అన్నంగురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు
1. #ఆకలిగొన్నవాడికి ' దేవుడు ' కనపడేది అన్నం రూపంలోనే ! 🙏
( మహాత్మా గాంధీ ) .
2. " #నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !
( జంధ్యాలగారు ) .
3. #మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !
( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .
4.. #రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! #వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! #అదే విధి !
( రేలంగి వెంకట్రామయ్య గారు ) .
5. #ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !
( #ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .
6. #ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు
" #అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
#అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు #పెద్దయితేనేగానీ
#అర్ధం కాలేదు !
( #ఆత్రేయ గారు )
7. #అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
#అమ్మ చేతి అన్నం తింటున్నాను అని #చెప్పగలిగినవాడు ధన్యుడు ! 🙏🙏🙏
( చాగంటి కోటే శ్వర రావుగారు ) .
8. #ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!
( #గౌతమ బుద్దుడు ).
9 #ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) .
10. #మీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది #వాళ్ళ గొప్పాకాదూ , #మీ గొప్పాకాదు
#మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి.. 🙏🙏
#ఎంతటి మంచి వాక్యాలు...పెద్ద మనషుల #బాటలోనే మనం పయనిద్దాం...🙏🌷🙏
🙏#ఎందరో మహానుభావులు కి అందరికి #వందనములు 🙏🙏
No comments:
Post a Comment