వశ్యం లేదా వశీకరణం - ఈ క్రియ ద్వారా సర్వ భూతాలను వశం చేస్కోవచ్చు, వాటిలో వశీకరణ కోరిక కలిగి వశం అవడం జరుగును
ఆకర్షణ లేదా మోహనం - ఈ క్రియ ద్వారా ఇద్దరి మధ్య ఆకర్షణ కలిగించవచ్చు. ఒక వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడున్నా మన దగ్గరకు రప్పించవచ్చు.
3. స్తంభనం - ఈ క్రియ ద్వారా శత్రువు మన ముందు నిలబడినా మాట్లాడలేరు. వారి అన్ని పనులు ఆగిపోయేలా అవుతాయి
4. విద్వేషణం- ఈ క్రియ ద్వారా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టొచ్చు. Example- అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్య వైరం పెరగడం.
5.ఉచ్చాటనం- అంటే వెల్లగొట్టడం, తరమడం. గ్రహ దోషాలు, సకల దోషాలు లేదా శత్రువులను పూర్తిగా మన నుండి దూరం చేయచ్చు.
6. మారణం- అంటే చంపడం. శత్రువును చంపడం.
విషయ పరిజ్ఞానం కోసమే ఇవి చెప్పడం జరిగింది. వశ్యం మరియు ఆకర్షణ మాత్రమే మనం చేయాలి. మిగిలినవి స్తంభనం, విద్వేషణం, ఉచ్చాటనం, మారణం చేస్తే ముందు అవి మనకు తగిలి మనం నాశనం అవుతాం. ఇవి మర్చిపోవాలి. ఉత్తమ సాధకుడు పరుల మేలు కోరి ప్రవర్తించాలి.
అయితే ఈ 6 కర్మలు/క్రియలు ఉప దేవతల సిద్ధి ద్వారా చేయలేము కేవలం అగ్ర దేవతల సిద్ధి పొందితేనే ఈ 6 క్రియలు సాధ్యము.
ఉదాహరణకు గణపతి, నరసింహ స్వామి, శివుడు, విష్ణువు, దుర్గ .. వీరిలో ఎవరి ఉపాసన చేస్తే ఆ దేవత సిద్ధి పొందితేనే చేయొచ్చు. అంటే ఉపాసన దేవత మంత్రం సిద్దిస్తే అదే మంత్రంతో ఈ 6 కర్మల ప్రయోగాలు చేయవచ్చు.
No comments:
Post a Comment