Thursday, April 16, 2020

శివుని సోమ‌వార‌మే అర్చించాలా


శివుని సోమ‌వార‌మే అర్చించాలా
*శివున్ని పూజించేభ‌క్తులంతాసోమ‌వారం రోజున ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం స‌హ‌జం.
ఆ రోజునే ఉప‌వాసం ఉంటారు! చాలామంది.ఎందుక‌ని..? అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం.

చంద్రుని ధరించినవాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు 
అని పిలుస్తారు. చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివునిఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు. సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా..! 
ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున 
శివుడుఉమాసహితుడైభక్తులనుఅనుగ్రహిస్తాడు.. 
🌺💠🌺💠🌺💠🌺💠🌺💠🌺💠🌺💠

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS