Thursday, March 17, 2022

జ్యోతిష్యం శాస్త్రం కాదన్నిది ఎవడ్రా ?

జ్యోతిష్యం శాస్త్రం కాదన్నిది ఎవడ్రా ?

------------------------------------------------------------------------

‘‘భారతీయ మహర్షులది దివ్యజీవనం అని నిరూపించడానికి అద్భుతమైన ఉదాహరణ కావాలంటే ఖగోళరహస్యాలు కనుగొనడానికి వారు పరికరాల గురించి తెలుసుకుంటే చాలు. నులక మంచం తాడుతోటి, వెదురు ముక్కల తోటి మహర్షులు సృష్టి రహస్యాలు కనుగొన్నారు. భూమి నుంచీ సూర్యుడి దూరం చెప్పగలిగారు. సూర్యుడి వ్యాసం చెప్పగలిగారు. సూర్యుడు కదలడం లేదని నిరూపించారు. భూమితో పాటు అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని నిరూపించారు. దీని కోసం  వారు అమెరికా అంతరిక్షపరిశోధనా సంస్థమాదిరిగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసి ఎక్కడ కూలిపోతుందో తెలియని ---స్కైలాబ్ ---లు  తయారు చేయలేదు. ఉన్న చోటు నుంచే ఖగోళ రహస్యాలు తెలుసుకోవడానికి గణితం వృద్ధిచేశారు. జ్యామితి పెంపొందించారు. గణిత శాస్త్ర సహాయంతో వేదాలలో ఉన్న జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు అందించే ఎన్నో గ్రంథాలు వ్రాశారు.‘‘ అని భారతీయ ఖగోళశాస్త్ర అద్భుతాలు ఆవిష్కరించిన మహర్షుల విశేషాలు ఆంధ్రవ్యాసుల వారు చెప్పారు.

మహర్షులు ఏ విధంగా ఖగోళ రహస్యాలు కనుగొన్నారు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పారు.

‘‘పూర్వం ఆస్ట్రాలజీ, మేథమేటిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్, ఇంజనీరింగ్ వంటి శాస్త్రాలన్నీ జ్యోతిషం అనే మహారాశిలో ఉండేవి. ఇది వేదాలలో ఉన్న శాస్త్రాలకు ఉపాంగం. వేదాలను డీకోడ్ చేసి ఒక్కో మహర్షి పామర భాషలో వ్రాసిన శాస్త్రాలే ఆయుర్వేద, జ్యోతిష, వ్యాకరణ గ్రంథాలు. వీటిలో ఇంకా వివరంగా చెప్పాలంటే భారత జ్యోతిషశాస్త్రాన్ని ఆర్యభట్టు ముందు తరువాత అని చెబుతారు. వీరిలో చెప్పుకోతగిన మహానుభావుడు బ్రహ్మస్ఫుటసిద్ధాంతం వ్రాసిన బ్రహ్మగుప్తుడు. ఆ శ్రేణిలో విరాట్రూపం మాత్రం వరాహమిహురునిదే. ఆయన ఖగోళ, గణిత, జ్యోతిషాదులతో పాటు భూగర్భ, వృక్షశాస్త్రాలు కూడా ఔపోసన పట్టిన మహానుభావుడు. భూమిలో ఎక్కడ నీరు ఉందో చెప్పడానికి ఆయన వృక్షాల సాయం తీసుకొన్నాడు. ఏ చెట్టు ఎక్కడ ఉంటే దానికి ఏ దిక్కున ఎంత దూరంలో ఎంతలోతున తవ్వితే నీరుపడుతుందో ఆయన చెప్పాడు. అంతే కాదు మహర్షులు పంగల కర్ర (వై షేపులోనిది) తీసుకొని ఒక మంత్రం ప్రయోగంతో భూమిలో ఎక్కడ నీరు ఉందో చెప్పగలిగేవారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ప్రయోగాలు చేసి నీరు ఉనికి చెప్పగలిగే వారు ఉన్నారు.‘‘ అని అన్నారు.

కొందరు వారు చూపిన దారిలో మరింత పరిశోధన చేయగా పూర్వ మహర్షులు తమ లేబొరేటరీలలో వాడిన పరికరాల రహస్యాలు తెలిశాయి. ముఖ్యంగా బ్రహ్మగుప్తుడు వాడిన పరికరాల వివరాలు తెలిశాయి.

అవి ఇవి. పూర్వం వీటిని యంత్రాలు అనేవారు. ఈ పరికరాలను గ్రహాల కదలికలు తెలుసుకోవడానికి రహస్యాలు ఆవిష్కరించడానికి అనేక అవసరాలకోసం వాడేవారు. 

1) ధనుర్యంత్రం- అంటే విల్లు వంటి పరికరం. 
2) తుర్యగోళక యంత్రం.
3) చక్ర యంత్రం.
4) యష్టి యంత్రం.
5) శంకు యంత్రం 
6) ఘటికా యంత్రం ఇదే పూర్వపు కాలంలో గడియారం.
7) కపాల యంత్రం భిక్షాపాత్ర కుండపెంకు వంటిది
8) కర్తరీ యంత్రం - కత్తెర 
9) పీఠయంత్రం: పీట లేదా కూర్చీ వంటిది
10) సలిల యంత్రం నీటితో భూమి చదును, వాలు కనుగొనే పద్ధతి
11)భ్రమ యంత్రం - తిరుగూ వృత్తాలు గీయడానికి ఉపయోగించేది.
12) అవలంబ సూత్రం - తాడుకట్టి ఉన్న ప్లంబము వంటిది. నేటికీ ఇల్లు కట్టే మేస్త్రీలు వాడుతుంటారు.
13)కర్ణములు, ఛాయాకర్ణములు 
14) ఛాయా లేదా శంఖు ఛాయ అన్నవరంలో ఉన్న సన్ డయల్ వంటిది.
15)దినార్థ యంత్రం సరిగ్గా మధ్యాహ్నం కనుగొనేది.
16) అర్క యంత్రం సూర్య పరికరం
చివరిది 
17) అక్ష లేదా ఫలాంశ యంత్రం. 
 
ఈ 17 యంత్రాలు ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తాను వ్రాసిన బ్రాహ్మస్ఫుటసిద్ధాంత గ్రంథంలో చెప్పాడు. 
 
ఈ పరికరాలు ఒక్కొక్కటీ ఒక్కో అవసరానికి వినియోగించేవారు. వీటిలో సలిల యంత్రం నుంచీ అక్ష యంత్రం వరకూ ఉన్నవి చాలా ముఖ్యమైనవి. వీటితో తాము తయారు చేసే యంత్రాల కచ్చితత్వం పొందేవారు. అంతే కాదు యజ్ఞయాగాదులలో హోమ గుండాలు ఏర్పాటు చేయడానికి, శ్రీచక్రం వంటి యంత్రాలు తయారు చేయడానికి కూడా ఉపయోగించేవారు. వీటిలో చక్రయంత్రాలకు ఉదాహరణగా కోణార్క దేవాలయంలోని రథ చక్రాలు చెప్పుకోవచ్చు. ఈ దేవాలయంలోని ఒక్కో చక్రం ఒక్కో ఖగోళంలోని గ్రహరాసుల లెక్కలు నిక్కచ్చిగా తెలుపుతాయి.  యష్టి యంత్రం అంటే నేటికీ కొన్ని దూరాలు కొలవడానికి వాడుతున్న పరికరానికి మాతృక వంటిది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గోళయంత్రం ఒక్కటీ ఒక ఎత్తు. 

ఇవి ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో సవివరంగా ఉన్నాయి. నేడు ముఖ్యంగా బడిపిల్లలకు వీటిని ఏ మాత్రం ఖర్చు లేకుండా చూపించవచ్చు. ఉపయోగించడం నేర్పించవచ్చు. తయారు చేసుకోవడం నేర్పించవచ్చు. ఏ మాత్రం ప్రమాదం లేనివి.  ఒక పిల్లవాడు సైన్సు సబ్జెక్టుకు పనికి వస్తాడా రాడా అనేది పాఠశాల రోజుల్లోనే నిర్ణయించవచ్చు. ఇవేవీ అక్కర్లేదు. నులక మంచం తాడు, కుండపెంకు, వెదురు బొంగులతో వాడికి ఆస్ట్రానమీ అంతావచ్చేస్తే ఎల్ కేజీకి  10 లక్షల డొనేషన్లు కట్టించుకునే పిల్లల విద్యాలయాల కబేళాలు ఏమైపోవాలి? 

భారతీయ మహర్షుల వైజ్ఞానిక పరిశోధనలు ఉన్న సంస్కృత గ్రంథాలను పరిశోధించి వ్యాసాలు రాస్తుంటే మెకాలే కళ్ళ జోళ్ళతో ప్రపంచం చూస్తున్న ఆధునిక పశువులు వెక్కిరిస్తున్నాయి. పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నచందంగా ఉంది వారి విమర్శ. సైన్సు  ఇంజనీరింగు అంటే లక్షలు కోట్ల రూపాయల వ్యాపారం గా చదువుఅమ్ముకుంటున్న ప్రొఫెసర్ కిరాతకులకు ఇవి మింగుడు పడవు. 

టెక్నాలజీ,  టెక్నాలజీ చదువు అంటే డబ్బులు దోచుకోవడానికి వైట్ కాలర్ దోపిడీకి అలవాటుపడిన వారు సంస్కృతాన్ని చంపేసి  భారతీయ విజ్ఞానాన్ని సమాధి చేస్తున్నారు.

టెక్నాలజీ అంటే టన్నుల కొద్దీ డబ్బుతో నిండిన పెంట కుప్పగా  మార్చి విద్యార్థుల మెదళ్లు చిదిమేస్తున్నారు. వీరికి కావలసింది డబ్బు ఖర్చుచేసి, డబ్బు సంపాదించే రోబో పిల్లలు. అంతేకానీ పిల్లవాడికి కాలసిన మౌలికమైన విజ్ఞానం కాదు. 

గణితంలో  పిజి, పిహెచ్ డి చేసిన విద్యార్థికి కూడా వృత్తాలను ఉపయోగించి మహర్షులు గ్రహణ రహస్యాలు కనుగొన్నారని తెలియదు.  నిజంగా తామ వైజ్ఞానిక ఆత్మ ఎక్కడుందో తెలియాలంటే ఆర్యభటీయం, బ్రహ్మస్ఫుటసిద్ధాంత గ్రంథాలలో నాలుగు శ్లోకాలు చదివితే తెలుస్తుంది. ఆధునిక విజ్ఞానం పెరిగింది, పెరగాలి కూడా.  కానీ దానికి అవసరమైన బైనరీ సిస్టం భారతీయ గ్రంథాల్లో ఉంది. ఇది చెబితే పుర్ర - చేతి తిండితిని పెరిగిన ప్రొఫెసర్ తల వెయ్యివక్కలైపోతుంది. అమెరికా, రష్యా, జర్మనీల్లో నేటికీ భారతీయ సంస్కృత గ్రంథాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో వారు  ఒక్కక్క రహస్యం కనుగొని ప్రపంచం తీరు మారుస్తున్నారు. కనుకనే ఇంకా అటువంటి వాటి కోసం వారు అక్షరాలా తపస్సు చేస్తున్నారు. 

మన నేతలు మాత్రం  గంగిగోవు వంటి సంస్కృత కళాశాలలు చంపి గోమాంస భక్షణం చేస్తున్నారు.  బొక్కల తడిక భారతరాజ్యాంగలోని సెక్యులరిజం, సైంటిఫిక్ టెంపర్ మెంట్ ను వీరంతా పోషిస్తున్నారు. సంస్కృతాన్ని విస్మరించి చేస్తున్న సెక్కులర్ సైంటిఫిక్ టెంపర్ మెంట్ తో నేడు భారత దేశ విశ్వవిద్యాలయాల్లో పిశాచాల్ని తయారు చేస్తున్నారు, ప్రొఫెసర్లు అని పిలిపించుకుంటున్న దౌర్భాగ్యులు.   

(పండితుల వారి సంభాషణ ఆధారంగా)

ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం
ప్రత్యామ్నాయ మాధ్యమ పాత్రికేయ నిపుణుడు
---------------------------------------------------------------
దేవభాష పునర్వైభవం కోసం 09-8-2017న ప్రారంభం అయిన మరో క్విట్ ఇండియా ఉద్యమంలో పెట్టిన ఏడాది గడువులో మరో రోజు ముగిసింది. మొద్దునిద్దరోతున్న నేతలు పశ్చాత్తాప పడడానికి 327 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 
సమరమో, సంధో తేల్చుకోండి!!! ప్రాచ్య భాషలకు మొక్కుతారా? ప్రజాగ్రహానికి గురవుతారా? తేల్చుకోండి

1500 యేళ్ళ క్రితమే అంగారక గ్రహం పై నీళ్లు,ఇనుము ఉందని చెప్పిన వరాహమిహిర ! 

ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవతున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి కాస్తంత తెలుసుకుందాం.

వరహమిహిర ఎవరు?

499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపున్యుడు మరియు జ్యోతిష్కుడు. వరాహమిహిర సూర్య సిద్ధాంత’ పేరు మీదట 515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు.

సూర్య సిద్ధాంతం:

సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు మరియు రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు మరియు రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి మరియు నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. . భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు ,చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వరాహమిహిర తెలిపాడు. ఇంకా ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు మరియు ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా ఈ పుస్తకంలో సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు.

సూర్యసిద్ధాంతం దొంగలించబడింది:

కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం ప్రస్తుతం దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన ముందుముందు పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన ఆ గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు.

జ్యోతిష్యశాస్త్రం:

వరాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన మొత్తం జ్యోతిష్యంలోని మూడు ముఖ్యమైన జ్యోతిష్యాలను రాశాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్,లగ్న వారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ జ్యోతిష్యగ్రంధాలను ఆయన రాశాడు.

వరాహమిహిర తనయుడు పృథుయసస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంధాన్ని రాశాడు. ఈయన ‘హోరా సర’జ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చెబుతారు. poorna mohan

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS