Friday, March 18, 2022

జప సమయం లో ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు

 జప సమయం లో ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు



జపానికి దర్భాసనం ఎందుకు ఉపయోగిస్తారు


కూర్చునేటప్పుడు ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి కటికనేలమీద కూర్చోకూడదు.

కూర్చోడానికి కుర్చీ, పీట, మంచం - ఇలా ఏదో ఒక ఆసనాన్ని ఉపయోగించాలి. ఆసనం అనేది అనేక రకాలుగా చేయబడుతుంది. చెక్కతో తయారయ్యే పీట మొదలైన ఆసనాలు, ఈతాకు, తాటాకు, జనపనార తదితరాలతో తయారయ్యే చాపలు, ఉన్ని, నూలు తదితరాలతో రూపొందే వస్త్రాలు, దర్భాసనం,  ఇలా అనేకం ఉన్నాయి. కూర్చునేటప్పుడు వీటిల్లో ఏదో ఒకదానిపై కూర్చోవాలి. అంతే తప్ప ఏ ఆసనమూ లేకుండా ఒట్టి నేలమీద కూర్చోకూడదు.


కటికనేల మీద ఎందుకు కూర్చోకూడదు అంటే


మన శరీరంలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఉత్పత్తి అయిన విద్యుత్తు బయటకు పోతూ ఉంటుంది. ఉత్పత్తి అయ్యే, వెలుపలికి పోయే విద్యుత్తు సమతూకంలో ఉండాలి. అందులో హెచ్చుతగ్గులు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.


ఒక ఆసనం మీద కూర్చోవడాన మన శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఒట్టినేలమీద కూర్చున్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యేదాని కంటే ఎక్కువ విద్యుత్తు బయటకు పోతుంది. యోగాసనం వేసేటప్పుడు చాప  ఉపయోగించాలి. ఒట్టినేలపై కూర్చోకూడదు అని శాస్త్రం చెప్తోంది. పూజ చేయడానికి, అన్నం తినడానికి, ప్రవచానానికి, మామూలుగా కాలక్ష్యేపానికి, విశ్రాంతి తీసుకోడానికి ఇలా రోజులో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూర్చుంటాం.


ప్రత్యేకించి పూజా కార్యక్రమాలలో 

దర్భాసనం పై కూర్చుని పూజ చేసుకోవటం చాలా శ్రేష్టం.


పురాణాల్లో గరుత్మంతుడి కథ చాలామందికి తెలిసిందే. ఒక పందెంలో ఓడిపోయి, సవతి తల్లి కద్రువకు దాసిగా ఉన్న తన తల్లి వినతకు ఆ దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి గరుడుడు స్వర్గానికి వెళ్ళాడు. అమృతభాండాన్ని సంపాదించాడు. అయితే కద్రువ సంతానమైన నాగ జాతికి ఆ అమృతం అందకుండా చూడాలని ఇంద్రుడు కోరాడు. అమృతభాండాన్ని నాగుల దగ్గరకు తెచ్చి, వినతకు గరుత్మంతుడు దాస్య విముక్తి కలిగిస్తాడు. అమృతభాండాన్ని దర్భల మీద పెట్టి, శుచిగా స్నానం చేసి వచ్చి అమృతం స్వీకరించాలని నాగులకు చెబుతాడు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఇంద్రుడు ఆ భాండాన్ని తీసుకుపోతాడు. అలా అమృత భాండం పెట్టడం వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందుకే అమృతతుల్యమైన దర్భలతో చేసిన ఆసనం మీద కూర్చొని చేసే జపం మంచి ఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెప్పారు.


జపం లేదా పూజ చేసేటప్పుడు ఆసనం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి. ఆ ఆసనం గురించి కొంత తెలుసుకోవడం ఉత్తమం. దర్భాసనము వేసుకుని, దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేయడం ఉత్తమం. కొందరు క్రమంగా దర్భాసనం, కంబళి, వస్త్రం వేసుకుని జపం చేస్తారు. 


కేవలం పీట వేసుకుని జపం చేయడం మంచిది కాదు. "దరిద్రం దారుకాసనం" అన్నారు. పీటపై వస్త్రం వేసుకుని చేసుకోవాలి. పీట 6 అంగుళాల ఎత్తులో చేయించుకుంటే మంచిది అంటారు. అలా చేయడం వలన భూమ్యాకర్షణ శక్తికి లొంగక మన మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS