Wednesday, April 15, 2020

హస్తం ( తుండం ) కలది హస్తి అంటే ఏనుగు తలనే తన తలగా కలవాడని పై అర్థం

హస్తం ( తుండం ) కలది హస్తి
అంటే  ఏనుగు తలనే తన తలగా
కలవాడని  పై అర్థం 

కానీ …… లో  అర్థం  అది కాదు 
వినాయకుడు  పుట్టింది హస్తాననక్షత్రంలో
అ. విశేషాన్ని గుర్తుంచుకునేందుకు ఆయన్ని
హస్తిముఖుణ్ణి చేశారు     కాబట్టి
ఆ. హస్తి ముఖాన్ని  (  ఏనుగు తల. )
చూస్తూనే  ఈయన హస్తలో
పుట్టాడన్నమాట. ! అనుకోవాలి 
హస్తానక్షత్రం 
వారి రాశి కన్య అవుతుంది
కన్య అంటే వివాహం కానిదని  అర్థం
కాబట్టే ఈయనకు పెళ్ళి కాలేదని చెప్పారు
ప్రతి రాశికీ అధిపతి అంటూ ఒకరుంటారు
ఈ కన్యరాశికి అధిపతి  నవగ్రహాలలో
ఒకడైన. బుధుడు  అంటే పండితుడని అర్థం
కాబట్టే  మహాపాండిత్యం కావాలంటే
వినాయకోపాసన చేయాలంటారు పెద్దలు
ఇంతటి మహాపండితుడు కాబట్టే
విద్యలకెల్ల ఒజ్జవైయుండేడి
పార్వతీ తనయ. !" అని ప్రార్థిస్తాం  •••
ఈ అధిపతి అయిన బుధుడు
ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టే  ఈ గణపతికి
పచ్చని పత్రాలతో పూజ చేయిస్తారు
అందుచేత. పత్రితో పూజచేస్తూ  ఈయన
బుధగ్రహానికి సంబంధించిన కన్యరాశి
వాడు సుమా  !"   అనుకోవాలన్నమాట
అంతేకాదు బధః పాప యుతః ...
అని  జ్యౌతిష్యంలోని  వాక్యం  •••••••
   ===  గణాధిపత్యయే నమః ===
    •••••  మీ  , రాజు  సానం  •••••

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS