Thursday, April 16, 2020

నారాయణుడు ఉపదేశించిన సావిత్రి అష్టాక్షరి

నారాయణుడు ఉపదేశించిన సావిత్రి అష్టాక్షరి

🌺ఈ మంత్రం మొదట నరాయణుడి చే ఉపదేశం పొంది సాధన చేసిన వారి బ్రహ్మ దేవుడు. ఆమెను ఉపాసించి పొందిన అనుగ్రహము వల్ల సరస్వతి ని నాలుకపై నిలుపుకోగలిగారు..తర్వాత ఈ మంత్రాన్ని ఎందరో సాధన చేసి ఉన్నత స్థితికి చేరుకున్నారు. సాధకునికి విజయం వరిస్తుంది. మొదట బ్రహ్మ దేవుడు ఉపాసించడం వల్ల బ్రాహ్మణులకు ఇది సిద్ది మంత్రంగా మారింది ఒకపట్టికాలంలో ఈ సావిత్రి ఉపాసన 14 సం సాధన చేసే సిద్ధిపొంది సాక్షాత్తు దేవి స్వరూపం గా విరజిల్లే వారు .

అస్యశ్రీ సావిత్రి దివ్య నామ మహా మంత్రస్య , నారాయణ ఋషి:.. హ్రీం బీజం, సావిత్రి శక్తి:, 
శ్రీ జగదీశ్వరీ ప్రీత్యర్ధం..అనుగ్రహ సిధ్యర్థం.. శ్రీ సావిత్రి అష్టాక్షరి యధాశక్తి జపే వినియోగహ.

🌺సావిత్రి అష్టాక్షరి🌺

ఓం శ్రీం హ్రీం క్లీం సావిత్త్ర్య స్వాహా

యధా శక్తి ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు, అమ్మవారి ముఖ్యమైన ఐదు రూపాలలో సావిత్రి రూపం ఒకటి. ఈ మంత్ర జపం ఆయుష్షుని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది , ప్రాణ గండం తొలగి పోతుంది.. ఈ మంత్ర సిద్ది పొందిన వారికి ఏ కార్యం అయిన ఆటంకాలు లేకుండా విజయాన్ని పొందగలరు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది మంచి పరిహార మంత్రం. ప్రతి స్త్రీ సౌభాగ్యం  వంశవృద్ధి  కోరుకొని ఈ నామాన్ని జపిస్తూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. 

ఈ మంత్రానికి ఋషి నారాయణుడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణడు శ్రీ విద్యా ఉపసాకులు నారాయణుడు ఆచరించిన శ్రీ విద్య "హాదివిద్య" స్వయంగా నారాయణుడు ఎన్నో దేవి మంత్రాలను సంపుటికరణ చేశారు.. ఈ పవిత్రమైన సావిత్రి అష్టాక్షరి (అగ్ని పురాణ అతర్గతం).. భక్తి విశ్వాసలతో జపం చేసి అమ్మవారి కృపని పొందగలరు. ఆ నరాయణుడి ముందు ఈ మంత్రం రాసి ఉంచి స్వామిని గురువుగా భావించి ఈ మంత్రాన్ని జపించాలి. ఇది అమృత ఘడియలో చేస్తే విశేష ఫలితం ఉంటుంది, అలా కుదరక పోతే ఉదయం సాయంత్రం చేయవచ్చు. నిత్యం మనసులో జపించవచ్చు. తిరుగులేని విజయాన్ని అనుగ్రహించే మంత్రరాజం.🌺

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS