Wednesday, April 15, 2020

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు -

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు  -
     కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.
రహస్య సూక్తులు  -
* రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
* ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
* మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
* నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
* పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
* గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
* శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
* అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
* కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
* ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
* మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
* ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
* మినుములు అతిగా వాడరాదు.
* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
* చవిటి ఉప్పు మంచిది కాదు.
* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
* మలమూత్ర వేగములను ఆపరాదు .
* ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
* హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS