హోలీ పండుగ - తీసుకోవలసిన జాగ్రత్తలు
1) హోలీ ఆడడానికి సహజ రంగులు , హెర్బల్ కలర్స్ మాత్రమే ఎంచుకోవాలి.
2) కెమికల్ కలర్స్ చర్మానికి , కంటికి హాని చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది.
3) హోలీ ఆడే ముందు కొబ్బరి నూనె శరీరానికి , తలకు రాసుకోవాలి. దీనివల్ల కలర్స్ శరీరం లోపలికి పోకుండా జాగ్రత్త పడవచ్చు.
4) హోలీ ఆడే చేతులతో ఎలాంటి ఆహార పదార్ధాలు తినకూడదు.
5) రంగులు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే కంటి చూపు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.
6) చర్మ సంబందిత వ్యాధులు , ఎలర్జీ ఉన్నవారు హోలీ ఆడకపోవడమే మంచిది.
7) హోలీ ఆడాక ఎలాంటి దురదలు , ఎలర్జీ వచ్చినా ఆలస్యం చేయకుండా దగ్గరలో డాక్టర్ ని సంప్రదించండి.
8) హోలీ ఆడిన తర్వాత , శుభ్రంగా తల స్నానం చేసి , పుదినా ఆకులు కాని, తులసి ఆకులను కాని నీటిలో మరిగించి , గోరువెచ్చగా తీసుకోండి.
9) ఇలా తులసి లేదా పుదినా కాషాయం తీసుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీ , జలుబు , గొంతు నొప్పి నుండి కాపాడుకోవచ్చు.
10) కాబట్టి హోలీ కి సహజ రంగులను వాడండి ! ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
మన ఆరోగ్యం - మనచేతుల్లో
ఈ సందేశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి !
No comments:
Post a Comment