Thursday, April 16, 2020

శని దోష పరిహారం:

శని దోష పరిహారం:

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు - ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది.

1. నీలం:
శని వల్ల ‘నీలం' ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.

2. ఉదయం నడక సాగించాలి :
శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి. సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది.

3. నువ్వుల నూనె:
శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి.

4. తడికాళ్ళతో నిద్రవలదు:
తడికాళ్ళతో నిద్రించరాదు.పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గది, బెడ్రూం, పరిశుభ్రంగా ఉండాలి. సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి.

5. చీమలకు ఆహారం :
శ్రమ జీవులు అయిన చీమలకు తేనే గాని చెక్కెర గాని వెయ్యాలి. ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపియ్యాలి. నల్ల కుక్కలకి, కాకులకి ఆహారం వెయ్యాలి.

6. మెడిటేషన్:
ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి. మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం,వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చెయ్యాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.

7. కాళికాదేవి లేదా శివున్ని :
శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి.ఇనుముతో చేసిన శివలింగాన్ని గాని, కాళికాదేవిని గాని పూజించాలి. ఏడమచేతి మద్యవేలికి గుర్రపు నాడా రింగ్ దరించాలి. అయ్యప్ప దీక్ష దారణ చెయ్యటంగాని, అయ్యప్ప భక్తులకు భోజనం పెట్టటంగాని చెయ్యాలి.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS