Thursday, March 17, 2022

షట్ తిల ఏకాదశి - ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట.

 షట్ తిల ఏకాదశి - ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట.


షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ ఆరు తిల విధుల ఏమిటంటే..షట్తిల మంటే...

1,తిల  స్నానము,  

2,తిల దీపము,-(నువ్వులనూనె ఒంటికి రాసుకోవడం) 

3,తిలహోమము,  

4,తిలతర్పణము, 

5,తిల భక్షణము, 

6,తిల దానము... 


మకర సంక్రాంతి లో షట్తిల విశేషము... అలాగే ఆ(మకర మాసంలో) పక్షములో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అని వ్యవహరిస్తారు...



తిలస్నాయీ

తిలోద్వర్తీ

తిలహోమీ

తీలోదకీ

తిలభుక్

తిలదాతా చ

షట్ తిలాః పాపనాశనాః.


1) తిలాస్నానం-నువ్వుల నూనె వంటికి రాసుకుని, నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.


2) తిల లేపనం - స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం.


3) తిల హోమం- ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.


4) తిలోదకాలు - పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట, నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.


5) తిలదానం: నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.


6) తిలాన్నభోజనం - నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది.


ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు.


ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు.


సూచన: షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము, దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుప వలసి ఉంటుంది

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS