Tuesday, April 21, 2020

పంచ ముఖ హనుమన్ శ్లొకం

పంచ ముఖ హనుమన్ శ్లొకం

శతృబాధలు, పిశాచ భయాలు, రోగ నివారణ కొరకు ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా అత్యంత సునాయాసంగా తీర్చగల  పంచ ముఖ హనుమన్ శ్లొకం మహా మహిమాన్విత    శ్లొకం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం 
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం 
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం 

భావం:-

 వానర ,నారసింహ ,గరుడ ,వరాహం, అశ్వ (హయగ్రీవ) అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో, దివ్య కాంతితో, దేదీప్యమానమైన 15 నేత్రాలు (ఒక్కో ముఖానికి 3 కన్నులు), పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, ఢాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం, నాగలి, మంచంకోడు(ఖట్వాంగం), మణులు, పాము, చెట్టు 10 హస్తములతో ధరించిన వాడు, పసుపు వన్నె కలవాడు, గర్వాన్ని హరించే వాడైన హనుమంతునికి నమస్కారం.🙏🙏🙏🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS