాలంటే  రోజూ పాలు భగవంతుడికి నైవేద్యం పెట్టాలి.లక్ష్మి దేవికి గానీ మీ ఇష్ట దైవానికి గానీ నైవేద్యంగా పెట్టవచ్చు.ఆ పాలను కుటుంబసభ్యులందరూ ప్రసాదంగా తీసుకోవాలి. చివరగా బీరువా.. శుక్రవారం ఒక ఎల్లో కలర్ క్లాత్ లో ఆరు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం మూటగట్టి బీరువాలో ఉంచండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.ధన ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణ పెరిగితే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర,వంట గదిలో, పూజ గదిలో,మరియు బీరువా ఈ నాలుగు చోట్ల ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి మీ ఇంటి లోపలికి ధన ఆకర్షణ పెంపొందింప చేసుకోండి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS