Thursday, March 17, 2022

శ్వేతార్క ఆంజనేయస్వామి

 శ్వేతార్క ఆంజనేయస్వామి 



శ్వేతార్క హనుమాన్ ' తెల్లజిల్లేడు ' వేరుతో తయారుచేస్తారు . జన్మ లగ్నము నుండి ' అష్టమం'లో చంద్రుడు వున్నను , కుజుడు ' సప్తమం'లో వున్నను , రాహువు ‘ నవమం'లో వున్నను , శనిభగవానుడు జన్మరాశిలో వున్నను , గురువు ' తృతీయం'లో వున్నను , రవి ' పంచమం'లో వున్నాను . | కేతువు ' వ్యయం'లో వున్నను బాలారిష్టములుగా చెబుతారు . 


పరాశరుల సిద్ధాంతం ప్రకారం మరియు ఇతర గ్రంథకర్తల 

వ్యాసముల ఆధారంగా 12 వ సంవత్సరం వరకు ఈ బాలారిష్టములు ఉంటాయి . అంతేకాకుండా పితృ , మాతృ , పూర్వజన్మల ఫలితంగానే ఈ బాలారిష్టములు కలుగుతాయి .

 తెల్లజిల్లేడు మొక్క వేరు మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయస్వామిని రూపొందిస్తారు . శ్వేతార్క ఆంజనేయస్వామిని చెక్కేవారు ఆ " మయంలో నియమనిష్ఠలతో ఉండాలి . స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి . బ్రహ్మచర్యం పాటించాలి . శ్వేతార్క ఆంజనేయస్వామిని మంగళవారం లేదా శనివారంనాడు ప్రార్థించవచ్చు .


 దుష్టశక్తుల పీడ నుండి , గ్రహాల దుస్థితి నుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయస్వామి . అంతేకాదు , బాలారిష్ట దోషాలను తొలగిస్తాడు . శ్వేతార్క ఆంజనేయస్వామిని భక్తిపూర్వకంగా ప్రార్థించాలి . జపమాల చేత ధరించి “ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ " *అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి 

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS