Friday, March 11, 2022

సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము..

 సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.. 



నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతను ఇస్తాయి. అయితే..  "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధన కు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదం... అది అలా ఉండగా, సోమవారం " సౌమ్య ప్రదోషం" గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం. 


సోమవారము నాడు  ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తి చేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరాధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు.. ఇది ఐశ్వర్యకరం, సర్వాభీష్ఠప్రదం..! స్కందాది పురాణాలలో సోమవార వ్రతం గురించి విశేషముగ చెప్పారు.. పై నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమే కాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి. ప్రత్యేకించి ఈ సోమవారాలు శ్రావణ మాసం లోనూ, కార్తీకం లోను మరీ విశేషం...


 నభోవాస ఇందువాసరే - శ్రావణ మాస సోమవారాలలో ఈశ్వరారాధన మహైశ్వర్య ప్రదం.. ఆ సాయంకాలార్చనలో, స్వామిని బిల్వాలతో అర్చన చెయ్యడం సంతృప్తిదాయకం..


ఇందువాసరే వ్రతంస్థిత్వా

నిరాహారో మహేశ్వరౌ

నక్తం హౌష్యామి......అని శాస్త్ర వచనం.


లక్ష్మి ప్రదమైనది ఇందువాసరం. (సోమవారం) 

పార్వతి సహిత పరమేశ్వరున్ని ఆర్ధించాలి.

"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివ పరమైన అర్ధము చెప్పవచ్చు..


 రామాద్యవతారాలలో శ్రి మహావిష్ణువు కూడా సదా శివుని అర్చించి, మనకు కారణ మార్గం ఉపదేశించారు.. శ్రీ రాముడు అగస్త్య మహర్షి ద్వారా " విరజా దీక్ష" ను స్వీకరించి, భస్మోద్ధుళి తాంగుడై శివ ధ్యానంలో గడిపాడని "పద్మ పురాణం" చెప్తోంది. అతడి దీక్షకు ఫలితముగ, సదాశివుడు పార్వతి సహితుడై సాక్షాత్కరించి, దేవసభా మధ్యంలో శ్రీ రామునకు సందర్శన ఆనందాన్నిచ్చాడు. 

శివుని సహస్ర నామాలతో సంస్తుతించి, ప్రసన్నుని చేసుకున్నాక తిరిగి, ఏకాంతnదర్శనమిచ్చి రామునకు శివుడు చెప్పిన విషియాలే "శివ గీత" గా ప్రసిద్ధమయ్యాయి.


శ్రీ కృష్ణుడు కూడా ఉపమన్యు మహర్షి వలన శివ దీక్షను పొంది, శివారాధన చేసినట్లు, శివ ధర్మాలను అర్జున ధర్మరాజాదులకు ఉపదేశించినట్లు " మహాభారతం " చెప్తోంది..


శివస్య హృదయం విష్ణుః

విష్ణోశ్చ హృదయం శివః 


శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. శివుడు రామ కృష్ణాది విష్ణు నామ జపం లో ఆనందితుడవుతుంటే, విష్ణువు శివార్చనలో ఆనందిస్తాడు... శివుడు పరమ వైష్ణవుడు. విష్ణువు పరమ శివుడు.....


హరహర మహాదేవ శంభోశంకర


జై శ్రీరామ్ జై హనుమాన్

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS