Thursday, March 17, 2022

అశ్వత్ధ(రావి)వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు.

 అశ్వత్ధ(రావి)వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు.



 ’అశ్వత్ధమే నారాయణస్వరూపము’ అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.

ఆ వృక్షం యొక్క :-

మూలము        –  బ్రహ్మ

మధ్య భాగమే   –  విష్ణువు

చివరి భాగము  –  శివుడు


 కనుక ఈ వృక్షాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.


 అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.


 అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కారము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే.అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.


 ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి (శనివారం మాత్రమే తాకాలి) అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి.


 అశ్వత్ధవృక్ష స్తోత్రం :-

మూలతో బ్రహ్మరూపాయ

మధ్యతో విష్ణురూపిణే

అగ్రత శ్శివరూపాయ

వృక్షరాజయతే నమః


 అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు.


 గురు,శుక్ర మౌడ్యాలలో ప్రదక్షిణ చేయరాదు.


 కృష్ణపక్షం లో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ మొదలు పెట్టకూడదు.


 ఆది,సోమ, శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.


 మౌనంగా కానీ, ఇలువేలుపుని స్మరిస్తూ కానీ, విష్ణుసహస్ర నామస్తోత్రాన్ని చదువుతూ  గానీ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. 


   ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కరించాలి.


 అశ్వత్ధ వృక్షానికి ఇతోధికంగా ప్రదక్షిణలు చేయడంవల్ల సకల పాపాలూ నశించి అభీష్ట సిధ్ధి కలుగుతుంది.


 బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.


 శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది.


 అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించితే శనిదోషం తొలగిపోతుంది.


 అశ్వత్ధ వృక్షం క్రింద

పఠించవలసిన శనైశ్చర స్తోత్రం :-


 కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః


 అశ్వత్ధ వృక్షం క్రింద చేసిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్నిఇస్తుంది.


 స్థిరబుద్ధిలేనివారు, శనిదోషంతో పీడించబడేవారు ఈ రావిచెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షణ చేస్తే సర్వదా శుభం కలుగుతుంది.


 శ్రీకృష్ణుని చివరి దశలో ఈ రావి వృక్షం క్రిందే ప్రాణ త్యాగం చేశారు.


 అంతటి విశిష్టత కలిగిన ఈ చెట్టును ఆరాధించడం వల్ల అంతామంచే జరుగుతుంది.


 వేపచెట్టు కూడా శక్తి స్వరూపమే.కుటుంబ సౌఖ్యం లేనివారు ఈ వేపచెట్టు చుట్టూ 19 సార్లు ప్రదక్షణ చేస్తే ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి.


 సర్ప దోషాలతో బాధపడేవారు రావి, వేపచెట్టుకు ప్రదక్షణ చేస్తే ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS