Wednesday, April 15, 2020

సూర్యభగవానుడు " నమస్కార ప్రియుడు

మన  ధర్మంలో   మనం అన్నింటిలో, అంతటా భగవంతుని చూస్తాము!!
"ఆత్మవత్ సర్వ భూతాని"  నాలో నున్న 'ఆత్మజ్యోతి' అన్ని
జీవులలో చరాచర జగత్తులో కూడా వున్నది !
అదే పరమాత్మ ! అదే పరంజ్యోతి పర బ్రహ్మ స్వరూపం ! ఆత్మ చైతన్యం !!
అందుకే  చెట్టు, పుట్ట, రాయి, రప్ప లో కూడా ఆ భగవంతుని దర్శిస్తాడు ! ఇది తెలియక చేసే మూఢత్వం కాదు తెలిసి చేసే దివ్యత్వం !!
అంతటా వున్న భగవంతుడు నేను పూజించే   ఈ  'విగ్రహం, లో ఎందుకు వుండడు తప్పక వుంటాడు అని పరమ భక్తితో, పరమ విశ్వాసంతో చేసేదే !!ఉపాసన !!
మన ధర్మంలో అనేక ఉపాసనలున్నాయి !
అందులో  'సూర్యోపాసన' ముఖ్యమైనది !!
సూర్యుడు ప్రత్యక్ష దైవం ! ఈ జగత్తుకంతటికీ వెలుగును
వేడిమిని ప్రసాదించే  పరంజ్యోతి స్వరూపుడు !!
మన భౌతికమైన కనులతో చూడ గలిగే 'సూర్యనారాయణుడు' !  ఆరోగ్య ప్రధాత !
"ఆరోగ్యం భాస్కారాధిచ్ఛేత్ " అంటుంది శాస్త్రం !
సూర్యభగవానుడు " నమస్కార ప్రియుడు" !!
ప్రతి  రోజు  సూర్య  నమస్కారములను  చేయండి !!
ఆరోగ్యాన్ని పొందండి !!
                
సూర్యధ్యానం :-
*"ద్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ*
*నారాయణ సరసిజాసన సన్నివిష్టః !*
*కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటీ*
*హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః !!*
తాత్పర్యం :- సర్వాలంకార భూషితుడును, శంఖ,చక్ర, గదా
పద్మములను ధరించిన వాడును, పద్మాసన స్థితుడును,
హిరణ్మయ స్వరూపుడును, "సూర్యమండలాంతర్గతుడైన
శ్రీ సూర్య నారాయణుని " మేము  ఆరాధించుచున్నాము !!
సూర్యనమస్కార మంత్రములు :-
1 - *ఓం  మిత్రాయ  నమః*
2 - *ఓం  రవయే  నమః*
3 - *ఓం  సూర్యాయ  నమః*
4 - *ఓం  భానవే  నమః*
5 - *ఓం  ఖగాయ  నమః*
6 - *ఓం  పూష్ణే  నమః*
7 - *ఓం  హిరణ్యగర్భాయ నమః*
8 - *ఓం  మరీచయే  నమః*
9 - *ఓం  ఆధిత్యాయ  నమః*
10 - *ఓం  సవిత్రే  నమః*
11 - *ఓం  అర్కాయ నమః*
12 - *ఓం  భాస్కరాయ  నమః*
" *ఓం  శ్రీ  సవితృ  సూర్య  నారాయణాయ  నమః "*
*" ఆధిత్యస్య నమస్కారాన్  యే కుర్వంతి  దినే  దినే !*
*ఆయుః  ప్రజ్ఞా  బలం వీర్యం  తేజస్తేజాంచ జాయతే !!*
మనం ప్రతి రోజు సూర్య నమస్కారాలను చేద్దాము !!
మన ధర్మాన్ని  మనం  కాపాడుకుందాము !!
విశ్వశాంతి వర్ధిల్లును గాక !

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS