Wednesday, April 15, 2020

ఇలలో వెలసిన స్వర్గ ధామము – షిరిడీ క్షేత్రము

ఇలలో వెలసిన స్వర్గ ధామము – షిరిడీ క్షేత్రము

ఆంగ్ల రచన: విన్నీ చిట్లూరి, షిర్డీ 

తెలుగు అనువాదం: చాగంటి సాయిబాబా, కార్యనిర్వాహక సంపాదకులు, సాయి పరివార్ తెలుగు మాస పత్రిక

మధురా, బృందావనాల వలె షిరిడీ పురాతనమైన పుణ్య క్షేత్రం కాదనీ, కేవలం మనోజ్ కుమార్ నిర్మించిన హిందీ చిత్రం షిర్డీ కే సాయిబాబా తర్వాత మాత్రమే షిర్డీ ఇటీవలనే ప్రసిద్ధమైనదని చాలా మంది భక్తులు భావించుకుంటూ వుంటారు. కానీ షిర్డీ యుగాల నుండీ ఉనికి ని కలిగి వుంది.

గోదావరి నది పరివాహక ప్రాంతాలు మహారాష్ట్రలోని ఎందరో సంతు మహాత్ములకు ఆశ్రయం కల్పించింది.

ఉత్తరాది వారికి గంగా నది ఏ విధంగా పవిత్రమైనదో అదే విధం గా గోదావరి నది దక్షిణాది వారికి పవిత్రమైనది కావడం వలన గోదావరి నదిని దక్షిణ గంగ అని పిలుచుకుంటారు. చరిత్ర గోదావరి విషయంలో చెప్పేదేమిటంటే త్రియంబకేశ్వర్ పై వున్నా బ్రహ్మగిరి పర్వతం పై ఒక సారి మహా శివుడు తన జటాజూటం నుండి జుట్టు కుచ్చును నెల మీదకు విసిరి వేసారట. అప్పుడే ఆ విసిరివేయబడిన జుట్టు కుచ్చులనుండి ఈ జీవధార అయిన గోదావరి ప్రవహించిందని చెప్తారు. గో అంటే భూమి అనీ, దా అంటే జీవనాధారమని పరమాద్భుతమైన అర్ధమేర్పడింది. ఈ విధంగా గోదావరి భూమాతని అతిశయం లేకండా భరించే నది, ఆ నదీ పరివాహక ప్రాంతాలలో నివశించే జనులకి సంపదనూ మరియూ అభివృద్దినీ అందిస్తుంది.

ఈ గోదావరి పవిత్ర నదీ తీరాలలో ఎందరో సంతు మహాత్ములు ఆశ్రయం ఏర్పర్చుకుని చాలా కాలం నివశించే వారు. బ్రహ్మ గిరి వద్ద ఈ నదికి ప్రదక్షిణ చేస్తుండగా ఘనీ నాధుల వారిని నివృత్తి నాధుల వారు కలవడం జరిగింది. అప్పుడు నివృత్తి నాధుల వారు నాధ లేదా భక్తీ సంప్రదాయాన్ని ప్రచారం చేయవలసిందిగా ఘనీ నాధుల వారిని ఆదేశించారు. ఘనీ నాధుల వారు ఆ కార్యాన్ని జ్ఞానేశ్వరుల వారి భుజ స్కందాల మీద మోపారు. ఈ విధంగా నాధ సంప్రదాయం వ్యాపించింది, ముఖ్యంగా మహారాష్ట్ర లో బాగా వ్యాపించింది. నాధ లేదా భక్తీ సంప్రదాయాలలో ప్రవేశించిన ఈ మహానుభావులందరూ లెక్కలేనన్ని అభంగాలను, భజనల నూ రచించే వారు, గానం చేసేవారు. ఈ విధంగా వార్కరీ (పాదయాత్రికులు) సంప్రదాయం అభివృద్ధి చెందింది.

ఈ సమయంలోనే దేశం లో భ్రిటీషు వాళ్ళు ప్రవేశించడంతో ప్రజలందరూ పాశ్చ్యాత్య సంప్రదాయాలకి అలవాటు పడసాగారు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో శిలదీ లో బాబా అవతరించారు. గోదావరి నదికి ఎనిమిది మైళ్ళ దూరంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో రహతా తాలూకా లో వున్నా శీలది అప్పటిలో దూరాన వున్నా ఎంతో చిన్న గ్రామము.

శతాబ్దాల క్రితము ఈ చిన్న గ్రామమైన శీలధి కాలానుగుణంగా శిల్ధీ, శరధి మరియూ ఇప్పుడు షిర్దీగా పిలవ బడుతోంది. 

శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్రలో ఈ గ్రామం దిశిలా నగర్ మరియూ శిలది అని పిలవ బడింది. ఈ కావ్యం 1320 వ సంవత్సరంలో శంకర భట్టు వ్రాసారు. శిలదీ గా పిలవబడినా లేదా దిశిలా నగర్ గా పిలవ బడినా ‘శిల’ మరియూ ‘ధీ’ అన్న పదాలు అలాగే నిలిచి వున్నాయి. ఈ రెండు పదాలను విశ్లేషించుకుంటే విశేషార్దాలు గోచరిస్తాయి. ‘శిల’ అంటే పర్వతము లేదా పర్వత గుణాలను కలిగిన వారు అని అర్ధము. శాంతి, సహనమూ, శక్తీ మరియూ ధర్మ మార్గమూ పర్వత లక్షణాలు. ఈ రోజులలో పర్వతాలు ఇలకీ మరియూ స్వర్గానికీ వున్న బంధాన్నీ, వివేకాన్నీ, స్థిరత్వాన్నీ, మరియూ నెమ్మదిగా, కఠినంగా వుండే ఆధ్యాత్మిక అప్రమత్తతవైపు అభివృద్దిని తెలిపే గుర్తుగా భావించబడుతున్నాయి. ‘ధీ’ అంటే జ్ఞానము మరియూ తెలివీ అని అర్ధం. ఈ విధంగా వేలాది భక్తుల ఆరాజకత్వమూ మరియూ అరుపుల నడుమ శాంతి, సౌభ్రాతృత్వం, మరియూ మరెంతగానో ఆధ్యాత్మిక శక్తిల మేలు కలయిక అయిన ఇంద్ర ధనుస్సు వలె నిలిచిన గ్రామము శిలధి. గంగాగిర్ మహారాజ్, దేవీ దాస్ మరియూ అసంఖ్యాకమైన యోగి పుంగవులూ, సంతు మహాత్ములూ శిలదీ వచ్చి నివసించేవారు.

(1950 ప్రాంతాలలో లెక్కలేనన్ని పీరుల, గోసావి ల మరియూ సంతు ల సమాధులు అబ్దుల్ బాబా దర్గా ఎదురుగా షిర్డీ లో ఉండేవి, దురదృష్ట వశాత్తూ వారి వారి – సమాధి ఎవరిదన్నది – గుర్తించలేదు. సంస్థాన్ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సమాధులన్నీ తొలగించ బడ్డాయి).

ఏమైనా కానీ షిర్డీ ఈ విశ్వం అవతరించినప్పటి నుండీ వుంది. అంటే సముద్ర మంధనం జరిగినప్పటి నుండీ షిరిడీ వుంది. ‘ఇది మన ద్వారకామాయి. ఈ తల్లి తన పిల్లలకి సంపూర్ణమైన రక్షణ కలిగిస్తుంది. ఆ తల్లి ఒడిలో ఒకసారి కూర్చుని వుంటే మన కష్టాలన్నీ తొలగి పోతాయి. అంతటి దయామయి ఈ ద్వారకా మాయి’ అని బాబా చితలీ కి పోతున్న బాలా సాహెబ్ మిరీకర్ తో శ్రీ సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయంలో అన్నారు. 

బాబా పలుకులు నిత్య సత్యాలు. అయితే ఈ మసీదుని ద్వారకా మాయి అని ఎందుకన్నారు? భౌగోళికంగానూ, చరిత్రాత్మకంగానూ మరియూ పౌరాణికంగానూ ద్వారకను మనం షిర్డీ లో చేర్చోకోవచ్చు. బీ. వీ. దేవ్ ఈ విషయం మీద అన్ని కోణాలనుండి పరిశోధించి ఆ పత్రాన్ని సాయి లీల పత్రిక లో ప్రచురించారు. అందులోని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించుకుందాము.

1. క్షీరసాగర మధనము:

సాగర మంధన సమయంలో ఎవరైతే హాలాహలాన్ని త్రాగుతారో వారు అమృతాన్ని కూడా తీసికోనవచ్చని దేవతలూ మరియూ రాక్షసుల నడుమ ఒక అంగీకారం కుదిరింది. మహాశివుడు హాలా హలాన్ని స్వీకరించి తన కంఠం దగ్గర నిక్షిప్తం చేసారు. అందుకే ఆయనకు శ్రీ నీల కంఠేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇది జరిగిన ప్రదేశానికి ఘట్ సిరస్ అని పేరు. ఈ ఘట్ సిరస్ షిరిడీ కి ఆగ్నేయంగా తొంభై కిలోమీటర్ల దూరంలో పతార్ది తాలూకా లో వుంది, ఇక్కడి మందిరం పేరు రుద్రేశ్వర్. ఇక్కడి శివలింగము స్వయంభు లింగము. ఈ లింగపు ప్రత్యేకత ఏమిటంటే ఈ లింగము సమానంగా వుండదు. మెరక పల్లాలు కలిగి వుంటుంది. హాలాహలాన్ని తిన్నట్లుగా కనబడుతూ వుంటుంది.

హాలాహలం తరువాత అమృతము వచ్చింది, అందులో దేవతలు పాల్గొన్నారు. చంద్రుడూ మరియూ సూర్యుడూ రాహువు దొంగతనంగా దేవతలా వైపు వుంది అమృతాన్ని స్వీకరించినట్లుగా తెలిసికున్నారు. వెంటనే జరిగిన మోసాన్ని మహా విష్ణువు కి తెలియజేసారు. విష్ణువు అందమైన మోహినీ రూపం లో వచ్చి రాహువుని మిరుమిట్లు అయ్యేలా చేసారు. తన స్వర్ణ చక్రంతో విష్ణువు రాహువు తలని నరికారు. రాహువు తల నరికిన ప్రదేశం షిరిడీ కి నలుభై అయిదు మైళ్ళ దూరంలో వున్నా రాహురి. (ఇక్కడ ఈ గుడి వున్నట్లు గా చెప్పబడుతోంది). ఈ సంఘటన జరిగిన ప్రదేశం పేరు నేవాస, మోహినీ రాజ్యంలో వున్నా నేవాస లో అర్ధనారీశ్వర మందిరం వుంది. ఈ నేవాస షిరిడీ కి ఆగ్నేయంగా నూట పది మైళ్ళ దూరం లో వుంది, కేతువు తల రాహురి కి అరవై మైళ్ళ వాయువ్యాన వున్న రతన్ గడ్ లో పడింది. కేతువు నోటిలోనుండి పడిన అమృతము పవిత్రమైన ప్రవర నదిగా రూపొందింది. మౌలికంగా ఈ నదిని అమృత వాహిని అని పిలిచేవారు.

పద్నాలుగు రత్నాలలో మహాశివుడు హాలాహలాన్ని, అమ్రుతాన్నీ మరియూ చంద్రుడ్నీ తీసికున్నారు, చంద్రుని ప్రదేశం చంద్ గాన్ అని అంటారు. షిరిడీ కి నూట ముప్పయి మైళ్ళ దూరంలో వున్నా చాంద్ గాన్ లో చంద్రేశ్వర్ ఆలయముంది. కృష్ణ భగవానుడు లక్ష్మి ని, కౌస్తుభాన్ని, శంఖాన్ని మరియూ ధనుస్సు నీ తీసికున్నారు. ఇంద్రుడు ఐరావతాన్ని, కామధేనుని, రంభనీ మరియూ ధన్వంతరినీ (అంటే అశ్వనీ కుమారుడనీ) శిరిడీకి ఇరవై అయిదు మైళ్ళ దూరంలో వున్నా బేలాపూర్ లో వున్నా విల్వేశ్వర్ ఆలయంలో తీసికున్నారు. అశ్వనీ కుమారుని ప్రదేశం శిరిడీకి ఇరవై అయిదు మైళ్ళ దూరంలో వున్నా అశ్వి. మహాశివుడు షిరిడీ కి నలుభై అయిదు మైళ్ళ దూరంలో వున్నా ఖోల్లర్ లో సప్త శిరస్సుల అశ్వాన్ని తీసికున్నారు.

2. యాదవ సామ్రాజ్యము:

12 మరియూ 13 శతాబ్ది లలో ప్రస్తుత మహారాష్ట్ర ని కృష్ణ సామ్రాజ్యమైన యాదవుల పరిపాలనలో వుండేది. జ్ఞానేశ్వరి లో ప్రస్తావించ బడిన ఔరంగాబాద్ దగ్గరలో వున్న దేవగద్ కోట యాదవ సామ్రాజ్యపు రాజధానిగా వుండేది. కృష్ణ భగవానుని ధర్మపత్ని రుక్మిణి అమరావతి జిల్లా లోని కుండిపూర్ లో జన్మించింది. అమరావతి జిల్లా నాగపూర్ దగ్గరలో వుంది. రుక్మిణి తండ్రి భీష్మకుడు దేవగద్ కోటని రాజధాని గా చేసికుని పాలన సాగించేవాడు.

3. పంధర్ పూర్:

షిరిడీ కి నాలుగు వందల ఏభై మైళ్ళ దూరంలో వున్నా పండరీ పురం షోలాపూర్ జిల్లాలో వుంది. ఇది ద్వారక యొక్క దక్షణ భాగము. పుండలీకుని కదా ఈ దిగువ విధంగా వుంటుంది. ఒకసారి రుక్మిణి ఆగ్రహంతో కృష్ణుడ్ని వదిలి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఆమెని నెమ్మదింప జేసేందుకు ఆమె వెనుకనే వెళ్ళారు, దిండివన అడవులలో చివరికి ఆమెను కనుగొని, ఆమె ఆగ్రహాన్ని తొలగించారాయన. తిరిగి వస్తుండగా దారిలో పుండలీకుడు తన తల్లిదండ్రులకి చేస్తున్న తీవ్రమైన సేవ ని చూసాడు. పుండలీకుడు కృష్ణ భగవానుని వైపు కి ఒక ఇటిక ని విసిరి, తన తల్లి దండ్రులకి తను చేస్తున్న సేవ ముగిసే వరకూ కృష్ణ భగవానుని ఆ ఇటిక పై వేచివుండమని చెప్పాడు. భగవానుడు ఆ ఇటుకపై నిలబడ్డాడు. వేచిచూడ సాగాడు. నడుముపై చేతులు వేసుకుని చలనరహితంగా ఉండిపోయిన తన చేతులను చూసి ఆశ్చర్య పోయాడు.

4. గోపాల కళ:

కృష్ణ భగవానుడు తన చిన్న తనంలో గోపాల కళ ఆడు కునేవాడు. గోపికలు ఉట్టేలలో దాచుకున్న పెరుగునూ, వెన్ననూ వాటిని పగులగొట్టి తినేసే వాడు. బాబా ఆహారాన్నంతా కోలంబాలో వేసి కలిపి, అక్కడున్న భక్తులందరికీ పెట్టేవారు. సంస్థాన్ అన్ని పండుగల ముగింపు లోనూ గోపాల కళ ఉత్సవాన్ని ఇప్పటికీ జరుపుతూ వుంటుంది. 

5. మన ద్వారకా మాయి

స్కంద పురాణంలో ద్వారక అంటే కుల, మాట, వర్ణ రహితంగా అన్ని వర్గాల వారికీ ద్వారాలను తెరచి వుంచి ధర్మ అర్ధ కర్మ మరియూ మోక్షాలను కలిగించేదని నిర్వచించ బడింది. బాబా మసీదు ద్వారకా మాయి కూడా అన్ని వర్గాల వారికీ ఎప్పుడూ తెరచే వుంటుంది.

షిర్డీ కున్న పవిత్రత చేత సాయిబాబా తన లక్ష్య సాధనకు షిర్డీ ని ఎన్నోకోవడం ఆశ్చర్యం కలిగించాడు.





పై వ్యాసం డిల్లీ లోని సిరి ఫోర్ట్ ఆడిటోరియం లో జరిగిన సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సమావేశం 1.11.2017 న జరిగిన సందర్భంగా ప్రచురించబడిన అందమైన జ్ఞాపిక సంచిక కోసం విన్నీ చిట్లూరి రచించి ఇచ్చినది. తెలుగు అనువాదం: చాగంటి సాయి బాబా, కార్యనిర్వాహక సంపాదకుడు, సాయి పరివార్, తెలుగు మాస పత్రిక.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS