Wednesday, April 15, 2020

అమ్మవారి పాదాలను వర్ణిస్తూ అత్యద్భుతమైన శ్లోకాన్ని అందిస్తున్నారు

అమ్మవారి పాదాలను వర్ణిస్తూ అత్యద్భుతమైన శ్లోకాన్ని అందిస్తున్నారు మూకకవి. ఇది మంత్రస్వరూపమైన శ్లోకంగా భావించి పారాయణ చేసుకున్నట్లయితే అన్ని గ్రహదోషాలూ పోతాయి. అంతశక్తివంతమైన శ్లోకం ఇది. పాదారవింద శతకంలో  59వ శ్లోకం నిత్యపారాయణ యోగ్యమైనది.
దధానో భాస్వత్తామమృతనిలయో లోహితవపుః
వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ ।
గతౌ మన్దో గఙ్గాధరమహిషి కామాక్షి భజతాం
తమఃకేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే ॥ ౫౯॥(పాదారవిందశతకం)
అమ్మ పాదాలను ఆశ్రయిస్తే గ్రహాలన్నీ మనకు అనుకూలం అయిపోతాయి. కనుక ఫలానా గ్రహాలు బాగుడకపోవడం వల్ల ఇలాంటి దుస్థితులు, రుగ్మతలు ఏర్పడుతున్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఏ గ్రహమూ ఏమీ చేయలేదని ఈ శ్లోకం ద్వారా గ్రహించి ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. 

కదా దూరీకర్తుం కటుదురితకాకోలజనితం
మహాంతం సంతాపం మదనపరిపంధి ప్రియతమే
క్షణా త్తే కామాక్షి! త్రిభువనపరీతాపహరణే 
పటీయాంసం లప్స్యే పదకమలసేవామృతరసమ్!!22!!(పాదారవిందశతకం)

సమూహ పాపాల వల్ల సమూహ దుఃఖాలు, వ్యక్తి పాపాల వల్ల వ్యక్తి దుఃఖాలు కలుగుతాయి. వాటిని పోగొట్టే శక్తి అమ్మవారి పాదాలకు ఉన్నది. 
జగన్మాత అనే ఔషధాన్ని మన మనస్సు నిండా నింపుకుంటే ఆధి వ్యాధి అన్నీ తొలగిపోతాయి. 

సమస్తవిశ్వాన్ని రక్షించగలిగే శక్తి ఆ జగన్మాతకు మాత్రమే ఉంది. అందుకే అంతుపట్టనటువంటి వేదన వల్ల ప్రపంచం అంతా బాధపడుతుంటే ప్రపంచాన్ని రక్షించమని అమ్మని స్తుతిస్తూ స్తుతిశతకంలోని రెండవ శ్లోకం. 
తాపించ స్తబకత్విషే తనుభృతాం దారిద్ర్యముద్రాద్విషే
సంసారాఖ్యతమోముషే పురరిపోర్వామాంకసీమాజుషే 
కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే
విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరంజ్యోతిషే!!02!!(స్తుతిశతకం)

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS