Friday, April 17, 2020

"తెలుగులో రామాయణాలు" - పుస్తకం పేరు

తెలుగులో రామాయణాల గురించి చాలా మందికి తెలియదు అని వారనగానే నిజమే కదా అనిపించింది.  మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు తెలుగులో ఉన్న రామాయణాలని ("తెలుగులో రామాయణాలు" - పుస్తకం పేరు ) క్లుప్తంగా పరిచయం చేశారు.
 

1.  నన్నయ్య రాఘవాభ్యుదయము అనే కావ్యము భారతానికి ముందే రాశారుట.
2. నిర్వచనోత్తర రామాయణము - తిక్కన
3. ఎర్రన రామాయణము  - ఎర్రన
4. భాస్కర రామాయణము -  భాస్కరుడు
5. మొల్ల రామాయణము - మొల్ల
6. రఘునాధరామాయణము - రఘునాధుడు
7. గోపీనాథరామాయణము - గోపీనాథము వేంకట కవి
8. ఆంధ్రవాల్మీకి రామాయణము - వావిలికొలను సుబ్బారావు 
9. శ్రీకృష్ణ రామాయణము - శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి
10. శ్రీరామ కథామృతము - తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి 
11. ఆంధ్ర శ్రీమద్వాల్మీకి రామాయణము - జనమంచి శేషాద్రిశర్మ
12. శ్రీమద్రామాయణ కల్పవృక్షము - విశ్వనాథ సత్యనారాయణ
13. శ్రీరామాయణము - వేంకటపార్వతీశ్వర కవులు
14. విశిష్టరామాయణము - గడియారము వేంకటశేషశాస్త్రి
15. సుభద్రారామాయణము - సీరము సుభద్రయాంబ
16. సరస్వతీ రామాయణము - చేబ్రోలు సరస్వతీదేవి
17. గోవింద రామాయణము - ఆత్మకూరి గోవిందాచార్యులు
18. రంగనాథ రామాయణము - గోనబుద్ధారెడ్డి
19. వరదరాజ రామాయణము - కట్టా వరదరాజ
20. ఏకోజీ రామాయణము - ఏకోజీ
21. ది్వపదోత్తర రామాయణము - ముడుంబై వేంకట కృష్ణమాచార్యులు
22. వాసిష్ఠరామాయణము - తరిగొండ వెంగమాంబ
23. ఆధ్యాత్మ రామాయణము - మేలికైత మామిడన్న సుభద్రాంబ
24. ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
25. జ్ఞానవాసిష్ఠము - మడికి సింగన
26. తత్వ్తసంగ్రహ రామాయణము - ఆకొండి వేంకటకవి
27. విచిత్ర రామాయణము - నరసింహదేవర వేంకటశాస్త్రి
28. అద్భుతోత్తర రామాయణము - నాదెళ్ళ పురుషోత్తమకవి

ఇంకా చంపూ రామాయణాలు, అన్యభాషలనుండి రామాయణాలు, అచ్చ తెలుగులో రామాయణాలు, స్త్రీల పాటలలో రామాయణము,  యక్షగానములో రామాయణాలు, వచనములో రామాయణాలు,  వాడుకభాషలో రామాయణాలు ఉన్నాయి.

ఒక్కో రామాయణాన్ని గురించి చక్కగా  ఈ పుస్తకంలో వివరించారు శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు.  

***

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS