Tuesday, April 21, 2020

వేంకటేశ్వరస్వామి ఎందుకు ఆయుధాలు దరించకుండా మనకు దర్శనమిస్తాడు..!

వేంకటేశ్వరస్వామి ఎందుకు ఆయుధాలు దరించకుండా మనకు దర్శనమిస్తాడు..!

వేంకటాద్రి సమం స్థానం 
బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో 
న భూతో న భవిష్యతి.!!

సింహాద అనే దైత్యుడు మహాదుష్టుడు, 
బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ, గంధర్వ, యక్ష కిన్నెరా కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరం సంపాదిస్తాడు. 
దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దేవతల మోర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని శరణు వేడమని సలహా ఇస్తాడు.

తొండమానుడు వారికి అభయం అయితే ఇస్తాడు కానీ సింహాద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టమణి తొండమానునికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు. 
దేవతలతో పోరాటానికి సింహాద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్ధ స్థలంలో యుద్ధం చేసాడని పురాణం చెబుతోంది.

తొండమానుడు స్వామి వారి ఖడ్గం, గద, ధనస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక 100 సార్లు తల తెన్చినా మరల బ్రతికి వచ్చేవాడు. 
ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు. స్వామి వారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు. 
అలా సంహరించిన ఆయుధాలు మరల స్వామి వద్దకు వెళ్ళిపోతాయి. 
తొండమానుడు స్వామి వారి వద్దకు వచ్చి భక్తితో 
ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు.

స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు, 
అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా వుండాలి, 
స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు. 
వింత కోరిక. స్వామి వారు సరే అని చెప్పి, 
కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మిమ్పచేస్తాడని, అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు.

స్వామి వారి ఆయుధాలు ఒకొక్క తీర్ధంలో వసించడం మొదలుపెడతాయి. 
కపిలతీర్ధమే చక్రతీర్ధం, 
దానిపై వరుసగా శంఖ తీర్ధ, శాంగతీర్ధం, నందక తీర్ధం, కౌమోదక తీర్ధం అని పంచాయుధ తీర్దాలున్నాయి. 
ఆ తీర్దాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వేంకటాచలం వస్తారు. 
తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ్య కీర్తనలో కూడా వివరించారు. 
కొండలలో నెలకొన్న ఉదాహరణకి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు.

భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చిన వారు సింహాదను చంపెవారే ఎందుకంటె.. 
చంపేవి భగవంతుని శక్త్యాయుధాలు కానీ వారు కాదు కాబట్టి. వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చును కానీ పిలిపించి, అడక్కుండా అనుగ్రహించి, అతనికి కీర్తిని ఇవ్వడానికే, చేసిన భక్తి శ్రద్ధలకు, కైన్కర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామి వారు ఈ లీల చేసారు. 
మనకేది మంచో, మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు...మనం చూపించవలిసనిదల్లా ఆయన మీద భక్తిశ్రద్ధలు.

ఆ ద్వాపరంలోని శ్రీ కృష్ణుడే నేడు వేంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు...శ్రీనివాసో రక్షతు!!

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS